ఫ్యాషన్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్ - GST 2.0తో రూ.92 వేల వరకు తగ్గిన టాప్ 5 మోడల్స్
GST 2.0తో స్కూటర్‌ల ధరలు బాగానే పతనమయ్యాయి. 18% ట్యాక్స్ స్లాబ్‌తో BMW C400 GT నుంచి Aprilia SR175 వరకు రూ.92,000 వరకు తగ్గాయి. పండుగ సీజన్ బైక్ బయ్యర్లకు ఇది గోల్డెన్ టైమ్.

GST 2.0 scooter price cut: దేశంలో తాజాగా అమలైన GST 2.0 ట్యాక్స్ సిస్టమ్ వల్ల బైక్‌లు, స్కూటర్ల మార్కెట్‌లో పెద్ద ఊపు కనిపిస్తోంది. 350cc లోపు ఇంజిన్ ఉన్న వాహనాలపై పన్ను రేటు 28% నుంచి 18% కు తగ్గింది. అంటే కొనుగోలుదారులకు 10% ట్యాక్స్ తగ్గింపు లభిస్తోంది, కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు సేవ్ అవుతున్నాయి. GST 2.0 తెచ్చిన మార్పుతో, ధరలు ఎక్కువగా పడిపోయిన టాప్ 5 స్కూటర్లు ఇవి:
1. Aprilia SR 175 - రూ.10,478 తగ్గింపు
SR 160కి నెక్ట్స్ జెనరేషన్‌గా వచ్చిన Aprilia SR 175, ప్రస్తుతం స్కూటర్ మార్కెట్‌లో సెగలు రేపుతోంది. కొత్త 175cc ఇంజిన్, RS 457 నుంచి ప్రేరణ పొందిన TFT డిస్‌ప్లే, కొత్త కలర్ థీమ్స్‌తో ఇది యువతరానికి ఆకట్టుకునే ప్యాకేజ్. ప్రారంభ ధర ₹1,27,999 కాగా, GST 2.0 తర్వాత ఇప్పుడు ₹1,17,521 మాత్రమే. అంటే సుమారు ₹10,478 తగ్గింపు.
2. Hero Xoom 160 - రూ.11,602 తగ్గింపు
హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన మొదటి మ్యాక్సీ-స్కూటర్ Xoom 160, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో కొత్త భవిష్యత్తుకు నాంది పలికింది. ప్రారంభంలో ₹1.49 లక్షల ధరతో వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు ₹1.37 లక్షలకు తగ్గింది. అంటే ₹11,602 లాభం. కొత్త లుక్స్, పెద్ద బాడీ డిజైన్, ఆధునిక టెక్ ఫీచర్లతో ఇది అర్బన్ యువతకు పర్ఫెక్ట్ ఫిట్.
3. Yamaha Aerox 155 - రూ.12,780 తగ్గింపు
స్పోర్టీ స్కూటర్ లవర్స్ మనస్సులో Yamaha Aerox 155 ది ప్రత్యేక స్థానం. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, షార్ప్ డిజైన్, ప్రీమియం లుక్స్‌తో ఇది మార్కెట్లో హైలైట్ అయింది. ఈ టూవీలర్ ధర GST 2.0 కి ముందు ధర ₹1.54 లక్షలు, ఇప్పుడు ₹1.41 లక్షలు. మొత్తం ₹12,780 తగ్గింది. ఈ ధర తగ్గింపుతో Aerox మరింత ఆకర్షణీయంగా మారింది.
4. Vespa Series - రూ.12,000 నుంచి ₹18,000 వరకు తగ్గింపు
వెస్పా స్కూటర్ల శ్రేణి ఎప్పుడూ ప్రీమియం సెగ్మెంట్‌లోనే ఉంటాయి. GST తగ్గింపుతో అవన్నీ మరింత అందుబాటులోకి వచ్చాయి.
Vespa 149 Dual Colour - ₹12,866 తగ్గింపు
Vespa Tech125 - ₹16,537 తగ్గింపు
Vespa S Tech149 - ₹18,073 తగ్గింపు
ఇప్పటి ధరలు ₹1.10 లక్షల నుంచి ₹1.94 లక్షల వరకు ఉన్నాయి (మునుపటి ధరలు ₹1.20 - ₹2.12 లక్షలు). ఈ సిరీస్ స్కూటర్లు ఇప్పుడు ఫ్యాషన్ లవర్స్‌కి మరింత దగ్గరయ్యాయి.
5. BMW C 400 GT - రూ.92,000 భారీ తగ్గింపు
ఈ లిస్ట్‌లో ఎక్కువ బెనిఫిట్ పొందిన స్కూటర్ ఇదే. స్కూటర్ పేరులో 400 ఉన్నా, అసలు ఇంజిన్ మాత్రం 350cc. BMW C400 GT, జీఎస్‌టీకి ముందు ₹11.75 లక్షలు, ఇప్పుడు ₹10.83 లక్షలు - అంటే ₹92,000 తగ్గింపులో లభిస్తోంది. లగ్జరీ స్కూటర్ కావడంతో ఈ తగ్గింపు పెద్ద ఆకర్షణగా మారింది. హై-ఎండ్ ఫీచర్లు, యూరోపియన్ డిజైన్, ప్రీమియం కంఫర్ట్ కలిగిన ఈ స్కూటర్ రోడ్లపై రాయల్టీలా ఉంటుంది.
ఈసారి GST 2.0 నిజంగా ఆటో ఇండస్ట్రీకి ఊతం ఇచ్చింది. మధ్యతరగతి, యువ కొనుగోలుదారులకు ఇది బంపర్ ఆఫర్. అయితే కొనుగోలు చేసేముందు డీలర్ షోరూమ్‌లలో తాజా ధరలను చెక్ చేయడం తప్పనిసరి.




















