అన్వేషించండి

EV వినియోగదారులకు గుడ్‌న్యూస్.. 12 నిమిషాల్లో Electric cars 100 శాతం ఛార్జింగ్ !

Electric Car Battery: చైనా కంపెనీ CATL కేవలం 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయగల కొత్త EV బ్యాటరీని రూపొందిస్తోంది. ఈ బ్యాటరీ 1.5 మిలియన్ మైళ్ల కెపాసిటీ కలిగి ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంపై ఫోకస్ చేస్తున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కాలుష్యం కారణంగానే పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను (Electric Car) కొనాలని వాటిపై రాయితీలు ఇస్తున్నారు. అయితే వీటిని ఛార్జింగ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కస్టమర్లకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ CATL పరిష్కారం గుర్తించినట్లు పేర్కొంది.

మీడియా నివేదికల ప్రకారం, CATL కొత్త టెక్నాలజీతో కూడిన EV బ్యాటరీని ఇంట్రడ్యూస్ చేసింది. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలతో పోలిస్తే ఈ బ్యాటరీ చాలా రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. దీనివల్ల ప్రజలు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మీ జర్నీ మరింత ఈజీ అవుతుంది.

కేవలం 12 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్
ఈ కొత్త బ్యాటరీ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని కేవలం 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఇది కనుక సాధ్యమని నిరూపిస్తే, ఎలక్ట్రిక్ కార్లు నడిపేవారికి ఇది పెద్ద ఊరటనిచ్చే వార్త అవుతుంది. ప్రస్తుతం చాలా వరకు EVలు ఛార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల ఈవీ వాహనదారులు సుదూర ప్రయాణాలు చేయడానికి కాస్త ఆలోచించినా వెనుకాడతారు. ఒకవేళ 12 నిమిషాల్లోనే వేగవంతమైన ఛార్జింగ్‌తో ఈవీ వాహనదారులకు సమస్య తొలగిపోతే, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కొత్త శకం మొదలైనట్లే. 

ఎక్కువ కాలం మన్నిక.. తక్కువ నష్టం
నివేదికల ప్రకారం, ఈ కొత్త బ్యాటరీ 1.5 మిలియన్ మైళ్ల వరకు ట్రబుల్ ఇవ్వకుండా పనిచేస్తుంది. అంతటి లాంగ్ జర్నీ చేసిన తర్వాత కూడా దీని సామర్థ్యం సుమారు 80 శాతం వరకు అలాగే ఉంటుంది. కంపెనీ ఇందులో స్మార్ట్ కూలింగ్, సెల్ఫ్ రిపేర్ వంటి టెక్నాలజీని ఉపయోగించింది. దీనివల్ల బ్యాటరీ త్వరగా చెడిపోయే అవకాశాలు తక్కువ. కనుక ఎక్కువ కాలం మెరుగైన పనితీరును అందిస్తుంది.

కార్లలోకి రావడానికి మరికొంత సమయం
ప్రస్తుతానికి, ఈ కొత్త చైనా బ్యాటరీ మార్కెట్లోకి వచ్చే కార్లలో ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఈ టెక్నాలజీ వాడకం ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే, ఎలక్ట్రిక్ కార్లను పదేపదే, ఎక్కువ గంటలపాటు ఛార్జింగ్ చేయాల్సిన సమస్యకు చెక్ పెడుతుంది. చైనాకు చెందిన CATL కంపెనీ  ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో కొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే
కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే
గుడ్‌న్యూస్‌ బాసూ! టాటా EVలపై భారీ ఆఫర్లు.. కర్వ్‌ కొంటే ఏకంగా రూ.3.35 లక్షల బెనిఫిట్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget