అన్వేషించండి

ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!

విజయవాడలో ఎలక్ట్రిక్ కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన నేపథ్యంలో, ఈవీ కార్లలో మంటల ముప్పును తగ్గించే ఛార్జింగ్ పద్ధతులు, బ్యాటరీ తనిఖీలు & భద్రతా సూచనలు తెలుసుకోండి.

Electric car fire safety tips: ఇంధన ఖర్చులు తగ్గించుకోవడానికి చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాలను ఎంచుకుంటున్నారు. అయితే, వాహన భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విజయవాడలో జరిగిన ప్రమాదం ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. వెస్ట్ బైపాస్‌పై వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ కార్లలో మంటలు చెలరేగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాహనదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి?.

ఎలక్ట్రిక్ కార్లలో మంటలు ఎందుకు వస్తాయి?

ఎలక్ట్రిక్ కార్లలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు ఉంటాయి. ప్రమాద సమయంలో బ్యాటరీ దెబ్బతింటే లోపల రసాయన చర్యలు వేగంగా జరిగి మంటలు చెలరేగవచ్చు. దీనిని బ్యాటరీలో ఉష్ణ నియంత్రణను కోల్పోవడం అంటారు. ఒక్కసారి ఈ పరిస్థితి ఏర్పడితే వేడి వేగంగా పెరగడంతో పాటు పొగ, విషపూరిత వాయువులు వెలువడే ప్రమాదం ఉంటుంది.

అయితే, ప్రతి ఎలక్ట్రిక్ కారు ప్రమాదంలో మంటలు చెలరేగవు. సరైన నిర్వహణ, భద్రత ప్రమాణాలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో ప్రమాదాల ముప్పును తగ్గించవచ్చు.

ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యం వద్దు

ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కంపెనీ సూచించిన పద్ధతులనే అనుసరించాలి. నాణ్యమైన, అనుమతి పొందిన ఛార్జింగ్ పరికరాలను ఉపయోగించాలి. దెబ్బతిన్న కేబుళ్లు, ప్లగ్‌లతో ఛార్జింగ్ చేయకూడదు. సాధారణ విద్యుత్ తీగలనే పొడిగించి వాటిపైనే ఆధారపడకుండా, తగిన సామర్థ్యం కలిగిన ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!

ఛార్జింగ్ పాయింట్ వద్ద వేడి పెరగడం, కాలిన వాసన రావడం, పొగ కనిపించడం వంటివి గమనించిన వెంటనే అప్రమత్తం కావాలి. ముందుగా, తగిన జాగ్రత్తలతో స్విచ్‌ ఆఫ్‌ చేసి ప్లగ్‌ తీసేయాలి. ఆ తర్వాత ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా నిపుణులతో తనిఖీ చేయించాలి. కంపెనీ సూచించిన ఛార్జింగ్ పరిమితులను పాటించాలి. ఛార్జింగ్ సమయంలో వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి.

బ్యాటరీ దెబ్బతింటే వెంటనే తనిఖీ

కారు ప్రమాదానికి గురైనప్పుడు బయటకు పెద్దగా నష్టం కనిపించకపోయినా బ్యాటరీ లోపల దెబ్బతిని ఉండవచ్చు. ముఖ్యంగా కారు కింది భాగానికి ఏదైనా బలంగా తగిలినా, బ్యాటరీ ప్రాంతంలో గీతలు/పగుళ్లు ఏర్పడినా వెంటనే అధీకృత సేవా కేంద్రంలో తనిఖీ చేయించాలి. వరద/వర్షపు నీటిలో మునిగిన వాహనాన్ని కూడా నిపుణుల పరిశీలన లేకుండా ఛార్జింగ్ చేయకూడదు. ఈ జాగ్రత్త పాటించకపోతే బ్యాటరీ ఛార్జింగ్‌ సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ ప్రమాదం పొంచి ఉంటుంది.

కారు నడుపుస్తున్నప్పుడు బ్యాటరీ ప్రాంతం నుంచి అసాధారణ వేడి, పొగ, శబ్దాలు లేదా వింత వాసన వస్తే వాహనాన్ని సురక్షితంగా ఆపి అందులో నుంచి బయటకు రావాలి. తిరిగి కారులోకి వెళ్లకూడదు. అత్యవసర సేవలకు సమాచారం అందించాలి.

ఇది కూడా చదవండి: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

అతివేగం ప్రాణాంతకం

వాహనంలో ఎన్ని భద్రత సదుపాయాలు ఉన్నా అతి వేగం ప్రమాద తీవ్రతను పెంచుతుంది. ముఖ్యంగా బైపాస్‌లు, జాతీయ రహదారులపై వేగ పరిమితులను పాటించాలి. ముందు వెళ్తున్న వాహనానికి తగిన దూరం ఉంచాలి. ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు.

మంటలు కనిపిస్తే ఏం చేయాలి?

కారులో మంటలు లేదా దట్టమైన పొగ కనిపించిన వెంటనే వాహనాన్ని సురక్షితంగా ఆపి అందరూ బయటకు రావాలి. వీలైనంత దూరంగా వెళ్లి ఇతరులను కూడా అప్రమత్తం చేయాలి. వెంటనే 112 అత్యవసర సేవలకు లేదా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలి. బ్యాటరీ నుంచి మంటలు వస్తున్నప్పుడు స్వయంగా వాటిని ఆర్పేందుకు ప్రయత్నించకూడదు. శిక్షణ పొందిన సిబ్బంది వచ్చే వరకు సురక్షిత దూరంలో ఉండాలి.

ఎలక్ట్రిక్ కార్లు ఆధునిక రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, సాంకేతికతపై నమ్మకంతో పాటు భద్రతపై అవగాహన కూడా అవసరం. సరైన ఛార్జింగ్, క్రమం తప్పని తనిఖీలు, వేగ నియంత్రణ, ప్రమాద సమయంలో అప్రమత్తత.. ఈ నాలుగు అంశాలు ప్రతి వాహనదారుడి ప్రాధాన్యంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదానికి దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలే మనకు రక్షణ కల్పిస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Embed widget