అన్వేషించండి

Kakinada News: ఇరుకు సందుల్లోనూ దూసుకెళ్లే కారు.. కాకినాడ కుర్రాడి సరికొత్త ఆవిష్కరణ..!

ఇరుకు సందుల్లోనూ కారు సైజు త‌గ్గించుకుని దూసుకుపోవ‌చ్చు అంటున్నాడు కాకినాడ‌కు చెందిన సుధీర్ అనే యువ‌కుడు.. స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌కు ప్రోత్స‌హ‌మందిస్తే మ‌రింత డెవ‌ల‌ప్ చేస్తానంటున్నాడు..

Kakinada News | మనం సాధారణంగా ఇళ్లల్లో ఎక్సాండబుల్‌ టేబుల్స్‌, ఛైర్స్‌, కాట్స్‌ చూస్తుంటాం కదా.. వీటి వినియోగం కూగా ఇటీవల కాలంలో బాగా పెరిగిందనే చెప్పవచ్చు.. ఎందుకుంటే ఇరుకు ఇళ్లల్లో ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.. కావాల్సినప్పుడు వాటిని విస్తరించుకోవచ్చు.. లేక పోతే మడిచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు ఓ ఆవిష్కణ చేశాడు.. ఇతని ఆలోచనకు ప్రధానంగా సామాజిక అవసరం కూడా ఉందని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశాడు.. ఆ కుర్రాడే కాకినాడకు చెందిన సుధీర్‌..

సుధీర్‌ గ్రాడ్యుయేషన్‌(బీకాం) పూర్తిచేసినప్పటికీ ఇంజనీరింగ్‌ విభాగం అంటే అత్యంత ఆశక్తితో ఆరంగంలోనే ఏదో ఒకటి చేయాలని తన ఆలోచనతో తనకు మించిన వ్యయప్రయాసలతో చాలా వరకు అనుకున్న ఆవిష్కరణకు కొంత వరకు రూపాన్ని తేగలిగాడు.. తల్లిని కోల్పోయి తండ్రి సంరక్షణలో ఉన్న ఈ యువకుడు తనకు ఇంకొంత డబ్బు, టెక్నాలజీ తోడైతే పూర్తిగా తన ఆవిష్కరణ లక్ష్యాన్ని ఛేదిస్తానని చెబుతున్నాడు..  ఇంతకీ ఈ యువకుడు. ఆ ఆవిష్కరణ ఏంటో చూడాలంటూ ఈ స్టోరీ చదవాల్సిందే..
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇరుకు రోడ్లులోకి అంబులెన్స్‌లు, ఫైర్‌ వెహికల్స్‌(అగ్నిమాపక శకటం)లు చేరుకునేందుకు అనేక అవరోధాలు ఎదురవుతుంటాయి.. ఆ సమయంలో ఆ రోడ్డుకు దగ్గట్టుగా ఆ వెహికల్‌ అడ్జస్ట్‌ అవ్వగలిగితే... అదేవిధంగా ట్రాఫిక్‌లు జామ్‌ అయినప్పడు..పక్క సందులోనుంచి వెహికల్‌ వెళ్లిపోయేలా అడ్జస్ట్‌ అవ్వగలిగితే.. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ ఆవిష్కరణకు అడుగులు వేశాడు. 

వెల్డర్‌ దగ్గర పనిచేస్తూ..

తన ఆవిష్కరణ లక్ష్యాన్ని ఛేదించేందుకు సుధీర్‌ కాకినాడ మెయిన్‌రోడ్డు కు ఆనుకుని ఉన్న పోస్టాఫీసు సమీపంలో ఓ వెల్డర్‌ దగ్గర పనికి చేరాడు.. అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూనే తనకు కావాల్సిన రూపంలో ఓ వెహికల్‌ తయారు చేసేందుకు అతనిని ఒప్పించాడు.. తన ఆలోచనను విన్న అతను మొదట్లో పెద్దగా ఆసక్తి కనపరచకపోయినా ఆతరువాత మొత్తం మీద పనిప్రారంభించారు. ఇలా కావాల్సిన ఐరెన్‌ సామానులు, ఇతరాత్ర వస్తువులు అన్నీ కొనుగోలు చేసి మొత్తం మీద ఓ రూపానికి తీసుకువచ్చారు. పక్కనే ఉన్న టైర్లు షాపు యజమాని కూడా తనవంతు సహకారాన్ని అందించాడు.. మొత్తం మీద రూ.2.50 లక్షలు పైబడి ఖర్చు చేసి బ్యాటరీతో నడిచే ఈవీ అడ్జస్టబుల్‌ వెహికల్‌ను అయితే రూపకల్పన చేశాడు.

దానికదే అడ్జస్ట్‌ అయ్యేలా రూపకల్పన..

ఇరుకు సందుల్లో సైతం వెళ్లగలిగేలా తయారు చేసిన ఈ అడ్జస్ట్‌బుల్‌ వెహికల్‌కు మెల్చి జెదక్‌ (ఎమ్‌ జడ్‌) అనే పేరు పెట్టాడు. ఇది హిబ్రూ పదం అని తెలిపాడు. అదేవిధంగా కార్‌ విడ్త్‌ టూ బైక్‌ విడ్త్‌ ఎగైన్‌ బైక్‌ విడ్త్‌ టూ కార్‌ విడ్త్‌ అనే ట్యాగ్‌ లైన్‌కూడా ఈ వెహికల్‌పై రాశాడు. ముఖ్యంగా ఎక్సాండబుల్‌ ఛాసెస్‌ అనే విధానంలో ఇది పనిచేస్తుంది.. అయితే ఛాసెస్‌ విడ్త్‌ పెరిగేందుకు మానువల్‌గానే చేస్తున్నప్పటికీ కొంత సాంకేతికత తోడైతే చాలా సునాయాసంగా వెహికల్‌ ఛాస్‌ అంటూ టోటల్‌ వెహికల్‌ ఎక్సాండబుల్‌ అవుతుందంటున్నాడు సుధీర్‌.  ఈ వెహికల్‌ మినిమైజ్‌ అయినప్పుడు 3 అడుగులు వెడల్పులోకి వెళ్తుంది.. అదే వైశాల్యం పెంచినప్పుడు ఇంకో అడుగున్న పెరుగుతుందని చెబుతున్నాడు.

బైక్‌ సైజులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేలా.. అదే కారు సైజులోకి మారినప్పుడు నలుగురు వ్యక్తులు వెళ్లగలిగేలా సీట్లు కూడా మడుచుకునేలా రూపకల్పన చేశాడు.. ఇక ఈ వెహికల్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్‌ కాగా 48 వోల్ట్స్‌, 30 ఈహెచ్‌ బ్యాటరీ కెపాసిటీతో  ఇద్దరు కూర్చునప్పుడు 42 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో కదులుతుంది.. నలుగురు కూర్చున్నప్పుడు 35 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో నడుస్తుందని చెబుతున్నాడు ఈ వెహికల్‌ రూపకర్త సుధీర్‌. 

ఇంకా 26 ఆలోచనలు ఉన్నాయి..

ఈ వెహికల్‌ ఆవిష్కరణతో పాటు దేశ రక్షణ విభాగంలో ఉపయోగపడేవిధంగా మరికొన్ని తన వద్ద సరికొత్త ఆలోచనలు ఉన్నాయని, ఇలా మొత్తం 26 వరకు ఐడియాలు ఉన్నాయని సుధీర్‌ చెబుతున్నాడు. ప్రభుత్వం నుంచి, ఎవరైనా పారిశ్రామిక వేత్తలనుంచి తనకు అవకాశాలు వస్తే తన టాలెంట్‌ను నిరూపించుకోవడమే కాకుండా దేశానికి ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన ఈప్రయత్నంలో ఎన్నో విమర్శలు, అవహేళనలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తానని, పూర్తి ఆటోమెటిక్‌ వెహికల్‌గా మార్చేందుకు ఆర్ధీక ఇబ్బందులు వల్ల పూర్తిచేయలేకపోయానని చెబుతున్నాడు సుధీర్‌.   

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget