మొదటి రాయల్ ఎన్‌పీల్డ్ క్లాసిక్ 350 ఎప్పుడు ప్రారంభించారు

Published by: Shankar Dukanam

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు భారత మార్కెట్లో ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ని తొలిసారిగా నవంబర్ 2009 లో భారత మార్కెట్లో లాంచ్ చేశారు.

2009లో క్లాసిక్ 350 మోడల్ లాంచ్ అయ్యాక మన దేశంలో ఈ బుల్లెట్ బైక్ మరో రేంజ్‌కు వెళ్లింది

మే 2020లో ఈ బైకును BS6 ఉద్గార నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేశారు. దాంతో కస్టమర్ల నమ్మకం మరింత పెరిగింది

సెకండ్ జనరేషన్ క్లాసిక్ 350 రీబార్న్ ను 1 సెప్టెంబర్ 2021న లాంచ్ చేశారు.

కొత్త మోడల్ మోడ్రన్ జే-ప్లాట్‌ఫాం ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది పాత ఇంజిన్‌తో పోలిస్తే చాలా స్మూత్‌గా వెళ్తుంది

కొత్త మోడల్‌లో LED హెడ్‌లైట్స్, గేర్ ఇండికేటర్, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మైలేజ్ ఎలాంటి ట్రాఫిక్ లేని రూట్లలో గరిష్టంగా లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది