అన్వేషించండి

Kia EV6 Lease: రూ.65 లక్షలు విలువ చేసే కారుని కేవలం లక్షా 29 వేలకే ఇంటికి తీసుకువెళ్లండి, ప్రాసెస్‌ ఇదే!

Kia EV6:కియా ఈవీ6 మోడల్‌ని లీజు విధానంలో అందుబాటులో తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కారుని కేవలం నెలకు 1.29 లక్షలు చెల్లించడం ద్వారా లీజ్‌కి తీసుకోవచ్చని తెలిపింది.

Kia EV6 Price: దేశవ్యాప్తంగా కియా మోటార్స్ కార్లను సేల్‌ చేయడమే కాకుండా లీజు ప్రాతిపదికన కార్లను అందిస్తుంది. ఈ సదుపాయం వల్ల కమర్షియల్‌ లేదా ఇతర రెంటల్‌ కార్ల కోసం చూసేవారికి కలిసి రానుంది. ఏదైనా బిజినెస్‌ లేదా సొంత అవసరాల కోసం కార్లను కొనుగోలు చేయాల్సి వస్తే ఈ విధానం లాభదాయకంగా ఉంటుంది. ఆయా కంపెనీలు అందించే లీజింగ్‌ విధానంతో నెలవారీ వాయిదాలు చెల్లించడం ద్వారా సొంత కారులా వాడుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ కియా సోనెట్, కియా సెల్టోస్ మరియు కియా కేరన్స్ మోడళ్లను లీజ్‌ కింద అందుబాటులో ఉంచింది.

లీజుకు EV6

కియా నుంచి విక్రయానికి అందుబాటులో ఉన్న హై-ఎండ్ వేరియంట్‌ కియా EV6 (Kia EV6) మోడల్‌ని కూడా లీజు విధానం కింద అందుబాటులో తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు 64.11 నుంచి రూ. 69.39 లక్షలు మధ్య ఉంది. అయితే దీన్ని కేవలం నెలకు 1.29 లక్షలు చెల్లించడం ద్వారా లీజ్‌కి తీసుకోవచ్చని తెలిపింది. దీంతో భారీ ఖరీదైన ఈ కారుని తక్కువ ధరకే మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చు అన్నమాట.

బ్రాండ్ అలవాటు చేసేలా

ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు వినియోగదారులకు నేరుగా విక్రయించే బదులు లీజు ప్రాతిపదికన వాహనాలను విక్రయిస్తున్నాయి. తయారీదారులకు నెలవారీ అద్దె చెల్లింపుల ద్వారా ప్రయోజనం లభించడంతో పాటు.. ఎక్కువ మంది కస్టమర్‌లకు తమ బ్రాండ్‌ కారు సేవలను మరింత అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కార్ల బ్రోకరేజీలు ప్రస్తుతం ఈ సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు కారు కంపెనీలు సైతం ఈ బిజినెస్‌లోకి రంగ ప్రవేశం చేస్తున్నాయి.

17,999 నుంచి మొదలు

సరిగ్గా రెండు నెలల క్రితం కియా తన వాహనాలకు లీజింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కియా సోనెట్‌ కోసం నెలవారీ లీజు కోసం రూ.17,999, కియా సెల్టోస్ కోసం రూ. 23,999, కియా కేరన్స్ కోసం రూ. 24,999 నెల వారి అద్దె (Rent) చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు, ఖరీదైన EV6 కేవలం నెలకు రూ. 1.29 లక్షల లీజ్‌కి అందుబాటులోకి వచ్చింది.



లీజ్‌ వల్ల ప్రయోజనాలు
లీజ్‌ తీసుకోవడం వల్ల కేవలం మీరు పూర్తి అమౌంట్‌ చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు  ఇన్సూరెన్స్‌, పికప్ మరియు డ్రాప్ సేవలు, 24-గంటల రోడ్‌ అసిస్టన్స్‌, కియా నుంచి ఉచిత సర్వీసింగ్‌ కవరేజ్‌ లభిస్తుంది. కారును లీజుకు తీసుకునే కస్టమర్లు ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా లీజ్‌కి తీసుకోవచ్చు. ఈ లీజింగ్ అనేది కొందరి వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నాలుగు విభాగాల్లోని వారు మాత్రమే ఈ వాహనాన్ని కొనుగోలు చేయగలరు. అందులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)లో రిజిస్టర్ అయిన వైద్యులు, ICAIలో నమోదు చేసుకున్న చార్టర్డ్ అకౌంటెంట్లు, సొంత వ్యాపారం కలిగి ఉన్న యజమానులు, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఈ కార్లను లీజ్‌కి తీసుకోవచ్చు.

Also Read: టాప్-4 మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే - అన్నీ ఈ సంవత్సరమే లాంచ్!

EV6 స్పెసిఫికేషన్‌లు
ఇక కియా EV6 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 225.86 bhp నుంచి 320.55 bhp మధ్య పవర్ అవుట్‌పుట్ ఉత్పత్తి చేస్తుంది. కారుని AC ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో ఫుల్‌ 10-80% ఛార్జ్ చేయవచ్చు. ఇక కారుతో అందిచే DC ఛార్జర్‌తో 0-80% ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు గంటకు 192 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. పూర్తి ఛార్జ్‌పై ఇది 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇక కేవలం 5.2 సెకన్లలో ఈ కారు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Also Read: సూపర్ హిట్ బైక్‌కు కొత్త వెర్షన్ - త్వరలో రానున్న 2024 హీరో ఎక్స్‌ట్రీమ్!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget