అన్వేషించండి

Honda Adventure Scooter: హోండా కొత్త అడ్వెంచర్ స్కూటర్‌ లాంచ్ - ఒక్కసారైనా నడపకపోతే లైఫ్‌ వేస్ట్‌!

Honda X ADV 750 Launch: హోండా తన కొత్త స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్కూటర్ యూత్‌కు, ముఖ్యంగా అడ్వెంచర్ రైడర్లకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుంది.

Honda X-ADV 750 Scooter Price, Mileage And Features: దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన హోండా ప్రీమియం అడ్వెంచర్ స్కూటర్ X-ADV 750, ఈ నెల 21న (21 మే 2025) లాంచ్‌ అయింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), టీజర్ విడుదల చేసిన 24 గంటల్లోనే ఈ బండిని మార్కెట్‌లోకి తీసుకురావడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే, Honda Rebel 500 క్రూయిజర్‌ను విడుదల చేసిన ఒక్క రోజు గ్యాప్‌లోనే కంపెనీ X-ADV 750 ని ప్రవేశపెట్టింది. ఇటీవల, సోషల్ మీడియాలో ఈ బండిని "గేమ్ ఛేంజర్" అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ పరిచయం చేసింది. ప్రీమియం టూవీలర్‌ సెగ్మెంట్‌ కస్టమర్లను ఈ హోండా బండి టార్గెట్‌ చేస్తుంది.

హోండా X-ADV 750 లో ప్రత్యేకత ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్‌లో, X-ADV 750 ని ఒక యునిక్‌ మ్యాక్సీ స్కూటర్‌గా చూస్తున్నారు. భారత్‌ కోసం టీజ్ చేసిన మోడల్, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న న్యూఏజ్‌ X-ADVని పోలి ఉంటుంది. రోజువారీ జీవితం & సుదీర్ఘ సాహస ప్రయాణాలు రెండింటికీ ఈ స్కూటర్ చక్కగా పనికొస్తుంది.

ఇంజిన్ & పనితీరు
హోండా X-ADV 750 స్కూటర్‌ 745cc ప్యార్లల్‌-ట్విన్ ఇంజిన్‌తో నడిచే పవర్‌ఫుల్‌ & అడ్వంచర్‌-ఫ్రెండ్లీ స్కూటర్. ఈ బండి ఇంజిన్ గరిష్టంగా 58 bhp పవర్‌ను & 69 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ (DCT)తో కలిపారు, ఈ ఏర్పాటు ఈ విభాగంలో చాలా అరుదుగా కనిపిస్తుంది & గేర్లు మార్చేప్పుడు చాలా సున్నతమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్కూటర్‌కు 17-అంగుళాల ముందు చక్రం & 15-అంగుళాల వెనుక చక్రం బిగించారు, ఇవి రెండూ వైర్-స్పోక్ స్పోర్ట్‌ వీల్స్‌, ఇవి బలమైన పికప్‌ అందిస్తాయి. టూవీలర్‌ ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు & లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి. వీటివల్ల, కుదుపుల్లేకుండా మట్టి రోడ్ల మీద కూడా దుమ్ము లేపుకుంటూ దూసుకెళ్లవవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ హఠాత్తుగా ఆగిపోవచ్చు. ఇంకా.. రైడర్‌ చేతులకు రక్షణనిచ్చే నకుల్‌ గార్డ్స్, 

ఫీచర్లు
హోండా X-ADV 750 ను కేవలం స్కూటర్‌గానే కాకుండా ప్రీమియం అడ్వెంచర్ టూవీలర్‌గా చూడాలి, అందుకు అన్ని అర్హతలు దీనికి ఉన్నాయి. బండిలో పూర్తి LED లైటింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు, ఫలితంగా రాత్రి ప్రయాణాల్లోనూ దారి స్పష్టంగా కనిపిస్తుంది. రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ అందించారు, ఇది విండ్‌ ప్రొటెక్షన్‌ & సౌకర్యాన్ని పెంచుతుంది. రైడర్‌ సపోర్ట్‌ కోసం 5 అంగుళాల ఆకర్షణీయమైన డిజిటల్ TFT డిస్‌ప్లే బిగించారు, ఇది రైడింగ్‌ సమయంలో ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ స్క్రీన్‌ను బ్లూటూత్‌తో అనుసంధానించవచ్చు. ఇంకా.. స్మార్ట్‌ కీ యాక్సెస్, హోండా స్మార్ట్‌ఫోన్‌ వాయిస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, USB ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడానికి - అర్బన్, అడ్వెంచర్ & కంఫర్ట్ వంటి మల్టీ రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, ఇది అడ్వెంచర్ కిట్, అర్బన్ సెటప్ & లగేజ్ ఆప్షన్స్‌తో కూడిన యాక్సెసరీ ప్యాక్‌తో అమ్ముడవుతోంది. 22-లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజీ ఉంటుంది, దీనిలో చాలా వస్తువులు లేదా దుస్తులు స్టోర్‌ చేసుకోవచ్చు. పెర్ల్‌ గ్లేర్‌ వైట్, గ్రాఫైట్‌ బ్లాక్‌ రంగుల్లో హోండా X-ADV 750 స్కూటర్‌ లాంచ్‌ అయింది.

ధర
ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న హోండా X-ADV 750 ప్రీమియం అడ్వెంచర్ స్కూటర్‌ ధర కాస్త ఎక్కువే, సామాన్యులకు అందుబాటులో లేదు. దీని ధర రూ. 11.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ రేటుతో ఓ ప్రీమియం కారు కొనుక్కోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget