అన్వేషించండి

Honda Activa Vs TVS Jupiter: హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్‌ స్కూటీలలో ఏది బెటర్.. ధర, ఫీచర్లు ఇవే

Honda Activa మరియు TVS Jupiter లలో ఒకదాన్ని కొనాలనుకుంటున్నారా? ధర, ఫీచర్ల పోలికతో మీరే నిర్ణయించుకోవచ్చు.

భారత మార్కెట్‌లో రోజువారీ ప్రయాణాల కోసం ఎన్నో రకాల స్కూటర్లు విక్రయాలు జరుగుతున్నాయి. కానీ చాలా మంది ఎక్కువ మైలేజీనిచ్చే, తక్కువ ధర కలిగిన స్కూటీలను కొనడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా చెప్పాలంటే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ రెండూ కూడా బాగా అమ్ముడవుతున్న స్కూటీ బ్రాండ్స్.

మీరు ఈ 2 స్కూటర్లలో ఏదైనా ఒకదాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా అయితే, మీ కోసం ఏ స్కూటర్ సరైనదో మీరే నిర్ణయించుకోండి. అయితే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్

హోండా యాక్టివా మంచి మైలేజీనిచ్చే టూవీలర్. ఈ స్కూటర్‌లో 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఇచ్చారు. ఈ స్కూటీ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ (V-matic) ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. హోండా యాక్టివాలో అమర్చిన ఈ ఇంజిన్ 5.77 kW పవర్‌ను జనరేట్ చేస్తుంది. 8.90 Nm టార్క్‌ను సైతం ఉత్పత్తి చేస్తుంది. హోండా కంపెనీకి చెందిన ఈ స్కూటీలో 1260 mm వీల్‌బేస్, 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.

హోండా యాక్టివా 51.23 kmpl మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటీ ఇంధన ట్యాంక్ (Honda Activa Fuel Tank) సామర్థ్యం 5.3 లీటర్లు. ఒకసారి యాక్టివా ట్యాంక్ నింపితే దాదాపు 270 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు. హోండా ఈ స్కూటw ఎక్స్-షోరూమ్ ధర నోయిడాలో రూ. 75,368. దేశంలోని ఆయా నగరాల్లో ఈ ధరలో వ్యత్యాసం ఉంటుంది. 

టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)

టీవీఎస్ జూపిటర్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంది. స్కూటర్‌లో అమర్చిన ఈ ఇంజిన్ 6,500 rpm వద్ద 5.9 కిలోవాట్ పవర్‌ను, 5,000 rpm వద్ద 9.8 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ టూవీలర్ ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. 

స్కూటర్ మైలేజ్, ధర 

టీవీఎస్ జూపిటర్ ARAI ధృవీకరించబడిన మైలేజ్ 53 kmpl. ఈ స్కూటీ 5.1 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది.  ఒకసారి టీవీఎస్ జూపిటర్ ట్యాంక్ నింపితే దాదాపు 270 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 72,400 గా ఉంది. సిటీని బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది.

ఏ స్కూటర్ తీసుకుంటే బెటర్

హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ రెండింటి మైలేజీని పరిశీలిస్తే, 2 టూవీలర్స్ మైలేజ్ దాదాపు 50 kmpl ఇస్తుంది. అలాగే, రెండు స్కూటీల ధరలో పెద్దగా తేడా లేదు. స్కూటీ డిజైన్, కలర్ బట్టి రెండింటిలో మీకు నచ్చిన ఒక మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget