Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
Jeep Compass Turbo Petrol: జీప్ కంపాస్ కొత్త కారు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్. ఈ కారు త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
![Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు? Jeep Compass Turbo Petrol Engine Variant Launched Check Specifications Details Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/bdbcc6b876b1ee895d6505f68db80bfe1684548383414551_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jeep Compass Turbo Petrol Engine Variant: జీప్ కంపాస్ లైనప్‌లో మరో వేరియంట్ యాడ్ అయింది. ఈ కారు ఇంజన్‌లో పలు మార్పులతో కొత్త వేరియంట్ అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ అయింది. జీప్ కంపాస్ గ్లోబల్ మార్కెట్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ మార్కెట్ గురించి చెప్పాలంటే జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజన్ పవర్
జీప్ కంపాస్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 272 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 400 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ జీప్ కంపాస్ తీసుకొచ్చిన ఈ మోడల్‌ను అత్యంత శక్తివంతమైన వేరియంట్‌గా చేస్తుంది. జీప్ కంపాస్ లాంచ్ చేసిన ఈ యూనిట్ డైరెక్ట్ ఇంజెక్షన్, డ్యూయల్ వీపీటీ సెటప్‌ను కలిగి ఉంది. దీని కారణంగా ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 228 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారులో 300 ఎంఎం బ్రేక్ డిస్క్ కూడా అందించారు.
ఈ మోడల్ ఇండియాకు వస్తుందా?
భారతీయ మార్కెట్లో జీప్ కంపాస్ పెట్రోల్ లైనప్‌లో ప్రస్తుతం ఏ కారు లేదు. అదే సమయంలో జీప్ ఇండియా తన పెట్రోల్ లైనప్‌ను మరోసారి భారతదేశానికి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు గత సంవత్సరం వార్తలు వచ్చాయి. ఈ కారు పెట్రోల్ వేరియంట్ భారతదేశంలోకి వస్తే, దాని పెట్రోల్ ఇంజన్ కొంచెం చిన్నదిగా ఉండవచ్చు. ఈ కారులో భారతీయులు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందవచ్చు. ఇది 185 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీప్ కంపాస్ 2025లో భారతదేశంలో ఈ ఇంజన్ వేరియంట్‌ను తీసుకురాగలదని అంచనా.
రాబోయే కాలంలో జీప్ మెరిడియన్ కూడా ఇదే ఇంజన్‌తో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. దీనికి ముందు జీప్ మెరీడియన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి రానుంది. జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)