Kia EV9: సూపర్ ప్రీమియం కియా ఈవీ9 వచ్చేసింది - రేటు చూస్తే మాత్రం షాకే!
Kia New Electric Car: దక్షిణ కొరియాకు చెందిన కార్ల బ్రాండ్ కియా మనదేశంలో కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. అదే కియా ఈవీ9. దీని ధర మనదేశంలో రూ.1.3 కోట్ల నుంచి ప్రారంభం కానుంది.
Kia EV9 Launched: ప్రముఖ కార్ల బ్రాండ్ కియా మనదేశంలో తన కొత్త కారును లాంచ్ చేసింది. అదే కియా ఈవీ9. ఈ కారును కియా మొదటగా 2022లో ప్రదర్శించింది. ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు. దీని ధర ఏకంగా రూ.1.3 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం ధర. ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ ఎండ్ జీటీ లైన్ ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. కియా ప్రీమియం ఈవీ లైనప్‌లో ఇది జాయిన్ అయింది. కియా ఈవీ6తో పాటు ఇది జాయిన్ అవ్వనుంది. దీన్ని పూర్తిగా సీబీయూగా విక్రయించనున్నారు. అంటే వేరే దేశాల్లో రూపొందిన కారును ఇంపోర్ట్ చేసి విక్రయించనున్నారన్న మాట.
ఇంటర్నేషనల్ మార్కెట్ వెర్షన్‌లో ఏ డిజైన్‌తో అయితే లాంచ్ అయిందో అదే డిజైన్‌తో మనదేశంలో కూడా లాంచ్ అయింది. మోడర్న్, బాక్సీ లుక్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ లైట్స్‌తో కియా ఈవీ9 ఎంట్రీ ఇచ్చింది. 20 అంగుళాల అల్లోయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐదు కలర్ ఆప్షన్లలో ఈ కారు లాంచ్ అయింది. స్నో వైట్ పెరల్, అరోరా బ్లాక్ పెరల్, పంథేరా మెటల్, పెబుల్ గ్రే, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఏ ఫీచర్లు ఉండనున్నాయి?
కియా ఈవీ9 కారులో ఎన్నో ఫీచర్లు అందించారు. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ ఉన్న ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, హెడ్ అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కెప్టెన్ సీట్లు, 14 స్పీకర్ మెరీడియన్ ఆడియో సిస్టం, త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్... ఇలా ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
సూపర్ అనిపించే సేఫ్టీ ఫీచర్లు...
10 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, వీఎస్ఎం, ఫ్రంట్, సైడ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ లెవల్ 2 ఫీచర్లతో పాటు అవాయిడన్స్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
కియా ఈవీ9 ఇండియన్ వెర్షన్‌లో 99.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉన్న డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఉంది. రెండూ కలిపితే 384 హెచ్‌పీ పవర్, 700 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేయనున్నాయి. దీంతో గంటలకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు 5.3 సెకన్లలోనే అందుకోనుంది. సింగిల్ ఛార్జింగ్ ఇది ఏకంగా 561 కిలోమీటర్లు ప్రయాణించనుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 24 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ ఎక్కనుంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?