Best EV For Daily Journey: ఇంటికి-ఆఫీస్‌కు తిరగడానికి ఈ EV బెస్ట్, మెట్రో టిక్కెట్ కంటే తక్కువ ఖర్చు!
Best EV For Daily Up Down: టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.49 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Best Electric Car For Daily Up And Down: ప్రస్తుతం, మన దేశంలో చాలా మంచి కార్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి. మెజారిటీ క్లాస్ అయిన మధ్య తరగతి ప్రజల కోసం కార్ కంపెనీలు బోలెడన్ని మోడల్స్ లాంచ్ చేశాయి, జనాభిప్రాయాలకు అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి లేదా కొత్త ఫోర్‌వీలర్లను విడుదల చేస్తున్నాయి. కొంతమంది, ముఖ్యంగా నగరాల్లో ఉంటే వ్యక్తులు ప్రతిరోజూ ఆఫీస్, బిజినెస్ లేదా ఫీల్డ్ ట్రిప్‌లకు వెళ్లడానికి కార్ కొంటారు. మరికొందరు, అప్పడప్పుడు టూర్‌లకు వెళ్లడానికి కార్ కొంటారు. సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలో ఉండడంతో కార్ డ్రైవింగ్ ఖరీదైన వ్యవహారం అయింది. ఈ నేపథ్యంలో, తక్కువ ధరలో మంచి మైలేజీ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కార్‌లను జనం కోరుకుంటున్నారు.
పెట్రోల్, డీజిల్ ఇంధనాలు పరిమిత వనరులు. అందుకే వీటి ధర ఎక్కువ. వీటితో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ అవుతాయి. సంప్రదాయ ఇంధన కార్‌లతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్‌ల నిర్వహణ ఖర్చు తక్కువ. ప్రస్తుతం, EVల్లో టాటా టియాగోకు చాలా డిమాండ్ ఉంది. ఇల్లు-ఆఫీస్ మధ్య డైలీ అప్&డౌన్ కొట్టేవాళ్ల అవసరాలకు ఇది చక్కగా సరిపోతుంది.
టాటా టియాగో EV ధర, ఫీచర్లు
టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర (Tata Tiago EV ex-showroom price) దాదాపు 8 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.49 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం, టాటా టియాగో EV బేస్ మోడల్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కి.మీ.ల రేంజ్ అందించగలదు. టాప్ వేరియంట్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకబిగిన 315 కి.మీ.ల వరకు ప్రయాణించగలదు. టియాగో EV టాప్ వేరియంట్ 24kWh బ్యాటరీ నుంచి పవర్ అందుకుంటుంది. ఉదారణకు, మీరు నెలకు 1500 కి.మీ. (సగటున రోజుకు 50 కి.మీ.) నడిపితే, నెలవారీ ఖర్చు రూ. 2,145 అవుతుంది. వాహనం ఒక సంవత్సరంలో 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఖర్చు రూ. 25,740 అవుతుంది. మెట్రో ట్రైన్ టిక్కెట్ ఖర్చుతో పోలిస్తే ఇది చవక.
టాటా టియాగో పెట్రోల్ వెర్షన్ ఎంత మైలేజ్ ఇస్తుంది?
టియాగో EV ఖర్చును టియాగో పెట్రోల్ వెర్షన్ ఖర్చుతో పోల్చి చూద్దాం. టియాగో పెట్రోల్ వెర్షన్‌లో 35 లీటర్ల ఇంధన ట్యాంక్ బిగించారు. కంపెనీ ప్రకారం, ఈ బండి మైలేజ్ లీటరుకు 18.42 కిలోమీటర్లు. అంటే, ఫుల్ ట్యాంక్ మీద దాదాపు 645 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ధర లీటరుకు రూ. 107 అనుకుంటే, ఫుల్ ట్యాంక్ కోసం రూ. 3,745 ఖర్చు చేయాలి. ఈ లెక్కన ఒక కి.మీ. డ్రైవ్ చేయడానికి దాదాపు రూ. 5.80 ఖర్చవుతుంది. మీరు నెలకు సగటున 1500 కి.మీ. నడిపితే, ఇంధనం కోసం రూ. 8,700 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 1,04,400 వెచ్చించాలి. అదే టియాగో EV ఏడాది ఖర్చు రూ. రూ. 25,740 మాత్రమే.
మీకు ఎంత ఆదా అవుతుందో తెలుసా?
రెండు కార్ల వ్యయాలను పోల్చి చూసిన తర్వాత, టియాగో EV ఎంత డబ్బు మిగల్చగలదో మీకు తేలికగా అర్ధమై ఉంటుంది. పెట్రోల్ కారుతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ కారు సంవత్సరానికి దాదాపు రూ. 78,660 ఆదా చేయగలదు. అంటే, పెట్రోల్ కార్‌కు అయ్యే వ్యయంలో కేవలం పావువంతు ఖర్చుతో EVని డ్రైవ్ చేయవచ్చు. ఈ సేవింగ్ ఇక్కడితో ఐపోలేదు. EVతో పోలిస్తే పెట్రోల్ కార్‌కు విడిభాగాలు, రిపేర్ల ఖర్చు ఎక్కువ. నిర్వహణ ఖర్చుల రూపంలోనూ EV మీకు చాలా ఎక్కువ డబ్బు మిగల్చగలదు. ఈ మిగులు డబ్బును మీరు ఎంజాయ్ చేయడానికి లేదా పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చు.





















