Honda Activa vs Suzuki Access: హోండా యాక్టివా లేదా సుజుకి యాక్సెస్.. రోజువారీ జర్నీకి ఏ స్కూటీ బెస్ట్, ధర తక్కువ
హోండా యాక్టివా వర్సెస్ సుజుకి యాక్సెస్: రోజువారీ ప్రయాణాల కోసం స్కూటర్ కొనాలనుకుంటే, ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.

Honda Activa 125 vs Suzuki Access 125 | భారత మార్కెట్‌లో తక్కువ ధరతో పాటు మంచి మైలేజీని అందించే స్కూటీల కోసం చూస్తుంటారు. మీ కోసం Honda Activa 125,లేక Suzuki Access 125 మంచి ఎంపికలు కావచ్చు. మీరు కొత్త స్కూటీ కొనాలని ఆలోచిస్తున్నారా.. ఈ రెండింటిలో ఏ స్కూటర్ ఎక్కువ బెటర్. ఫీచర్లు, డిస్‌ప్లే, సాంకేతికత పరంగా ఈ రెండు స్కూటర్లలో ఏది ముందుందో ఇక్కడ తెలుసుకుందాం.
రెండు స్కూటర్ల ఫీచర్లు, ధర
Honda Activa 125 బేస్ వేరియంట్ DLX ధర రూ. 88,339 నుంచి ప్రారంభమవుతుంది. అదే విధంగా Suzuki Access Standard వేరియంట్ ధర రూ. 77,284గా ఉంది. రెండు స్కూటర్లు మోడ్రన్ వెహికల్ డిజైన్ కలిగి ఉన్నాయి. 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వీటిలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఇచ్చారు. దీని ద్వారా కాల్ లేక SMS అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూడవచ్చు.
Honda Activa 125 డిస్‌ప్లే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది RPM గేజ్ (టాకోమీటర్)ని కలిగి ఉంది. ఈ ఫీచర్ రైడింగ్ సమయంలో ఇంజిన్ రెవ్స్‌ను పర్యవేక్షించడంలో మీకు సహాయపడుతుంది. ఈ సౌకర్యం Access 125లో లేదు. అదే సమయంలో Suzuki Access 125 ఈ విభాగంలో తన స్థానాన్ని నిలుపుకుంటుంది. Activa 125లో మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇందులో 5-వే జాయ్‌స్టిక్ కంట్రోలర్ ఉంది. ఇది మెనూ నావిగేషన్‌ను తేలిక చేస్తుంది.
ఫీచర్లలో ఏది బెస్ట్..
Honda Activa 125 H-Smart వేరియంట్ ఫీచర్ల పరంగా అత్యంత అడ్వాన్స్‌డ్ స్కూటీగా చెప్పవచ్చు. ఇది కీ-లెస్ ఆపరేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు స్కూటర్ విభాగంలో చాలా తక్కువ మోడళ్లలో మాత్రమే కనిపిస్తుంది. దీని స్మార్ట్ కీ ఫాబ్ స్కూటర్‌ను తాళం లేకుండానే స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇందులో “లోకేట్ మై స్కూటర్” ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా రద్దీగా ఉండే పార్కింగ్ ఏరియాలో మీ స్కూటర్‌ను సులభంగా ట్రాక్ చేయవచ్చు.
మరోవైపు Suzuki Access 125 హైటెక్ ఫీచర్ల కంటే సింపుల్, ప్రాక్టికల్ డిజైన్‌పై దృష్టి సారిస్తుంది. దీని ప్రయోజనం ఏమిటంటే, ఈ స్కూటర్ ఉపయోగించడం చాలా సులభం. మెయింటనెన్స్ విషయంలో చౌకగా ఉంటుంది. అన్ని వయసుల రైడర్‌లకు యాక్సెస్ 125 అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండు స్కూటీలను ఎక్కువగా నగకాల్లో కొనుగోలు చేస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నల్, విపరీతమైన రద్దీలో డ్రైవింగ్ చేయడానికి వాహనదారులకు తేలిక అనిపిస్తుంది. గేర్ బైక్ లకు బదులుగా వీటి వైపు యువత మొగ్గు చూపుతున్నారు.






















