Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Citroen New Car: సిట్రోయెన్ బసాల్ట్ కారును పరిచయం చేసింది. ఇది త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Citroën Basalt SUV: సిట్రోయెన్ త్వరలో లాంచ్ చేయనున్న ఎస్‌యూవీ కూపే కాన్సెప్ట్ వెర్షన్‌ను బసాల్ట్ పేరుతో రివీల్ చేసింది. త్వరలో లాంచ్ కానున్న బసాల్ట్... సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ పైన ఉండనుంది. స్పోర్టీ ఎస్‌యూవీ కూపేగా ఉండనుంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు చాలా ఇంట్రస్టింగ్‌గా కూడా కనిపిస్తుంది.
డిజైన్, స్టైలింగ్ ఎలా ఉన్నాయి?
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా ఉన్నప్పటికీ బసాల్ట్ మరింత దృఢమైన ఆకారాన్ని కలిగి ఉంది. ఈ వెర్షన్‌కు కాన్సెప్ట్ మోడల్ అని ట్యాగ్ ఇచ్చారు. అంటే లాంచ్ అయ్యే మోడల్‌కు, దీనికి కాస్త తేడాలు ఉండవచ్చు. ప్రధాన డిజైన్ కాన్సెప్ట్ లాగానే ఉంటుంది. ఇక్కడ మీరు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు. ట్వీక్ అయిన గ్రిల్‌ను పొందుతారు. బ్లాక్ మిక్స్‌డ్ ఎల్లో పెయింట్ విభిన్న రూపాన్ని అందిస్తుంది.
సైడ్, రియర్ స్టైలింగ్‌తో పాటు కూపే తరహా డిజైన్ పొందడం చర్చనీయాంశంగా మారింది. సీ3 ఎయిర్‌క్రాస్‌పై పెద్ద టెయిల్‌ల్యాంప్‌లతో పాటు కొత్త ఎల్ఈడీ లైటింగ్ సిగ్నేచర్‌తో వెనుక స్టైలింగ్ సరికొత్తగా ఉంది. ఇది చాలా మందపాటి క్లాడింగ్ కలిగి ఉంది. లుక్ అయితే ప్రీమియం రేంజ్‌లో ఉంది. అయితే ఇందులో సీ3 ఎయిర్‌క్రాస్ లాగా పుల్ టైప్ డోర్ హ్యాండిల్‌ను చూడవచ్చు.
ఇంటీరియర్, ఇంజిన్ వివరాలు ఇలా...
సీ3 ఎయిర్‌క్రాస్‌తో పోలిస్తే సిట్రోయెన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇతర ఫీచర్లతో దీనిని సన్నద్ధం చేయగలదు. అయితే ఇంటీరియర్ కూడా 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సీ3 ఎయిర్‌క్రాస్‌లో కూడా అందుబాటులో ఉంది.
ఇందులో ఆటోమేటిక్, మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బసాల్ట్ ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన అత్యంత ప్రీమియం కారుగా ఉంది. అయితే ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విభాగంలో సిట్రోయెన్, టాటా మోటార్స్‌తో పాటు ఇతర ఎస్‌యూవీ కూపేలు కూడా త్వరలో భారత మార్కెట్లోకి రానున్నాయి.
సిట్రోయెన్ ఇండియా మనదేశంలో మూడో సీ-క్యూబ్ మోడల్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ కారు సీ3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా రూపొందిన కూపే ఎస్‌యూవీ మోడల్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సిట్రోయెన్ సీ3ఎక్స్ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఈ కారు 2024లోనే మనదేశంలో లాంచ్ కానుంది. 2024లో దీనికి సంబంధించిన పెట్రోల్ వేరియంట్, 2025లో సీఎన్‌జీ వేరియంట్ వచ్చే అవకాశం ఉంది. మరి కొద్ది కాలంలోనే ఈ కారుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ షేర్ చేస్తుందని స్టెల్లాంటిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య జయరాజ్ ఆటోకార్ ఇండియాతో గతంలో చెప్పారు.
సిట్రోయెన్ సీ3ఎక్స్ బాడీ స్టైల్ సెడాన్ లాగా ఉంటుంది. కూపే తరహాలో రూఫ్ లైన్, స్కోడా సూపర్బ్ తరహాలో కనిపించే నాచ్‌బ్యాక్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉ:ది. సిట్రోయెన్ దీని డిజైన్‌కు ఎస్‌యూవీ కూపే అని పేరు పెట్టింది.