అన్వేషించండి

Kia Sorento: భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు

Kia Sorento: కియా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. రూ.27.99 లక్షల స్టార్టింగ్ ధరతో కియా సోరెంటో ఎస్‌యూవీని లాంచ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కియా సోరెంటో రూ.27.99 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదలైంది.
  • విశాలమైన క్యాబిన్, అధునాతన ఫీచర్లు, 6/7 సీట్ల ఆప్షన్‌లు ఉన్నాయి.
  • 7-10 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, సరౌండ్ వ్యూ మోనిటర్‌తో అత్యుత్తమ భద్రత.
  • హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్‌లు, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో లభ్యం.

Kia Sorento: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా' భారత మార్కెట్‌లో కొత్త మోడల్ కియా సోరెంటో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. భారత్‌లో దీని స్టార్టింగ్ ధర రూ. 27.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కియా సాల్టోస్ కంటే హై రేంజ్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఐసీఈ ఎస్‌యూవీ, మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్‌వ్యాగన్ టైరాన్‌లకి గట్టి పోటీ ఇస్తుందని ఎక్స్‌ఫర్ట్ అంటున్నారు.  

డిజైన్, డైమెన్షన్స్

కియా సోరెంటో పొడవు 4,815 మి.మీ, వెడల్పు 1,900 మి.మీ, ఎత్తు 1,785 మి.మీ, వీల్‌బేస్ 2,815 మి.మీటర్లు. ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన, వెడల్పాటి ఎస్‌యూవీగా ఉంది.  
వర్టికల్‌గా ఉండే హెడ్‌లాంప్స్‌, డీఆర్‌ఎల్‌లు, కియా సిగ్నేచర్ 'టైగర్-నోస్' గ్రిల్ దీనికి సూపర్ లుక్‌ని ఇస్తున్నాయి. బ్యాక్ సైడ్ వర్టికల్ టైల్ లాంప్స్‌ ఉన్నాయి. 18 ఇంచుల అల్లాయ్ వీల్స్‌తో బాక్సీ డిజైన్‌లో లభిస్తుంది. ఆల్-బ్లాక్ వర్షన్‌తో సహా మొత్తం 8 కలర్ ఆప్షన్‌లలో ఈ కారు అందుబాటులోకి వస్తుంది. 

ఇంటీరియర్, ఫీచర్లు  

ఈ ఎస్‌యూవీ క్యాబిన్ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 4 ఇంచుల లేదా 12.3-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. సీసీఎన్‌సీ నావిగేషన్ సిస్టమ్, కియా కనెక్ట్ 2.0, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే,  జనరేటివ్-AI అసిస్టెంట్‌తో వస్తుంది.
మొదటి రెండు వరుసలలో వెంటిలేటెడ్ సీట్లు, రిలాక్సేషన్ సీట్లు, 10 వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, 4 వే పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, 12-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రెండో వరుసలో రీక్లైన్, స్లైడ్ ఫంక్షన్లతో పాటు రిమోట్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది. 

సెఫ్టీ ఫీచర్లు

 బేస్ వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, టాప్ వేరియంట్లలో 10 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. టాప్-స్పెక్ మోడల్‌లో లెవెల్ 2+ ADAS, సరౌండ్-వ్యూ, బ్లైండ్-వ్యూ మోనిటర్లు, రిమోట్ పార్కింగ్ అసిస్టెన్స్, డిజిటల్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్, ఇంజిన్ ఆప్షన్లు  

భారత మార్కెట్‌లో కియా నుంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ఆల్-వీల్ డ్రైవ్‌తో వచ్చిన మొదటి మోడల్ ఇదే.

1.6 లీటర్ల పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్:  

2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్:

  • పవర్ & టార్క్: 193 hp, 442 Nm టార్క్
  • డ్రైవ్‌ట్రెయిన్: లోయర్ వేరియంట్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్, హైయర్ HTX వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్‌తో వస్తాయి. 

వివిధ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్‌లు, టెర్రైన్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. HTE, HTK, HTX అనే మూడు మెయిన్ ట్రిమ్‌లలో ఈ కారు అందుబాటులోకి రానుంది.
Also Read: రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి

Frequently Asked Questions

కియా సోరెంటో ప్రారంభ ధర ఎంత?

కియా సోరెంటో భారత మార్కెట్‌లో రూ. 27.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది కియా నుంచి కొత్తగా వచ్చిన మోడల్.

కియా సోరెంటో ఏ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది?

ఇది 1.6 లీటర్ల పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. హైబ్రిడ్ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్‌తో అందుబాటులో ఉంటుంది.

కియా సోరెంటోలో ఎన్ని సీటింగ్ ఆప్షన్లు ఉన్నాయి మరియు ముఖ్య ఫీచర్లు ఏమిటి?

ఈ ఎస్‌యూవీ 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు దీని ముఖ్య ఫీచర్లు.

కియా సోరెంటోలో ఏ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి?

బేస్ వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, టాప్ వేరియంట్లలో 10 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. టాప్-స్పెక్ మోడల్‌లో లెవెల్ 2+ ADAS, సరౌండ్-వ్యూ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget