అన్వేషించండి

Truck Driver Lamborghini Huracan: లంబోర్గిని కారు నడిపిన ట్రక్ డ్రైవర్ రాజేష్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు- వైరల్ వీడియో

Lamborghini Huracan Price: భారతదేశంలో ట్రక్ డ్రైవర్ రాజేష్ ఫేమస్ కంపెనీ లంబోర్గిని హురాకాన్ కారు డ్రైవ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ కారు ఫీచర్లు, ధర తెలుసుకోండి.

Lamborghini Huracan Features: రాంఛీ: సోషల్ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేసింది. రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. ఒక్క వీడియోతో, ఒక్క చిన్న ఘటనతో కొత్త కెరీర్ వైపు అడుగులు వేసి సక్సెస్ అవుతున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయడం పలు రంగాల వారికి కొత్త కెరీర్‌గా మారింది. అలాంటి కంటెంట్ క్రియేటర్లలో ఒకరైన జార్ఖండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ రాజేష్ ఏకంగా లంబోర్గిని కారు నడిపాడు. అతను తన YouTube ఛానెల్ R Rajesh Vlogsలో ట్రక్ డ్రైవింగ్ లైఫ్, తన టూర్‌లకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసి ఫేమస్ అయ్యాడు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ ట్రక్ డ్రైవర్లలో ఒకడిగా రాజేష్ నిలిచాడు. ఇటీవల రాజేష్‌కు తొలిసారిగా ఫేమస్ కంపెనీ Lamborghini Huracan సూపర్ కారును నడిపిన ఒక వీడియో వైరల్ అయింది.

ట్రక్ డ్రైవర్‌కు Lamborghini నడిపే అవకాశం ఎలా వచ్చింది?

ట్రక్ డ్రైవర్ రాజేష్ తన కొడుకుతో కలిసి అస్సాంకు వెళ్లారు. ట్రక్ లోడింగ్, అన్‌లోడింగ్ పనులతో వారు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఈ సమయంలో, అతను తన స్నేహితులను కలుసుకున్నాడు. స్థానిక మార్కెట్‌కు వెళ్లాడు. అప్పుడు రాజేష్ స్నేహితుడు తన Lamborghini Huracan కారును చూపించాడు. అంతటితో ఆగకుండా లంబోర్గిని కారు నడపమని రాజేష్‌కు చెప్పాడు. మొదట ఇది కలనా, నిజమా అని రాజేష్ అనుకున్నాడు. ఇంతకు ముందు అలాంటి సూపర్ కారును రాజేష్ చూడలేదు. అతను డ్రైవర్ సీటులో కూర్చోవడానికి బదులుగా మరో సీటులో కూర్చోవాలనుకున్నాడు, కాని కారు యజమాని బలవంతంగా అతన్ని డ్రైవింగ్ సీటులో కూర్చోబెట్టి లంబోర్గిని కారు ఫీచర్లను వివరించాడు.

Lamborghini Huracan ఎలా ఉంది?

Lamborghini Huracan అనేది బెస్ట్ స్పోర్ట్స్ కారు. లంబోర్గిని ఈ మోడల్ కార్ల ధర రూ.3 కోట్ల నుంచి దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంది. ఇది ప్రత్యేకంగా అధిక వేగంతో పాటు లగ్జరీని ఇష్టపడే వారి కోసం తయారు చేశారు. ఇది 5.2-లీటర్ల పవర్‌ఫుల్ V10 ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది దాదాపు 610 నుంచి 640 bhp శక్తిని.. 560 నుంచి 565 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కారులో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దాంతో గేర్ షిఫ్టింగ్‌ చాలా సున్నితంగా చేస్తుంది.

ఈ కారు స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా వంటి వివిధ డ్రైవింగ్ మోడ్‌లతో మార్కెట్లోకి వచ్చింది. డ్రైవర్ తన ఇష్టాన్ని, రోడ్డు పరిస్థితి ఆధారంగా ఈ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఇది Lamborghini ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్ (LDVI) సిస్టమ్‌ కలిగి ఉంది, ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, బలమైన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.  Lamborghini Huracan అనేది వేగం, లగ్జరీ, అధిక భద్రత ఫీచర్లు కలిగిన ఒక సూపర్ కారు.

ట్రక్ డ్రైవర్ రాజేష్ లంబోర్గిని కారు డ్రైవ్ చేసే అవకాశం వచ్చిన విషయం వైరల్ అవుతోంది. అతడు వినయపూర్వకంగా ఉంటాడు. ట్రక్ డ్రైవర్ జీవితాన్ని మనకు వీడియోల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. అయితే మొదటిసారిగా రాజేష్ ఒక సూపర్ కారును డ్రైవింగ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget