అన్వేషించండి

AirCar: బటన్ నొక్కితే విమానంలా మారే ఈ కారు, త్వరలో లాంచింగ్‌ - రేటు ఎంతంటే?

Klein Vision AirCar: ఈ ఎయిర్‌కార్ ఒక కన్వర్టబుల్ కారు. దీనిని సాధారణ వాహనంలాగా రోడ్డుపై సులభంగా నడపవచ్చు & అవసరమైతే ఎగిరే విమానంగా కూడా మార్చవచ్చు.

Klein Vision AirCar Price And Launching Date: అప్పుడెప్పుడో 36 ఏళ్ల క్రితం, 1989 మార్చిలో, 'బామ్మ మాట బంగారు బాట' సినిమా రిలీజ్‌ అయింది. ఆ సినిమాలో చూపించిన కార్‌ రోడ్డుపై పరిగెడుతుంది, విమానంలా గాల్లోనూ ఎగురుతుంది. కారు గాల్లో ఎగురుతుంటే, కింద ఉన్న ప్రజలంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుంటారు. ఇది పూర్తిగా కల్పితం & సినిమా కథ అయినప్పటికీ, కార్‌లను గాలిపటంలా గాల్లో ఎగిరించడంపై చాలా ఏళ్లుగా సీరియస్‌గా రీసెర్చ్‌ జరుగుతోంది.

టెక్నాలజీ మారిన తర్వాత, ఈ మధ్యకాలంలో, కార్‌లకు బదులు మనుషులను సులువుగా మోసుకెళ్లగల డ్రోన్‌లను తయారు చేయడం మొదలు పెట్టారు. డ్రోన్‌ల విషయంలో చాలావరకు విజయం సాధించినప్పటికీ, ఎగిరే కార్లపై జనంలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఎగిరే కార్లపై ఇప్పటికీ నిరంతరం పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్లోవేకియాకు చెందిన స్టార్టప్ కంపెనీ "క్లైన్‌ విజన్‌", తన తొలి ఎగిరే కారు గురించి ప్రపంచానికి వెల్లడిచించింది. ఆ కారు పరీక్షల దశ దాటుకుని ఉత్పత్తికి సిద్ధంగా ఉందని చెబుతూ, కార్‌ నమూనాను విడుదల చేసింది. ఎగిరే కార్‌ను పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు క్లైన్‌ విజన్‌ తెలిపింది. 

క్లైన్‌ విజన్‌, ఎయిర్ కార్‌ కలను నిజం చేయడానికి ఇది గత 30 సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రారంభం నుంచి ప్రొడక్షన్ రెడీ మోడల్ వరకు, 170కి పైగా ఫ్లయింగ్ అవర్స్ & 500కి పైగా టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు పూర్తి చేసింది. 2022 సంవత్సరంలో, ఈ ఎయిర్‌ కార్ మోడల్‌కు ఫ్లయింగ్ సర్టిఫికేట్ దక్కించుకుంది. అంటే, ఈ కార్‌ను విమానంలా గాల్లో నడపడానికి అనుమతులు పొందింది.

ఎయిర్ కార్ ధర ఎంత ఉంటుంది? 
క్లైన్‌ విజన్‌ ఎయిర్‌ కార్ వచ్చే ఏడాది గ్లోబల్‌ మార్కెట్లోకి విడుదల కానుంది. కంపెనీ ప్రతినిధి వెల్లడించిన ప్రకారం, ఎగిరే కారు ధర 8 లక్షల నుంచి 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (USD) డాలర్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో మార్చి చెప్పుకుంటే, ఈ ధర దాదాపు రూ. 6.78 కోట్ల నుంచి రూ. 8.47 కోట్ల వరకు ఉంటుంది. 

 కన్వర్టబుల్ కారు
ఎయిర్‌ కార్‌ అంటే పూర్తిగా గాల్లో మాత్రమే ప్రయాణిస్తుందని కాదు. ఇది కన్వర్టబుల్ కారు. అంటే, దీనిని సాధారణ కారు తరహాలో రోడ్డుపై సులభంగా డ్రైవ్‌ చేయవచ్చు. అవసరమైన సమయంలో విమానంలా మార్చి రివ్వున ఎగిరిపోవచ్చు. ఇక్కడ చెప్పుకోవాల్సిన పెద్ద విశేషం ఏంటంటే.. ఈ కన్వర్టబుల్ వెహికల్‌ కార్‌ నుంచి విమానంలా మారడానికి కేవలం 2 నిమిషాల సమయం చాలు.

క్లైన్‌ విజన్‌ ఎయిర్‌ కార్ వేగం ఎంత? 
ఎయిర్‌ కార్ సిస్టమ్‌ మొత్తం ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. క్లైన్‌ విజన్‌ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎయిర్‌ కార్ తాజా వేరియంట్ రోడ్డు మీద గంటకు 200 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది విమానంలా గాల్లోకి లేచిందంటే కార్‌ను అంతకుమించిన వేగాన్ని అందుకుంటుంది. గాలిలో, గంటకు 250 కి.మీ. స్పీడ్‌తో రాకెట్‌లా రివ్వున దూసుకెళుతుంది & గాలితోనే పోటీ పడుతుంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తయినా క్లైన్‌ విజన్‌ ఎయిర్‌ కార్‌ సొంతం చేసుకున్నాడంటే, ఆ కారులో వాయు మార్గంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లడానికి కేవలం గంట సమయం చాలు. గాల్లోకి ఎగిరిన తర్వాత ట్రాఫిక్‌ చిక్కుముళ్లు, రోడ్డు మలుపులతో సంబంధం లేకుండా ముక్కుసూటిగా ముందుకే దూసుకెళ్లవచ్చు కాబట్టి, గంటకు 250 కి.మీ. స్పీడ్‌తో గంటలోపే హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకునే అవకాశం కూడా ఉంది.

టాప్ హెడ్ లైన్స్

ఇ-క్లచ్‌తో Rebel 300, Rebel 500 - క్లచ్‌ నొక్కే పని లేదు, గేర్‌ మార్చుకుంటూ దూసుకెళ్లడమే!
బాబర్‌ స్టైల్‌లో అదిరిపోయిన Honda Rebel 300, Rebel 500 - త్వరలోనే లాంచ్‌!
2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు
కొత్త Maruti Brezza ఎంత మైలేజ్‌ ఇస్తుంది? - మీ డబ్బులు ఆదా చేసే వేరియంట్‌ ఇదే!
E20తో పాటు E85 ఇంధనంతోనూ నడిచే హోండా ADV160 - ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
బైక్‌ లాంటి హోండా కొత్త మాక్సీ స్కూటర్‌ - అడ్వెంచర్‌ లుక్‌తో ADV160 అదుర్స్‌!
Tata Tiago on EMI: ₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?
₹50,000 డౌన్ పేమెంట్‌తో టాటా టియాగోను కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత ఉంటుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Embed widget