Viral video: Mahindra XUV 700 సన్‌రూఫ్ నుంచి కారులోకి వర్షపు నీళ్లు లీక్, నాణ్యతపై అనుమానాలు - వైరల్ వీడియో
Mahindra XUV700 Viral Video: మహీంద్రా XUV700 సన్‌రూఫ్ నుంచి నీరు కారుతున్న సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది, ఇది ఆ కారు నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తింది.

Mahindra XUV 700 Sunroof Rainwater Leakage: మహీంద్రా XUV 700... ఆశ్చర్యపరిచే పనితీరుతోపాటు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. అయితే, ఇప్పుడు ఆ కారు సన్‌రూఫ్ నుంచి వర్షపు నీళ్లు కారుతున్న సంఘనట తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది, మహీంద్రా XUV 700 నాణ్యత గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహీంద్రా XUV700 యజమాని, భారీ వర్షం సమయంలో, పనోరమిక్ సన్‌రూఫ్ నుంచి నీరు కారుతున్న వీడియోను షేర్ చేశారు.
View this post on Instagram
మహీంద్రా, భారతదేశంలోని అతి పెద్ద SUV కంపెనీలలో ఒకటి & XUV 700 దాని ప్రీమియం SUV. సన్‌రూఫ్‌ను సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, ఈ స్టైలిష్ ఫీచర్ కూడా కొన్నిసార్లు ఇబ్బందులకు కారణం కావచ్చు. అసలు, సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారు లోపలకు కారడానికి కారణమేంటి?, తెలుసుకుందాం.
సన్‌రూఫ్ నుంచి నీరు ఎందుకు కారుతుంది?
పనోరమిక్ సన్‌రూఫ్‌లను పూర్తిగా వాటర్ ప్రూఫ్‌గా ఉండేలా తయారు చేయలేదు, కానీ అవి నీటిని నిరోధిచగలవు. సన్‌రూఫ్ నిర్మాణం చుట్టూ రబ్బరు బీడింగ్ ఉంటుంది & దాని కింద వర్షపు నీటిని బయటకు పంపేందుకు రూపొందించిన డ్రైనేజీ వ్యవస్థ (పైపులు) ఉంటుంది. ఈ డ్రైనేజీ పైపులు దుమ్ము, ఆకులు లేదా ధూళితో మూసుకుపోయినప్పుడు, నీరు బయటకు పోయడానికి బదులుగా కారు క్యాబిన్ లోపలకు లీక్ కావడం ప్రారంభమవుతుంది. చాలా కాలం పాటు బయట పార్క్ చేసిన లేదా క్రమం తప్పకుండా శుభ్రం చేయని వాహనాలలో ఇలా జరగడం చాలా సాధారణం.
ఈ సమస్యను ఎలా నివారించాలి?
మహీంద్రా XUV 700 లేదా పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న ఏదైనా ఇతర కారు మీ దగ్గర ఉంటే, కొన్ని చిట్కాల ద్వారా ఈ రకమైన లీకేజీ సమస్యను నివారించవచ్చు. ముందుగా, వర్షాకాలం ప్రారంభమయ్యే ముందే మీ కారును సర్వీస్ చేయించుకోండి, ఇందులో భాగంగా సన్‌రూఫ్ & దాని డ్రైనేజీ వ్యవస్థను తనిఖీ చేయించడం కూడా మరిచిపోవద్దు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి, సన్‌రూఫ్ కింద ఉండే డ్రైనేజీ పైపులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి, తద్వారా వాటిలో ఎలాంటి దుమ్ము, ఆకులు లేదా వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. మీ కారు తరచుగా/ఎప్పుడూ బయట పార్క్ చేస్తుంటే, కారును కవర్‌తో కప్పి ఉంచాలి. తద్వారా ధూళి పేరుకుపోదు & డ్రైనేజీ వ్యవస్థ ప్రభావితం కాదు. మీరు సన్‌రూఫ్‌ను సరిగ్గా చూసుకుంటే, మీరు ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చు & ఎటువంటి లీకేజీ లేకుండా మీ సన్‌రూఫ్ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.
మహీంద్రా XUV 700 ఇంజిన్ పవర్ & మైలేజ్
మహీంద్రా XUV 700 రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో లభ్యమవుతోంది (ఒకటి 1999cc పెట్రోల్ ఇంజిన్ & మరొకటి 2198cc డీజిల్ ఇంజన్) & 4-సిలిండర్ ఇంజిన్‌పై పని చేస్తుంది. కస్టమర్లు, తమ ఇష్టానుసారం మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే.. ఈ SUV మోడల్ & ఇంధన రకాన్ని బట్టి లీటరుకు 13 కి.మీ. నుంచి 17 కి.మీ. వరకు మైలేజీ ఇస్తుంది. XUV 700 ఒక 7-సీటర్ కారు, పెద్ద ఫ్యామిలీ హాయిగా ప్రయాణించవచ్చు.





















