అన్వేషించండి

New EVs With 500km Range: 5 ఎలక్ట్రిక్ కార్లు, 500km రేంజ్ - ఏ కార్‌ కొంటారో మీ ఇష్టం

Upcoming EVs With 500 km Range: 500 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగల 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇండియన్‌ రోడ్లపైకి రాబోతున్నాయి. టాటా, మహీంద్రా, మారుతి లోగోలతో ఈ కార్లు లాంచ్‌ కానున్నాయి.

Upcoming Electric Cars With 500 km Range: పెట్రోల్‌ & డీజిల్‌ కార్లకు క్రమంగా దూరమవుతున్న ప్రజలు, ఎలక్ట్రిక్‌ కార్‌లపై మోజు చూపిస్తున్నారు. ప్రజావాక్కుకు తగ్గట్లుగా విద్యుత్‌ వాహనాల నాణ్యతలో కీలక మార్పులను మనం చూస్తున్నాం. నిన్న, పర్‌ఫెక్ట్‌ అంటూ పొగడ్తలు అందుకున్న ఫీచర్లు ఈ రోజు పాతబడుతున్నాయి, వాటిని తలదన్నే తలదన్నే ఆధునిక మార్పులు అందుబాటులోకి వస్తున్నాయి. లాంగ్‌ రేంజ్‌ & పవర్‌ఫుల్‌ ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌ (EVs) ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది.

ప్రజాభీష్టానికి అనుగుణంగా పలు కంపెనీలు 2025లో శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి, ఇవి 500 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలవు. అప్‌కమింగ్స్‌ లిస్ట్‌లో.. టాటా మోటార్స్, మారుతి సుజుకి & మహీంద్రా వంటి పెద్ద బ్రాండ్‌ల పేర్లు ఉన్నాయి.

1. మహీంద్రా ఎక్స్‌ఈవీ 7ఇ ‍‌(Mahindra XEV 7e)
మహీంద్రా XEV 7e అనేది ఈ కంపెనీ పాపులర్‌ SUV XUV700 కి ఎలక్ట్రిక్ వెర్షన్. ఈ మోడల్‌లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ వివరాలను కంపెనీ ఇంకా బహిరంగపరచనప్పటికీ, రిపోర్ట్స్‌ ప్రకారం, ఫుల్‌ ఛార్జ్‌తో ఈ EV 500 కి.మీ.కు పైగా రేంజ్ ఇవ్వగలదు. ఈ కారు కంపెనీ Born Electric సిరీస్‌లో భాగంగా రానుంది & 2025 మధ్య నాటికి భారతదేశంలో బుకింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి.

2. ఎంజీ ఎం9 (MG M9)
MG మోటార్ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా, త్వరలో MG M9 EV MPV ని విడుదల చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్‌ కార్‌ ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లోకి 90 kWh బ్యాటరీతో ప్రవేశించింది. ఈ బ్యాటరీ 430 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ ఇవ్వగలదని సమాచారం. భారతదేశంలో, ప్రీమియం MG సెలెక్ట్ అవుట్‌లెట్స్‌లో ఈ కార్‌ విక్రయాలు జరుగుతాయి.

3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 EV (Mahindra XUV 3X0 EV)
టెస్టింగ్‌ సమయంలో, మహీంద్రా XUV 3X0 EV భారతీయ రోడ్లపై చాలాసార్లు కనిపించింది. ఈ కారును XUV300 ఆధారంగా తయారు చేశారు & దీని ద్వారా కాంపాక్ట్ SUV విభాగంలో అడుగు పెట్టబోతున్నారు. రిపోర్ట్స్‌ ప్రకారం, ఈ EV 400 నుంచి 450 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. కంపెనీ, అడ్వాన్స్‌డ్‌ కనెక్టివిటీ ఫీచర్లు & అత్యాధునిక  భద్రత సాంకేతికతను ఈ కార్‌లో చేర్చవచ్చు.

4. మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara)
మారుతి సుజుకి బ్రాండ్‌ నుంచి భారతదేశంలో విడుదల కానున్న తొలి ఎలక్ట్రిక్ SUV ఇదే అవుతుంది. దీనిని మొదటిసారిగా 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024'లో ప్రదర్శించారు. ఇ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్స్‌తో రాబోతోంది, హై-రేంజ్‌ బ్యాటరీ వేరియంట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ కార్‌, ఎలక్ట్రిక్ కార్‌ మార్కెట్‌లో మారుతి సుజుకికి కీలక షేర్‌ అందించగలదని భావిస్తున్నారు.

5. టాటా హారియర్ EV (Tata Harrier EV)
టాటా మోటార్స్, తన SUV హారియర్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా హారియర్ EV కూడా పరీక్ష సమయంలో చాలాసార్లు కనిపించింది. ఫుల్‌ ఛార్జ్‌తో ఈ EV 500 కి.మీ. పైగా డ్రైవింగ్‌ రేంజ్‌ అందించగలదని సమాచారం. ADAS, డిజిటల్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ కార్‌ రూపొందిందని రిపోర్ట్స్‌ నివేదికలు సూచిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget