అన్వేషించండి

కారులో మీ లగేజ్‌కు సరిపడా చోటు కావాలా? ఎక్కువ బూట్‌ స్పేస్‌ ఇస్తున్న కాంపాక్ట్‌ SUVల ర్యాంకింగ్స్‌

భారత్‌లో అమ్ముడవుతున్న కాంపాక్ట్‌ SUVల బూట్‌ స్పేస్‌ కంపారిజన్‌. Kia Syros నుంచి Mahindra XUV 3XO వరకు – ఏ కారులో ఎంత లగేజ్‌ పెట్టుకోవచ్చో తెలుసుకోండి.

Compact SUVs With Highest Boot Space: భారత మార్కెట్‌లో కాంపాక్ట్‌ SUVలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. సబ్‌-4 మీటర్‌ పరిమితిలో ఉండటం వల్ల డిజైన్‌, క్యాబిన్‌ స్పేస్‌తో పాటు బూట్‌ కెపాసిటీ విషయంలో కొన్ని సహజమైన పరిమితులు ఉంటాయి. మిడ్‌సైజ్‌ SUVలతో పోలిస్తే వీటి బూట్‌లు తక్కువే. అయినప్పటికీ, రోజువారీ వినియోగం, చిన్న ప్రయాణాలు, కుటుంబ అవసరాలకు సరిపడే బూట్‌ స్పేస్‌ ఉన్న మోడల్స్‌ కూడా ఉన్నాయి.

వెనుక సీట్లు మడవకుండా, బూట్‌ ఫ్లోర్‌ నుంచి పార్సెల్‌ ట్రే వరకు కొలిచిన బూట్‌ కెపాసిటీ ఆధారంగా కాంపాక్ట్‌ SUVలకు ర్యాంక్‌లు ఇచ్చాం. తక్కువ బూట్‌ నుంచి ఎక్కువ బూట్‌ వరకు - టాప్‌-9 లిస్ట్‌ ఇదిగో...

Mahindra XUV 3XO – 295 లీటర్లు

ఈ జాబితాలో అతి చిన్న బూట్‌ XUV 3XOదే. కేవలం 295 లీటర్లు మాత్రమే ఉండటం వల్ల పెద్ద బ్యాగులు పెట్టుకోవడం కష్టమే. పైగా సైడ్‌ ఇంట్రూజన్లు ఎక్కువగా ఉండటంతో ఉపయోగం మరింత తగ్గుతుంది. లోడింగ్‌ లిప్‌ ఎక్కువగా ఉండటం కూడా ఇబ్బందిగా మారుతుంది.

Maruti Suzuki Fronx / Toyota Urban Cruiser Taisor – 308 లీటర్లు

ఈ రెండింటికీ ఒకే స్థాయి బూట్‌ స్పేస్‌ ఉంది. 308 లీటర్లు చిన్న కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అయితే స్లోపింగ్‌ రూఫ్‌, ఎత్తైన సిల్‌ కారణంగా బరువైన లగేజ్‌ ఎక్కించడం కొంత కష్టమే.

Maruti Suzuki Brezza – 328 లీటర్లు

Brezza బూట్‌ వెడల్పైన ఓపెనింగ్‌, స్క్వేర్‌ ఆకారం వల్ల బాగా ఉపయోగపడుతుంది. 328 లీటర్ల స్పేస్‌ వల్ల, ప్రయాణానికి ముందు పెద్దగా ప్లాన్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

Nissan Magnite / Renault Kiger – 336 లీటర్లు

ఈ రెండు మోడల్స్‌లో 336 లీటర్ల బూట్‌ ఉంది. ఆకృతి బాగుండటంతో రెండు పెద్ద ట్రావెల్‌ బ్యాగులు సులభంగా పడతాయి. లోతు, వెడల్పు మంచి స్థాయిలో ఉంటాయి.

Tata Nexon – సుమారు 350 లీటర్లు

Nexon బూట్‌లో హుక్స్‌, బూట్‌ లైట్‌, 12V సాకెట్‌ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే వీల్‌ ఆర్చ్‌ ఇంట్రూజన్ల కారణంగా వెడల్పు లగేజ్‌కు కొంత అడ్డంకి ఉంటుంది.

Skoda Kylaq – 360 లీటర్లు

360 లీటర్ల బూట్‌తో Kylaq మంచి ప్రాక్టికాలిటీ ఇస్తుంది. స్క్వేర్‌ షేప్‌, సరైన డెప్త్‌ వల్ల లోడింగ్‌ సులువుగా ఉంటుంది. పార్సెల్‌ ట్రే స్టోరేజ్‌ స్లాట్‌ అదనపు ప్లస్‌.

Hyundai Venue – 375 లీటర్లు

Venue బూట్‌ 375 లీటర్లు ఉండటం విశేషం. XUV 3XOతో పోలిస్తే ఇది దాదాపు 80 లీటర్లు ఎక్కువ. లోతైన ఫ్లోర్‌ వల్ల పొడవైన వస్తువులు పెట్టుకోవచ్చు. కానీ లోడింగ్‌ లిప్‌ కొంచెం ఎక్కువ.

Kia Sonet – 385 లీటర్లు

Sonet బూట్‌ వెడల్పైన ఓపెనింగ్‌తో వస్తుంది. 385 లీటర్ల స్పేస్‌తో వీకెండ్‌ ట్రిప్‌ లగేజ్‌ సులభంగా సరిపోతుంది.

Kia Syros – 390 లీటర్లు

ఈ సెగ్మెంట్‌లో అతి పెద్ద బూట్‌ Kia Syrosదే. 390 లీటర్ల బూట్‌తో పాటు స్లైడ్‌ అయ్యే రెండో వరుస సీట్లు ఉండటం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఫ్లోర్‌ తక్కువగా ఉండటం వల్ల పెద్ద బ్యాగులను నిటారుగా పెట్టుకోవచ్చు.

కాంపాక్ట్‌ SUV కొనుగోలు సమయంలో మైలేజ్‌, ఫీచర్లు మాత్రమే కాకుండా బూట్‌ స్పేస్‌ కూడా కీలక అంశం. ఈ పోలిక చూసుకుంటే, ఎక్కువ లగేజ్‌ అవసరం ఉన్నవారికి Kia Syros, Sonet లాంటి మోడల్స్‌ మంచి ఎంపికగా నిలుస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Advertisement

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget