అన్వేషించండి

Tata Nexon Facelift: త్వరలో రానున్న టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ - 6 ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీ, బెటర్‌ మైలేజ్ - రేటు తక్కువే!

2025 Tata Nexon Facelift Features: కొత్త టాటా నెక్సాన్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే, నెక్ట్స్‌ జనరేషన్‌ కారు ఆధునిక డిజైన్ & అధునాతన సాంకేతికతతో వస్తుంది. ప్రస్తుతం ఉన్న కారు ధర రూ. 8 లక్షలు.

New Tata Nexon Facelift Launch Date, Price And Features: టాటా మోటార్స్, జనం మెచ్చిన తన పాపులర్‌ నెక్సాన్‌ను కొత్త అవతారంలో (ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, దీనికి గరుడ్ (Garud) అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. కొత్త టాటా నెక్సాన్‌ను 2027లో లాంచ్‌ చేయవచ్చు. ఈ కారు, ఇప్పటికే ఉన్న X1 ప్లాట్‌ఫామ్‌కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌పై ఆధారపడి తయారవుతుంది. కొత్త కారు డిజైన్ & ఇంటీరియర్‌లో కీలక అప్‌డేట్స్‌ ఉంటాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా నెక్సాన్‌తో పోలిస్తే, కొత్త మోడల్‌ మోడరన్‌ డిజైన్ & అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కలబోతగా వస్తుంది. ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో, టాటా నెక్సాన్‌ను కేవలం రూ. 8 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు (Tata Nexon ex-showroom price, Hyderabad) కొనుగోలు చేయవచ్చు. కొత్త వెర్షన్‌ రేటు ఇంకొంచం ఎక్కువగా ఉన్నప్పటికీ, కామన్‌ మ్యాన్‌ బడ్జెట్‌ మాత్రం దాటదని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.

టాటా నెక్సాన్‌ కొత్త డిజైన్ & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
కొత్త టాటా నెక్సాన్ డిజైన్, టాటా కర్వ్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణతో రూపొందుతుంది. ఈ కారు ఫుల్లీ LED లైట్ బార్, సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు & సీక్వెన్షియల్ LED DRLs ను కలిగి ఉంటుంది. ఇంకా... ఇంటీరియర్‌లో కూడా చాలా గణనీయమైన మార్పులను చూసే అవకాశం ఉంది. ఈ కారులో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు సహా, ప్రయాణీకుల భద్రత కోసం అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లను అందిస్తారు. 

10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే & 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే వంటి లేటెస్ట్‌ టెక్నాలజీలు కొత్త టాటా నెక్సాన్‌లో ఉంటాయి. ఈ కారులో వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా... 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్నాయి. 

టాటా నెక్సాన్‌ ప్రస్తుత వెర్షన్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌
ప్రస్తుతం ఉన్న టాటా నెక్సాన్‌, ఇప్పటికే, గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ (GNCAP) & భారత్‌ ఎన్‌క్యాప్‌ (BNCAP) క్రాష్‌ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్‌ సాధించింది, అంటే, చిన్న పిల్లలు సహా ఫ్యామిలీతో కలిపి ప్రయాణించడానికి సురక్షితమైనది. 6 ఎయిర్‌ బ్యాగులు, ABS, ESP వంటి ఫీచర్లు నెక్సాన్‌లో అందుబాటులో ఉన్నాయి, భద్రత పరంగా ఇది బలమైన కారు. 

భారత మార్కెట్లో, Maruti Suzuki Brezza, Hyundai Venue & Mahindra XUV 3XO వంటి SUVలతో టాటా నెక్సాన్‌ పోటీ పడుతుంది.

బెటర్‌ మైలేజీ
ప్రస్తుత టాటా నెక్సాన్ పెట్రోల్ మోడల్ లీటరుకు 17 km నుంచి 17.44 km & డీజిల్ మోడల్‌ లీటరుకు 23.23 km నుంచి 24.08 km & CNG వేరియంట్ కిలోగ్రాముకు 17.44 km మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇంజిన్ ట్యూనింగ్ & బరువు తగ్గడం కారణంగా కొత్త టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ మైలేజ్ మెరుగుపడుతుందని ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget