అన్వేషించండి

Toyota Discount Offer: ఫీచర్లలో క్రెటా-విటారాకు దీటు, వాటి కంటే తక్కువ రేటు - టయోటా కార్‌ మీద గోల్డెన్‌ డిస్కౌంట్‌

Big Discount On Toyota Hyryder: భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUVలకు డిమాండ్‌, ఆ కార్ల వేగంతో పోటీ పడుతోంది. టయోటా హైరైడర్ మీద కంపెనీ ఇప్పుడు మంచి డిస్కౌంట్‌ ఇస్తోంది.

Discount Offer On Toyota Hyryder: భారతీయ రోడ్లపై మిడ్-సైజ్ SUVల గాలి వీస్తోందిప్పుడు. ప్రీమియం ఫీచర్లతో మధ్య తరగతి మనుషులకు అందుబాటు ధరల్లో ఉండడం వల్ల వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ & మారుతి విటారా వంటివి మిడ్-సైజ్ SUVల సెగ్మెంట్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటితో టయోటా హైరైడర్ బలంగా పోటీ పడుతోంది. ఈ కార్‌లలో ఉన్న ఫీచర్లన్నీ దాదాపుగా టయోటా తన హైరైడర్‌లోనూ ఉన్నాయి.  టయోటా కంపెనీ, ఈ నెలలో (మే 2025), హైరైడర్‌ SUV మీద రూ. 68,000 వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. సాధారణంగా, ఈ అన్ని SUVల్లో గ్రాండ్ విటారా చవక. గ్రాండ్ విటారా ఎంట్రీ-లెవల్ ధర దాదాపు రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైరైడర్‌ రూ. 11.34 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది. టయోటా ప్రకటించిన రూ. 68,000 డిస్కౌంట్‌ను పూర్తిగా యూజ్‌ చేసుకుంటే.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి విటారా కంటే తక్కువ రేటుకు టయోటా హైరైడర్‌ కొనవచ్చు. ఈ తగ్గింపు పరిమిత సమయం వరకు & పరిమిత స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది. 

టయోటా హైరైడర్ ఫీచర్లు 
టయోటా హైరైడర్ ప్రీమియం & ఫీచర్-రిచ్ మిడ్-సైజ్ SUVగా డిజైన్‌ అయింది. క్యాబిన్‌లో 9-అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పని చేస్తుంది. కారుకు స్పష్టంగా దారి చూపించే ఫుల్‌ LED హెడ్‌ల్యాంప్‌లు, క్యాబిన్‌లో ఆకట్టుకునే యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్ & ప్రయాణీకుల భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇంకా... టయోటా హైరైడర్ SUVలో ABS (యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌), EBD ‍‌(ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌) & ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటి అత్యాధునిక భద్రతలను కూడా యాడ్‌ చేశారు. కారు లుక్స్‌తో పాటు డ్రైవ్‌ను మరింత స్టైలిష్‌గా మార్చడానికి 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ బిగించారు & టయోటా స్మార్ట్ ఐ-కనెక్ట్ సాఫ్ట్‌వేర్‌ అందించారు. ఇది యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగ్గా మారుస్తుంది. ఈ ప్రీమియం ఫీచర్లన్నీ కలిసి టయోటా హైరైడర్‌ను సురక్షితమైన, సౌకర్యవంతమైన & ఫీచర్‌-రిచ్‌ SUVగా నిలబెట్టాయి.

ఇంజిన్ & పనితీరు 
టయోటా హైరైడర్ 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 5500rpm వద్ద 86.63 bhp శక్తిని & 4200rpm వద్ద 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను యాడ్‌ చేశారు, ఇది మృదువైన & సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. టయోటా హైరైడర్‌లో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే దొరుకుతుంది. కంపెనీ ప్రకారం, CNG వేరియంట్ క్లెయిమ్డ్‌డ్‌ మైలేజ్ 26.6 KM/KG వరకు ఉంటుంది. స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌ చూపిస్తూనే ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ ఇచ్చే కార్‌ చూస్తున్న కస్టమర్లకు టయోటా హైరైడర్ గొప్ప ఎంపిక కావచ్చు.

టయోటా హైరైడర్‌పై గరిష్టంగా రూ. 68,000 వరకు తగ్గింపును కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. మీ నగరం, ఎంచుకున్న వేరియంట్ & డీలర్‌షిప్‌పై ఆధారపడి ఈ డిస్కౌంట్‌ కొద్దిగా మారవచ్చు. కాబట్టి, ఈ SUV కొనే ముందే మీ సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌నకు వెళ్లి డిస్కౌంట్లకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని పొందండి. 

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Embed widget