Car Maintaince Tips: మీ కారు లైఫ్ ఎక్కువ రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - ఇంజిన్, టైర్లు ముఖ్యం బిగిలూ!
కారు ఎక్కువ లైఫ్ రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంజిన్, టైర్లను జాగ్రత్తగా మెయింటెయిన్ చేయాలి.
Car Tips: మనలో చాలా మంది కారును సొంతం చేసుకోవాలని కలలు కంటారు. కొంతమంది చాలా సంవత్సరాలు కష్టపడి డబ్బు ఆదా చేసి కొత్త కారుని కొనుగోలు చేస్తారు. కారును కొన్నాక దాన్ని మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. కారు ఎప్పుడూ కండీషన్‌లో ఉండాలంటే దాన్ని మెయింటెయిన్ చేయడానికి కొన్ని టిప్స్ పాటించాలి.
యూజర్ మాన్యువల్‌ను ఫాలో అవ్వాల్సిందే...
మీ వాహనాన్ని మెయింటెయన్ చేయడానికి మొదటిగా మీరు ఎల్లప్పుడూ మీ వాహనంతో పాటు వచ్చే యూజర్ మాన్యువల్‌ని ఫాలో అవ్వాలి. ఇందులో మీరు వాహనం ప్రతి భాగం గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందుతారు. ఇందులో సెక్యూరిటీ ఫీచర్లు, రిమోట్ కంట్రోల్, కీ, ఫ్యూయల్, ఇంజిన్ ఆయిల్, టైర్లు, డ్రైవింగ్‌తో సహా ముఖ్యమైన సమాచారం అంతా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర యూజర్ మాన్యువల్ లేకపోతే, మీరు దానిని కారు కంపెనీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టైర్ ప్రెజర్ జాగ్రత్త
వాహనం అత్యంత ముఖ్యమైన భాగాలలో కారు టైర్ ఒకటి. అందువల్ల దాని ఒత్తిడిని మెయిన్‌టెయిన్ చేయడం చాలా ముఖ్యం. టైర్ ప్రెజర్ సరిగ్గా లేకుంటే అది త్వరగా పాడైపోవచ్చు. ప్రయాణంలో ఎప్పుడైనా పగిలిపోవచ్చు. టైర్లలో ఎప్పుడూ నైట్రోజన్ మాత్రమే నింపడానికి ప్రయత్నించండి. టైర్ ప్రెజర్ కూడా మైలేజీని ప్రభావితం చేస్తుంది.
ఆయిల్, ఆయిల్ ఫిల్టర్
ఒక కారు అనేక చిన్న, పెద్ద భాగాలతో రూపొందించబడింది. కారు ఇంజిన్ చాలా ముఖ్యమైన భాగం. ఇది వాహనాన్ని నడపడానికి శక్తిని అందిస్తుంది. అందువల్ల దాన్ని మెయిన్‌టెయిన్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇది ఇంజిన్ జీవితాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
ఇంజిన్‌ను శుభ్రంగా ఉంచండి
మీరు ఇంజిన్‌ను కారు గుండె అని పిలవవచ్చు. దానిని కూడా జాగ్రత్తగా మెయిన్‌టెయిన్ చేయాలి. లోపలి నుంచి శుభ్రంగా ఉంచడానికి, మీరు ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల బ్రాండెడ్ ఇంజిన్ ఆయిల్‌ని ఉపయోగించాలి. దాన్ని ఎప్పటికప్పుడు బాహ్యంగా కూడా శుభ్రం చేయాలి. ఇంజిన్‌పై ఉన్న దుమ్ము, చెత్తను ఇతర ధూళితో పాటు శుభ్రం చేయడానికి ఇంజిన్ క్లీనర్‌ను ఉపయోగించాలి.
ఇంటీరియర్ శుభ్రంగా ఉంచండి
వాహనం వెలుపలి భాగంతో పాటు, దాని లోపలి భాగాన్ని కూడా శుభ్రం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీన్ని శుభ్రం చేయడానికి మీరు చిన్న కారు వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. ఎయిర్ వెంట్, గేర్ స్టిక్ బేస్, స్టీరింగ్ వీల్ కింద శుభ్రం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మరోవైపు మహీంద్రా దాని స్కార్పియో, బొలెరో, థార్‌తో సహా ఇప్పటికే ఉన్న అనేక కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తుంది. దీంతో పాటు ఎక్స్‌యూవీ.e (ఎక్స్‌యూవీ.e8, ఎక్స్‌యూవీ.e9), BE (BE.05, BE.07, BE.09) అనే రెండు వేర్వేరు బ్రాండ్‌ల క్రింద కంపెనీ అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను కూడా పరిచయం చేస్తుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!