Kia Syros: కియా సైరోస్ లాంచ్ అయ్యేది ఆరోజే - సోనెట్‌ను మించిన కారు!
Kia Syros India Launch: ప్రముఖ కార్ల బ్రాండ్ కియా మనదేశంలో సైరోస్ అనే కొత్త కారును త్వరలో లాంచ్ చేయనుంది. డిసెంబర్ 19వ తేదీన కియ సైరోస్ కారు మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది.
Kia Syros India Launch Date: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కార్ల బ్రాండ్ కియా మనదేశంలో కొత్త కారును లాంచ్ చేయనుంది. అదే కియా సైరోస్. డిసెంబర్ 19వ తేదీన ఈ కారు భారతీయ మార్కెట్లో అడుగు పెట్టనుంది. కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కారెన్స్ తర్వాత భారతదేశంలో ఎంట్రీ ఇవ్వనున్న నాలుగో ఎస్‌యూవీ ఇదే. తాజాగా దీని టీజర్లలో ఈ ఎస్‌యూవీ బాక్సీ షేప్‌లో కనిపించింది. ఇదే దీనికి పెద్ద ప్లస్ పాయింట్.
కియా సైరోస్‌లో ప్రధాన ఫీచర్లు ఇవే...
కియా సైరోస్ టాప్ ఎండ్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, వర్టికల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మల్టీ ఎలిమెంట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, లెవల్ 1 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీంతోపాటు ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Also Read: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
కియా సోనెట్ కంటే కాస్త పెద్ద కారు కొనాలనుకునే వారికి ఇది కాస్త మంచి ఆప్షన్. ఎందుకంటే కియా సైరోస్‌లో రెండో వరుసలో స్పేస్ ఎక్కువ ఉంటుంది. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కియాలోనే కొత్త కారు కొనాలని అనుకుంటూ కాస్త పెద్ద కారు అయితే బెటర్ అనుకునే వాళ్లను సైరోస్ కచ్చితంగా ఆకర్షిస్తుంది.
సోనెట్ ఇంజినే సైరోస్‌లో కూడా...
కియా సోనెట్ కంటే కాస్త పై రేంజ్‌లో సైరోస్ ధర ఉండనున్నట్లు తెలుస్తోంది. కియా సైరోస్‌లో సోనెట్ ఇంజినే అందిస్తున్నట్లు తెలుస్తోంది. కియా సోనెట్‌లో 81 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 118 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 114 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు లాంచ్ అయింది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఐఎంటీ, 7 స్పీడ్ డీసీటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
మనదేశంలో కియా కార్లకు మంచి మార్కెట్ ఉంది. 2019లో కియా మనదేశంలో అడుగుపెట్టింది. అడుగు పెట్టిన ఐదు సంవత్సరాల్లో మిలియన్ సేల్స్ మార్కును కియా దాటేయడం విశేషం. అంటే మొత్తం భారతదేశంలో కియా కార్లు 10 లక్షల వరకు తిరుగుతున్నాయన్న మాట. దీన్ని బట్టి కియా తక్కువ కాలంలోనే ఎంత సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కియా సైరోస్ కూడా సక్సెస్ అయితే మనదేశంలో కియా సేల్స్ మరింత పై స్థాయికి చేరే అవకాశం ఉంది.
It’s like a wish coming true.
— Kia India (@KiaInd) November 25, 2024
A big leap in SUV design.
All-new Kia Syros. Evolved by the future.#TheNextFromKia#Kia #KiaIndia #TheKiaSyros #ComingSoon #movementthatinspires