Kinetic DX Electric Scooter: ఎలక్ట్రిక్ అవతార్‌లో కైనెటిక్ DX లాంచ్ - ఫుల్లుగా స్మార్ట్ ఫీచర్లున్న ఈ స్కూటర్ యువతకు నచ్చుతుందా?
Kinetic DX Smart Features: కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ & ఆకారం పాత మోడల్‌ను (రెట్రో స్టైల్) పోలి ఉంటుంది. కానీ, ఈ స్కూటర్ కోసం ఉపయోగించిన టెక్నాలజీ పూర్తిగా కొత్తది.

Kinetic DX Electric Scooter Price, Range And Features: ఒకప్పుడు, భారతదేశ రోడ్లను ఏలిన కైనెటిక్ హోండా DX ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్‌లో (Kinetic DX Electric) తిరిగి వచ్చింది. కొత్త కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెట్రో బాక్సీ డిజైన్ & అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ ఫీచర్లతో లాంచ్ చేశారు. ఈ బండి ఆకారం, మునుపటి పెట్రోల్ మోడల్‌ను గుర్తు చేస్తున్నప్పటికీ, కొత్త వెర్షన్‌లో చాలా కొత్త & స్మార్ట్ ఫీచర్లను జోడించారు, నేటి వినియోగదారుల అవసరాలను తీర్చేలా తీర్చిదిద్దారు.
డిజైన్
కైనెటిక్ DX ఎలక్ట్రిక్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, దాని డిజైన్ అసలు కైనెటిక్ హోండా DXని పూర్తిగా గుర్తుకు తెస్తుంది. అదే బాక్సీ బాడీ స్టైల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ ఉపయోగించారు, ఇప్పుడు ఇది షార్ప్ & క్లీనర్ లైన్స్‌తో వచ్చింది. ఇది, ఈ స్కూటర్‌ను క్లాసిక్‌గా & ఆధునికంగా కనిపించేలా మార్చింది. ఇందులో.. LED లైటింగ్, అందమైన ప్రకాశవంతమైన కైనెటిక్ లోగో & పాత స్కూటర్ డయల్స్‌ను గుర్తుకు తెచ్చే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. మొత్తంగా, ఈ స్కూటర్‌ను సరైన రెట్రో-మోడరన్ మిక్స్‌లా మార్చి డిజైన్ ప్రియులకు అందించారు.
సైజ్ & స్టోరేజ్
కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ వీల్‌బేస్ 1314 mm, సీటు ఎత్తు 704 mm & 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ స్టోరేజ్ కెపాసిటీ ఈ సెగ్మెంట్‌లోని ఇతర స్కూటర్ల కంటే చాలా మెరుగ్గా ఉంది & కాబట్టి దీనిని ప్రాక్టికల్ ఫ్యామిలీ స్కూటర్‌గా చూడవచ్చు.
బ్యాటరీ, రేంజ్ & ఛార్జింగ్ టైమ్
కైనెటిక్ DX ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లలో (DX & DX+) అందుబాటులో ఉంది. రెండూ 4.8kW బ్యాటరీ & 2.6 LFP బ్యాటరీ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉన్నాయి. DX వేరియంట్ 102 కి.మీ & DX+ 116 కి.మీ. రేంజ్‌ను ఇస్తాయి. ఈ రెండు బ్యాటరీలు 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. రోజువారీ ఆఫీసు, కాలేజీ & నగరంలోని పని కోసం అప్&డౌన్ చేయడానికి ఈ రేంజ్ చాలా చక్కగా పనికొస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు
కైనెటిక్ DX స్కూటర్ కీలెస్ ఇగ్నిషన్, పాస్‌వర్డ్ స్టార్ట్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ స్పీకర్, మూడు రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ & OTA అప్‌డేట్‌లు & DX+ వేరియంట్‌లో జియోఫెన్సింగ్ వంటి స్మార్ట్ & సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో లాంచ్ అయింది. దీంతో, ఈ స్కూటర్ టెక్నాలజీ-ఫార్వర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.
ధర
హైదరాబాద్ & విజయవాడలో, కైనెటిక్ DX ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) & DX+ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర కొంచెం ప్రీమియంగా అనిపిస్తున్నప్పటికీ, ఈ బండి రెట్రో డిజైన్, బ్రాండ్ వాల్యూ & స్మార్ట్ ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే, డబ్బుకు తగిన విలువ అందించగలదు.
నాణ్యత & పోటీ
కైనెటిక్ DX, మంచి డిజైన్ & కైనెటిక్ బ్రాండ్ గుర్తింపు కారణంగా మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ఫినిషింగ్ & డీటెయిలింగ్ చాలా బాగుంది, ఇది ఈ స్కూటర్‌ను ప్రీమియం EV అనిపించేలా చేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రపంచంలో ఇప్పటికే Ola S1, Ather 450X & TVS iQube వంటి పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. ఈ పరిస్థితిలో, పోటీలో నిలబడటానికి కైనెటిక్ DX వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని & మంచి సర్వీస్‌ను అందించాల్సి ఉంటుంది.





















