Tata Nexon CNG: ఒక్కసారి స్టార్ట్ చేస్తే 800km వరకు ఆగదు, రూ.40,000 జీతగాళ్లు కూడా ఈజీగా కొనొచ్చు!
Tata Nexon CNG On Bank Loan EMI: టాటా మోటార్స్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ టర్బో-ఛార్జ్‌డ్ CNG కారు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో తయారైంది. దీని ధర, డౌన్ పేమెంట్ & రేంజ్ వివరాలు తెలుసుకోండి.

Tata Nexon CNG Price, Mileage And Features In Telugu: మీ సర్కిల్‌లో మీ రేంజ్‌ను పెంచే స్టైలిష్ కార్ కొనాలని, అది కూడా మీ బడ్జెట్‌లోనే కొనాలని భావిస్తుంటే టాటా నెక్సాన్ CNG మీకు సరైన ఆప్షన్ కావచ్చు. ఇది బడ్జెట్ SUV మాత్రమే కాదు, రోజువారీ అప్ అండ్ డౌన్ కోసం బెటర్ మైలేజీ ఇస్తుంది. EMI కట్టేప్పుడు కూడా ఎక్కువ ఖర్చు ఉండదు. ఇప్పుడు, ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర (Tata Nexon CNG ex-showroom price) రూ. 9 లక్షల కన్నా తక్కువ (రూ. 8,89,990). ఇది భారతదేశపు మొట్టమొదటి టర్బో-CNG SUV. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ & ఆకర్షణీయమైన డిజైన్‌తో లాంచ్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో, Tata Nexon Smart 1.2 iCNG 6MT స్మార్ట్ వేరియంట్ ఆన్-రోడ్ ధర (Tata Nexon Smart CNG on-road price) దాదాపు రూ. 10.71 లక్షల వరకు ఉంటుంది, ఇందులో RTO ఛార్జీలు రూ. 1,32,599 & బీమా రూ. 46,777, ఇతర ఛార్జీలు రూ. 2,000 కూడా కలిసి ఉన్నాయి. ఈ అడ్వాన్స్‌డ్ SUVని సొంతం చేసుకోవడానికి మీరు రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 8.71 లక్షలను రుణంగా తీసుకోవచ్చు.
EMI గణాంకం
ఉదాహరణకు... బ్యాంక్ మీకు 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి రూ. 8.71 లక్షల లోన్ మంజూరు చేస్తే, మీ నెలవారీ EMI రూ. 18,081 అవుతుంది. ఆరేళ్ల కాలానికి లోన్ ఇస్తే మంత్లీ EMI రూ. 15,700 కట్టాలి. ఏడు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 14,014 బ్యాంక్‌కు చెల్లించాలి. మీరు నెలకు రూ. 40,000 తక్కువ కాకుండా జీతం లేదా ఆదాయం సంపాదిస్తుంటే, ఏడు సంవత్సరాల కాలానికి బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. స్థానిక పన్నులు, ఇతర ఛార్జీలను బట్టి ఈ ఫైనాన్స్ ప్లాన్ మారవచ్చు. ఖచ్చితమైన గణన కోసం సమీపంలోని టాటా డీలర్‌షిప్ లేదా బ్యాంకును సంప్రదించండి.
ఇంజిన్ & పవర్
టాటా నెక్సాన్ CNGలో మీరు 1.2 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది, CNG మోడ్‌లో 100 bhp పవర్ & 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించిన మొట్టమొదటి SUV ఇదే. బూట్ స్పేస్ ఏ మాత్రం తగ్గకుండా ఈ కారులో CNG ట్యాంక్‌ను అమర్చారు. ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది, మీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను సౌకర్యవంతంగా మారుస్తుంది.
మైలేజ్ & రేంజ్
మైలేజ్ గురించి మాట్లాడుకుంటే... కంపెనీ వెల్లడించిన ప్రకారం, టాటా నెక్సాన్ CNG పెట్రోల్ మోడ్‌లో లీటరుకు దాదాపు 17 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. CNG మోడ్‌లోకి మైలేజ్ కిలోగ్రాముకు 17 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. రోజువారీ ప్రయాణంలో డబ్బును మిగిల్చే ఆప్షన్‌గా ఇది నిలుస్తుంది.
Tata Nexon CNG SUVలో 44 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ & 9 కిలోల సామర్థ్యం గల CNG సిలిండర్ ఉన్నాయి. రెండు ట్యాంకులను పూర్తిగా నింపిన తర్వాత, కంపెనీ లెక్క ప్రకారం, టాటా నెక్సాన్ CNG 800 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఈజీగా కవర్ చేయగలదు. ఈ ఫెసిలిటీ కారణంగా ఇది లాంగ్ డ్రైవ్‌లు & హైవే జర్నీకి అద్భుతంగా సరిపోతుంది.





















