అన్వేషించండి

Hyundai Grand i10 Nios: డ్యూయల్‌ సిలిండర్‌ CNG టెక్నాలజీతో హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ లాంచ్‌

Hyundai గ్రాండ్ ఐ10 నియోస్‌ని డ్యూయల్ CNG టెక్నాలజీతో ఆ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న సింగిల్‌ సిలిండర్‌ ఆప్షన్‌ని అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ అప్‌డేటెడ్ కారులో బూట్‌స్పేస్‌ ఎక్కువగా లభించనుంది.

Hyundai Grand i10 Nios Dual Cylinder CNG Technology: భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సీఎన్‌జీ కార్ల ఉత్పత్తులు మరియు అప్‌గ్రేడ్‌లపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే హ్యుందాయ్ మోటార్స్ కూడా తన పాపులర్ లైనప్‌లను CNG వెర్షన్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. కంపెనీ ఇప్పటికే కొన్ని కీలకమైన మోడళ్లలో CNG ఆప్షన్‌లను అందిస్తోంది. ఇటీవలే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ (Hyundai Grand i10 Nios)లో డ్యూయల్ CNG టెక్నాలజీలో తీసుకువచ్చింది.

కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. హ్యుందాయ్ ఈ సాంకేతికతను Nios i10లో కూడా ప్రవేశపెట్టింది, దీని ధర ₹7,75,300 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. గతంలో హ్యుందాయ్ ఈ మోడల్‌లో సింగిల్-సిలిండర్ ఆప్షన్‌ని మాత్రమే అందించింది. కానీ ఇప్పుడు దానిని అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ కారులో బూట్ స్పేస్‌ను పెరుగనుంది. దీంతో ఈ కారులోనూ లగేజీ సర్దుబాటు సమస్య ఉండదు. తద్వారా లాంగ్‌ జర్నీకి కూడా వెళ్లవచ్చు.

ఇంజిన్‌

హ్యుందాయ్ i10 నియోస్ CNG మరియు పెట్రోల్ రెండింటిలోనూ పనిచేసేలా రూపొందించబడింది, కాబట్టి CNG అయిపోతే మీరు పెట్రోల్‌కు సులభంగా మారవచ్చు. ఈ కారు పెట్రోల్‌ వెర్షన్‌లో వినియోగించే ఇంజిన్‌ని హ్యుందాయ్ CNG మోడల్‌లోనూ ఉపయోగించారు. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త మోడల్ రాబోయే రోజుల్లో అమ్మకాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. డ్యూయల్ సిలిండర్ ఫీచర్ గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది, దీని ధర రూ 8.30 లక్షలుగా ఉంది.


ఫీచర్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సరసమైన ధరలో లభించే బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్రీమియం కార్లలో ఒకటిగా ఉంది. దీనిని 2019లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 400,000 యూనిట్లకు పైగా కార్లు సేల్ అయ్యాయి. డ్యూయల్-సిలిండర్ ఆప్షన్‌ ఇప్పుడు సేల్స్‌ని మరింత పెంచుతాయని హ్యుందాయ్‌ భావిస్తుంది. ఈ కారు ప్రొజెక్టర్-స్టైల్‌ హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED టెయిల్ లైట్లు, రూఫ్ రెయిల్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, 20.25 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెగ్ లైట్లు, ప్రత్యేక వెనుక AC వెంట్‌లు మరియు టిల్ట్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో నిండి ఉంది.

సేఫ్టీ ఫీచర్లు

ఈ కారు సేఫ్టీకి సంబంధించి గ్రాండ్ i10 నియోస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, డే-నైట్ IRVMలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఉన్నాయి. ఇటీవల, హ్యుందాయ్ కంపెనీ ఎక్స్‌టర్ డ్యూయల్ సిలిండర్ సీఎన్‌జీ వెర్షన్‌లోనూ విడుదల చేసింది. ఇది ప్రస్తుతం కంపెనీ నుంచి ఎక్కువగా అమ్ముడవుతుంది. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా టాప్‌లో ఉంది. త్వరలోనే హ్యుందాయ్‌ మరికొన్ని ఉత్పత్తులను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తుంది. అందులో ముఖ్యంగా క్రెటా ఈవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఈవీ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్‌ విభాగంలో టాటా మోటార్ల ఆధిపత్యానికి తెరపడనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget