Bumper Discount: టయోటా పాపులర్ SUVపై రూ.లక్ష డిస్కౌంట్- కార్ కొనేవాళ్లు కాదనలేని బంపర్ ఆఫర్
Toyota Urban Cruiser Hyryder: ఈ నెలలో, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కొనేవాళ్లకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఈ SUV కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటి.

Toyota Urban Cruiser Hyryder Price, Mileage And Features: మీరు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను చూశారుగా.. కార్ మార్కెట్‌లో నేనే మొనగాణ్ని అన్నంత దర్జాగా, ఠీవిగా నిలబడి ఉంటుంది. కార్ కొనాలని చూస్తున్న వాళ్లకు దీని ప్రీమియం లుక్స్‌తో ఖచ్చితంగా పీలింగ్స్ కలుగుతాయి. మీరు కూడా లగ్జరియస్ హైరైడర్‌తో లవ్‌లో పడితే, ఈ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ నెల (మే 2025) మీ కోసం గొప్ప అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెలలో, టయోటా కంపెనీ, ఈ పాపులర్ SUV పై దాదాపు లక్ష రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఖచ్చితంగా చెప్పాలంటే, రూ. 94,000 వరకు భారీ తగ్గింపును (Discount on Toyota Urban Cruiser Hyryder) అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే చెల్లుతుంది. కాబట్టి, ఈ గ్రేట్ డీల్‌ను సకాలంలో సద్వినియోగం చేసుకునే తెలివైన నిర్ణయం తీసుకోండి.
మే 2025లో, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV పై ఆకర్షణీయమైన ఆఫర్లు (Offers On Toyota Urban Cruiser Hyryder) అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, పెట్రోల్ E వేరియంట్ కొనే కస్టమర్‌లు రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 11,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 లాయల్టీ బోనస్ & రూ. 18,517 ఫ్రీ ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందుతారు. ఈ మొత్తం ఆఫర్ల విలువ రూ. 94,000 అవుతుంది, ఈ డబ్బు మొత్తం ఆదా అయినట్లే.
పెట్రోల్ వేరియంట్లపై కూడా ఆఫర్లు
టయోటా బ్రాండ్‌లోని ఇతర పెట్రోల్ వేరియంట్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. రూ. 15,000 వరకు విలువైన యాక్ససరీస్, రూ. 11,000 ఎక్స్ఛేంజ్ బోనస్ & రూ. 18,517 ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటివి కస్టమర్లకు అందుతాయి. వీటన్నింటినీ కలిపితే ప్రయోజనం మొత్తం దాదాపు రూ. 44,000 కు చేరుకుంటుంది.
హైబ్రిడ్ వేరియంట్ మీద గ్రేట్ డిస్కౌంట్
టయోటా హైరైడర్ హైబ్రిడ్ వెర్షన్ కొనే వాళ్లకు రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 11,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 లాయల్టీ బోనస్ & ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభిస్తాయి, ఇది మొత్తం ప్రయోజనాన్ని రూ. 76,000 కు తీసుకువెళుతుంది. అయితే, ప్రస్తుతం CNG వెర్షన్ మీద క్యాష్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేదు. ఈ వేరియంట్ కొంటే ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రయోజనాన్ని మాత్రమే పొందుతారు.
టయోటా హైరైడర్ ధర
2WD మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధర (Toyota Urban Cruiser Hyryder ex-showroom price) రూ. 17.49 లక్షల నుంచి రూ. 17.69 లక్షల మధ్య ఉంది. AWD (All-Wheel Drive) మోడళ్ల ఎక్స్-షోరూమ్ రేటు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.14 లక్షల మధ్య ఉంటుంది. ఈ ధరలు & ఆఫర్లు నగరం, వేరియంట్, రంగు & మోడల్ ఇయర్, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ సమీపంలోని టయోటా డీలర్‌షిప్ నుంచి పూర్తి సమాచారం పొందండి.





















