అన్వేషించండి

కొత్త రంగులు, LED ఇండికేటర్లతో బజాజ్‌ పల్సర్‌ 220F అప్‌డేట్‌ - ధర ₹1.28 లక్షలు

Bajaj Pulsar 220F కొత్త రంగులు, రిఫ్రెష్‌ గ్రాఫిక్స్‌, LED ఇండికేటర్లతో అప్‌డేట్‌ అయ్యింది. 220cc ఇంజిన్‌తో యథాతథంగా కొనసాగుతున్న ఈ బైక్‌ ధర ₹1.28 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

Bajaj Pulsar 220F Update: బజాజ్‌ పల్సర్‌ 220F… ఈ పేరు వినగానే ఒక తరం బైక్‌ ప్రేమికులకు నోస్టాల్జియా గుర్తొస్తుంది. 2007లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్‌ అప్పటి నుంచి ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకుంది. కాలం మారినా, ట్రెండ్స్‌ మారినా, పల్సర్‌ 220F మాత్రం పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు, ఈ లెజెండరీ బైక్‌కు బజాజ్‌ చిన్నది, కానీ కీలకమైన అప్‌డేట్‌ను అందించింది.

భారత మార్కెట్‌లో అప్‌డేటెడ్‌ బజాజ్‌ పల్సర్‌ 220Fను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేసింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹1.28 లక్షలుగా నిర్ణయించారు. ఈ తాజా అప్‌డేట్‌లో ప్రధానంగా కొత్త రంగులు, రిఫ్రెష్‌ చేసిన గ్రాఫిక్స్‌, LED ఇండికేటర్లు అందించారు.

కొత్త రంగులు, ఫ్రెష్‌ గ్రాఫిక్స్‌

అప్‌డేటెడ్‌ పల్సర్‌ 220F (Updated Bajaj Pulsar 220F) ఇప్పుడు రెండు కొత్త కలర్‌ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఒకటి బ్లాక్‌ బేస్‌పై సాఫ్ట్‌ గోల్డ్‌ యాక్సెంట్స్‌, మరొకటి బ్లాక్‌ బేస్‌తో ఆరెంజ్‌ కలర్‌, గ్రీన్‌ హ్యూస్‌ కలయిక. ఈ కొత్త కలర్‌ స్కీమ్స్‌ బైక్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. ఇప్పటికే గుర్తింపు ఉన్న డిజైన్‌కు కొత్త గ్రాఫిక్స్‌ జోడించడం వల్ల ఈ బైక్‌ తాజా మోడల్‌లా కనిపిస్తోంది.

LED ఇండికేటర్లతో మోడర్న్‌ టచ్‌

ఈ అప్‌డేట్‌లో మరో ముఖ్యమైన మార్పు LED ఇండికేటర్లు. ఇప్పటివరకు హాలోజన్‌ ఇండికేటర్లతో వచ్చిన పల్సర్‌ 220F, ఇప్పుడు LED సెటప్‌కు మారింది. ఇది బైక్‌కు కాస్త ఆధునిక టచ్‌ను తీసుకువచ్చింది. రాత్రి వేళల్లో వీటి విజిబిలిటీ కూడా మెరుగ్గా ఉండనుంది.

టైర్లు, ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌

కొన్ని యూనిట్లలో యూరోగ్రిప్‌ ATT 1150 టైర్లు కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని బైక్‌లు ఇంకా MRF టైర్లతోనే డీలర్‌షిప్‌లకు వస్తున్నట్టు సమాచారం. అంటే, టైర్‌ ఫిట్‌మెంట్‌ స్టాక్‌ లభ్యతను బట్టి మారే అవకాశం ఉంది.

ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ విషయానికి వస్తే, ఫ్రెష్‌ పల్సర్‌ 220F, ఇప్పుడున్నట్లే బ్లూటూత్‌ కనెక్టివిటీ ఉన్న LCD డాష్‌ను కొనసాగిస్తుంది. ఇది ప్రస్తుతం అమ్మకంలో ఉన్న ఇతర పల్సర్‌ మోడల్స్‌ లాగే ఉంటుంది. అయితే, ఇందులో ఇంకా గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌ లేకపోవడం కొంతమందికి నిరాశ కలిగించవచ్చు.

ఇంజిన్‌లో ఎలాంటి మార్పులూ లేవు

మెకానికల్‌ అంశాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పల్సర్‌ 220Fలో ఉన్న అదే 220cc ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ కొనసాగుతోంది. ఇది 20.4 hp శక్తి, 18.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ జత చేశారు. పనితీరు, రైడింగ్‌ ఫీల్‌ విషయంలో ఎలాంటి మార్పులు లేవు.

ఇప్పటికీ అమ్మకాలలో టాప్‌ ప్లేస్‌లోనే

డిజైన్‌, టెక్నాలజీ పరంగా చాలా కొత్త బైక్‌లు వచ్చినప్పటికీ, పల్సర్‌ 220F ఇప్పటికీ బజాజ్‌ బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌ ద్వారా, ఈ బైక్‌ లైఫ్‌సైకిల్‌ మరికొంతకాలం పెరిగింది.

అప్‌డేటెడ్‌ పల్సర్‌ 220F ఇప్పుడు అధికారికంగా అమ్మకాల్లోకి వచ్చింది. ఆసక్తి ఉన్నవాళ్లు తమ సమీప బజాజ్‌ డీలర్‌షిప్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget