By: ABP Desam | Updated at : 19 Aug 2021 06:32 PM (IST)
Honda Amaze Facelift
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా తన కొత్త కారును ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. చాలా రోజుల నుంచి టీజర్ల రూపంలో లీకులు ఇస్తున్న హోండా.. ఎట్టకేలకు అమేజ్ ఫేస్‌లిఫ్ట్ 2021ను లాంచ్ చేసింది. అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ.6.32 లక్షలు కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.15 లక్షల (ఎక్స్ షోరూం, ఢిల్లీ ప్రకారం) వరకు ఉంటుంది. ఇది E, S, VX అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్‌లో ఇంజన్ ఉంది. అమేజ్ ముందు భాగంలో కొత్త ఫ్రంట్ గ్రిల్‌ని కలిగి ఉంది.
ఇది మెటియోరాయిడ్ గ్రే, ప్లాటినం పెరల్ వైట్, లూనార్ సిల్వర్, గోల్డెన్ బ్రౌన్, రేడియంట్ రెడ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారుకి ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ఉంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ.5000 చెల్లించి కారు బుకింగ్ చేసుకోవచ్చు. డీలర్ల ద్వారా బుకింగ్ చేసుకోవాలంటే రూ.21000 చెల్లించాలి.
ఎక్స్‌టీరియర్ ఫీచర్లు..
అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బయటి భాగం (ఎక్స్‌టీరియర్) మంచి స్టైలిష్ లుక్‌తో ఉంటుంది. బంపర్‌లో ఉండే ఫాగ్ ల్యాంప్‌లకు కొత్త డిజైన్ అందించారు. వీఎక్స్ వేరియంట్లో కొన్ని అదనపు ఫీచర్లు ఇచ్చారు. ఇందులో ఆటోమేటిక్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను అందించారు. ఈ హెడ్‌ల్యాంప్‌లు.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లతో కలిపి ఉన్నాయి. వీటితో పాటుగా వెలుపలి వైపున కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఇందులో డ్యూయల్ టోన్ వీల్స్ అందించారు. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయి.
ఇంటీరియర్ ఫీచర్లు..
హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో క్లైమెట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. దీని డ్యాష్ బోర్డుపై సాటిన్ సిల్వర్ యాక్సెంట్స్ అందించారు. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్‌మెంట్ సిస్టం కూడా ఉంది. వాయిస్ కమాండ్లను తీసుకుంటుంది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, సీట్ బెల్ట్ రీమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అమేజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారు.. మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ ఆరా, టాటా టిగోర్, ఫోర్డ్ అస్పైర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Also Read: Tata Tigor EV: టాటా నుంచి సూపర్ ఫీచర్స్‌తో మరో ఎలక్ట్రిక్ కారు.. అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..
Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?
Union Budget 2023: మరింత తగ్గనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధర - ఆటోమొబైల్స్ హైలెట్స్ ఇవే!
CAEV Expo 2023: ఇండియాలో మరో ఆటో ఎక్స్పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Maruti Suzuki: గ్రాండ్ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!