Tata Harrier EV: వెనుక సీటు ఎలా ఉంది, మీ అవసరాలను తీర్చగలదా?
Tata Harrier EV Battery Range: టాటా హారియర్ EVలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్-మోటార్ సెటప్ & హై-వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది 238 PS పవర్‌ను & 504 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

Tata Harrier EV Price, Mileage And Features In Telugu: టాటా మోటార్స్ ఇటీవల తన కొత్త టాటా హారియర్ EV (electric vehicle)ని విడుదల చేసింది. కొంతమంది నిపుణులు ఆ కారును టెస్ట్ డ్రైవ్ చేసి దాని ఇంటీరియర్‌ను, ముఖ్యంగా వెనుక సీటును రివ్యూ చేశారు. వాస్తవానికి, హారియర్ EV రియర్ సీట్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్టైలిష్‌గా & స్పేషియస్‌గా ఉంది. డిజైన్ డీజిల్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది, కానీ కొన్ని ముఖ్యమైన మార్పులు దీనిని మరింత ప్రీమియం లుక్‌లోకి మార్చాయి.
టాటా హారియర్ EV డిజైన్, హారియర్ డీజిల్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. కానీ.. కొత్త అప్‌హోల్‌స్టెరీ, పనోరమిక్ సన్‌రూఫ్ & తేలికపాటి ఇంటీరియర్ టోన్స్ వల్ల, మీరు ఈ కారులో కూర్చున్నప్పుడు మరింత విశాలంగా & ప్రీమియంగా అనిపించేలా చేస్తాయి. లెగ్‌రూమ్ సరిపోతుంది & 6 అడుగుల ఎత్తు ఉన్న ప్రయాణీకులకు కూడా హెడ్‌రూమ్ మెరుగ్గా ఉంటుంది.
సీటింగ్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? (Tata Harrier EV Seating Features)
టాటా హారియర్ బ్యాటరీ ఫ్లోర్ కింద ఉన్నందున ఇది సీటింగ్ పొజిషన్‌ను ప్రభావితం చేస్తుంది, ప్రయాణీకులు మోకాళ్లను కొద్దిగా వంచి కూర్చోవలసి వస్తుంది. ఈ పొజిషన్ దూర ప్రయాణాలలో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. సీటింగ్ విషయంలో గుడ్ న్యూస్ ఏమిటంటే, హారియర్ EV రియర్ ఫ్లోర్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటుంది & వెడల్పు సీటు కారణంగా ముగ్గురు ప్రయాణీకులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. అయితే, మధ్య సీటులో హెడ్ రెస్ట్ లేదు, ప్రీమియం సెగ్మెంట్ SUVలో ఇది లేకపోవడం ఆశ్చర్యకరం.
సౌకర్యం & సాంకేతికత (Tata Harrier EV Comfort & Technology)
కంఫర్ట్ & టెక్నాలజీ పరంగా హారియర్ EV ఒక కూల్ ప్యాకేజీ లాంటింది. కారులో కంఫర్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, క్యాబిన్‌ను త్వరగా చల్లబరిచే రియర్ AC వెంట్స్, ఎండ నుంచి రక్షించే సన్‌షేడ్స్ & ఫాస్ట్ USB ఛార్జర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. మరో ప్రత్యేకత 'పవర్డ్ బాస్ మోడ్', దీని సహాయంతో ముందు ప్రయాణీకుల సీటును ఎలక్ట్రికల్‌గా వెనుకకు జార్చడం ద్వారా వెనుక సీటులో లెగ్‌రూమ్‌ను మరింత పెంచవచ్చు.
ఇంకా.. JBL సౌండ్ సిస్టమ్ (Tata Harrier EV Sound System) వెనుక సీటు ప్రయాణీకులకు సూపర్బ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్లు & తగినంత స్టోరీజీ స్పేస్ దీనిని మరింత ప్రాక్టికల్ & కంఫర్టబుల్ SUV ఫీల్ ఇస్తాయి. మొత్తంగా చూస్తే, కొత్త టాటా హారియర్ EV రియర్ సీటు ICE వెర్షన్ కంటే ఎక్కువ ప్రీమియం & కంఫర్టబుల్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
బ్యాటరీ & రేంజ్ (Tata Harrier EV Battery & Range)
టాటా హారియర్ EV రెండు ఆప్షన్స్‌లో (65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్) లాంచ్ అయింది. 65kWh బ్యాటరీ ప్యాక్ 505 km డ్రైవింగ్ రేంజ్‌ను & 75kWh బ్యాటరీ ప్యాక్ 627 km డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. దీని పవర్ ఔట్‌పుట్ 235 bhp నుంచి 390 bhp వరకు ఉంటుంది. టాటా హారియర్ EV SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.





















