అన్వేషించండి

EV vs Hybrid Car: మీ ప్రయాణానికి ఏ కారు బెటర్‌? ఈ రెండు టెక్నాలజీల మధ్య తేడా ఏంటి? కీలక విషయాలు తెలుసుకోండి

Electric vs Hybrid Car: మారుతున్న ట్రెండ్‌ నేపథ్యంలో, వ్యక్తిగత ప్రయాణం లేదా ఫ్యామిలీ కోసం ఏ కారు కొనడం మంచిది అనే ప్రశ్న తరచూ తలెత్తుతుంది. ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకుందాం.

Electric Car vs Hybrid Car Comparison: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశంలో ఉన్న ఈ కాలంలో & కాలుష్య నియంత్రణ నియమాలు కఠినతరం అవుతున్న తరుణంలో, కొత్త కారు కొనే వ్యక్తి తనకు తానే ఒక ప్రశ్న వేసుకోవాలి - "నేను ఎలక్ట్రిక్ కారు కొనాలా లేదా హైబ్రిడ్ కారు కొనాలా?". ఈ రెండు రకాల కార్లకు దేని ప్రయోజనాలు & పరిమితులు దానికి ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ రెండు టెక్నాలజీల మధ్య తేడా ఏమిటో మీరు తెలుసుకోవాలి.

పవర్‌ట్రెయిన్ & టెక్నాలజీ

  • ఎలక్ట్రిక్ కారు లేదా EV.. బ్యాటరీ & ఎలక్ట్రిక్ మోటార్‌తో మాత్రమే నడుస్తుంది, వాటికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరం లేదు.
  • ఈ వాహనాలు పొగను విడుదల చేయవు. అంటే, టెయిల్ పైప్ నుంచి ఎటువంటి కాలుష్యం ఉండదు. ఇవి పర్యావరణానికి పరిశుభ్రమైనవి & సురక్షితమైనవి.
  • దీనికి విరుద్ధంగా, హైబ్రిడ్ కార్లు రెండు వ్యవస్థలను కలిగి ఉంటాయి - పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ & ఎలక్ట్రిక్ మోటారు. 
  • ఈ కార్లలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి. మొదటిది - మైల్డ్ హైబ్రిడ్, దీనిలో ఎలక్ట్రిక్ మోటారు మాత్రమే ఇంజిన్‌కు పవర్‌ ఇస్తుంది.
  • రెండోది- స్ట్రాంగ్ హైబ్రిడ్, ఇది కొంత దూరం వరకు పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది.
  • మూడోది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV). దీని బ్యాటరీని బాహ్య ఛార్జర్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు.
  • ఎలక్ట్రిక్ కార్లకు సంప్రదాయ ఇంధనం అవసరం లేదు. హైబ్రిడ్ కార్లు సాంప్రదాయ ఇంధనాన్ని ఆదా చేస్తాయి తప్ప దాని నుంచి పూర్తిగా మినహాయింపు పొందవు.

మైలేజ్ & రన్నింగ్ ఖర్చు

  • ఇంజిన్ & మోటారు రెండింటి సమన్వయం కారణంగా హైబ్రిడ్ కార్లు మంచి మైలేజీని ఇస్తాయి.
  • ఉదాహరణకు, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ కార్లు దాదాపు 28 KMPL మైలేజీని అందిస్తున్నాయి.
  • ఎలక్ట్రిక్ కార్లు విద్యుత్తుతో నడుస్తాయి. భారతదేశంలో ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6 నుంచి రూ.8 వరకు ఉంటుంది. అందువల్ల వీటి నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు రూ.1 కంటే తక్కువగా ఉంటుంది. 
  • అయితే, EVలకు ఉన్న అతి పెద్ద అవరోధం వాటి పరిధి. సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నప్పుడు ఛార్జింగ్ గురించి ఎప్పుడూ ఆందోళన ఉంటుంది. 
  • హైబ్రిడ్ కార్లకు ఈ సమస్య ఉండదు, సమీపంలోని పెట్రోల్ బంక్‌ నుంచి ఇంధనం పొందవచ్చు &ఎక్కడా ఆగకుండా ప్రయాణం సాగించవచ్చు.
  • పర్యావరణ పరంగా EVలు పూర్తిగా “జీరో టెయిల్ పైప్ ఎమిషన్” కార్లు, అంటే అవి నడుస్తున్నప్పుడు ఎలాంటి పొగ లేదా వాయువును విడుదల చేయవు.

ఛార్జింగ్ & ఇంధనం నింపే సౌకర్యం

  • EVలను ఛార్జ్ చేయడానికి ఇంట్లో ఛార్జర్ లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం.
  • ఈ సౌకర్యం ఇప్పుడు నగరాల్లో పెరుగుతోంది, కానీ చిన్న నగరాలు & పట్టణాలలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి.
  • ఎలక్ట్రిక్‌ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లకు ఛార్జింగ్ అవసరం లేదు. ఏ పెట్రోల్ పంపులోనైనా సులభంగా ఇంధనం నింపుకోవచ్చు.
  • ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కార్లు అవసరమైనప్పుడు బ్యాటరీతో పాటు పెట్రోల్‌తోనూ నడుస్తాయి, ప్రయాణాన్ని మరింత సులభంగా మారుస్తాయి.

ధర & నిర్వహణ 

  • ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. హైబ్రిడ్ కార్ల ధర రూ. 15 నుంచి రూ. 22 లక్షల మధ్య ఉంటుంది.
  • EVలకు ఇంజిన్లు & గేర్‌బాక్స్‌లు ఉండవు, అందువల్ల వాటి నిర్వహణ ఇతర కార్ల కంటే తక్కువగా ఉంటుంది. అయితే, EV బ్యాటరీ దెబ్బతింటే దానిని మార్చడం చాలా ఖరీదైన వ్యవహారం.
  • హైబ్రిడ్ కార్లకు ఇంజిన్ & మోటారు వ్యవస్థలు ఉండడం వల్ల వాటి నిర్వహణ కొంచెం ఎక్కువగా ఉండవచ్చు & ఎక్కువ సర్వీస్ కూడా అవసరం కావచ్చు.

కాబట్టి, ఎలక్ట్రిక్‌ కార్‌ vs హైబ్రిడ్‌ కార్‌లలో దేని ప్రయోజనాలు, పరిమితులు దానికి ఉన్నాయి. పైన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, మీ అవసరాల ఆధారంగా ఒక కారును ఎంపిక చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget