Winter Precausions latetst Updates: వింటర్ వచ్చేసింది.. స్మూత్ బైక్ జర్నీ కోసం ఈ టూల్స్ వాడాల్సిందే.. అప్పుడే జర్నీ సాఫీగా..
చలికాలం వచ్చిందంటే బైకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముఖ్యంగా పొగమంచు, మంచు కురిసే ప్రాంతాల్లో కొన్ని ఉపకరణాలు వాడటం వల్ల ఎమకలు కొరికే చలి నుంచి తప్పిచుకోవచ్చు.

Winter Gadgets For Bike Lovers: చలికాలంలో ద్విచక్ర వాహనం (Two-wheeler) నడపడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా పొగమంచుతో కూడిన రోడ్లపై (Foggy roads) ప్రయాణించే వారికి అదనపు భద్రత వెచ్చదనం చాలా అవసరం. శీతాకాలపు రోడ్లపై మిమ్మల్ని వెచ్చగా సురక్షితంగా ఉంచేందుకు సహాయపడే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. రైడింగ్ సమయంలో వెచ్చదనం కోసం ఫుల్ లెంగ్త్ గ్లౌజ్ (Full Length Gloves)లను ధరించడం ముఖ్యం. సాధారణంగా వేసవిలో వాడే చిన్న కఫ్ (Short cuff) గ్లౌజ్‌లు చలికి సరిపోవు. చలిలో చేతి వేళ్లు మొద్దుబారకుండా ఉండేందుకు, మణికట్టు పైభాగం వరకు కప్పి ఉంచే గౌంట్లెట్ రైడింగ్ గ్లౌజ్‌లు (Gauntlet Riding Gloves) ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే థర్మల్ లైనర్ (Thermal Liner) చేతులను వెచ్చగా ఉంచుతుంది.
మంచు కురిసే వేళలో..
మంచు పడే ప్రాంతాల కోసం వాటర్‌ప్రూఫ్ (Waterproof) గ్లౌజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. తలకి , మెడకు మధ్య వేడిని నిలుపుకోవడానికి నెక్ బఫ్ (Neck Buff) చాలా ఉపయోగపడుతుంది. మెడ చుట్టూ కొన్నిసార్లు మడిచి ధరించే పొడవైన నెక్ బఫ్ థర్మల్ ఇన్సులేటర్‌గా పనిచేస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ ఫుల్ ఫేస్ హెల్మెట్ (Full Face Helmet) ధరించడం తప్పనిసరి అని తెలుస్తోంది. చలిలో, ఇది మీ తల చుట్టూ ఒక రక్షక కవచం (Cocoon) లాగా పనిచేస్తుంది. హెల్మెట్‌లోని మందపాటి ఇన్నర్ లైనర్లు చలిగాలుల నుండి వేరు చేస్తూ, మీ తలను వెచ్చగా ఉంచుతాయి. ఎక్కువ సేపు ప్రయాణం చేసే రైడింగ్‌లో ఇది ముఖంపై ఒత్తిడిని తగ్గించి అలసట రాకుండా చేస్తుంది.
విజర్ ఉండాల్సిందే..
హెల్మెట్ విజర్‌కు యాంటీ-ఫాగ్ ఇన్సర్ట్‌లు (Anti-fog Inserts) అమర్చుకోవడం మరో ముఖ్యమైన భద్రతా చర్య గా చెప్పుకోవచ్చు. చలికి విజర్‌ను మూసి ఉంచితే, లోపల ఆవిరి పట్టడం (Fog up) వలన విజి బులిటీ(Visibility) తగ్గి ప్రమాదాలకు దారితీస్తుంది. యాంటీ-ఫాగ్ ఇన్సర్ట్‌లు ఈ సమస్యను నివారిస్తాయి. చలికాలంలో వింటర్ రైడింగ్ జాకెట్స్ (Winter Riding Jackets) తప్పనిసరి అని విశ్లేషకులు సూచిస్తున్నారు. సాధారణ లెదర్ లేదా టెక్స్‌టైల్ జాకెట్‌లకు థర్మల్ లైనర్ జోడించడం ద్వారా అదనపు ఇన్సులేషన్‌ను పొందవచ్చు. అదనంగా, రైడింగ్ ప్యాంట్‌ల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలి. చలిని తట్టుకోవడానికి థర్మల్ ఇన్సులేషన్ బేస్ లేయర్‌లను (Base Layers) జోడించవచ్చు. ఈ బేస్ లేయర్‌లు చెమటను గ్రహించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. పాదాలకు వెచ్చదనం కోసం వాటర్‌ప్రూఫ్ బూట్లు లేదా మందపాటి, వాటర్‌ప్రూఫ్ వింటర్ సాక్స్ (Winter Socks) వాడవచ్చు. ఖరీదైన వాటర్‌ప్రూఫ్ బూట్లకు బదులుగా, చలి నుంచి పాదాలను రక్షించడానికి నాణ్యమైన వింటర్ సాక్స్ చక్కనైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలోనూ సురక్షితంగా ,సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అందుచేత ఇలాంటి టూల్స్ ద్వారా శీతాకాలంలో బైక్ జర్నీ మరింత ఉపయుక్తంగా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.





















