By: ABP Desam | Updated at : 01 Jun 2022 09:52 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కొత్త మహీంద్రా స్కార్పియో ఇంటీరియర్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
మహీంద్రా తన కొత్త స్కార్పియో ఎన్‌ను కొద్దిరోజుల్లో మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. జూన్ 27వ తేదీన ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. దీని ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది. దీన్ని బట్టి రానున్న స్కార్పియోలో మనం ఏం ఆశించవచ్చో తెలుస్తుంది.
ఈ కొత్త స్కార్పియోలో ప్రీమియం క్యాబిన్‌ను అందించారు. ప్రస్తుతం ఉన్న స్కార్పియో క్యాబిన్ కంటే ఇది మరింత అద్భుతంగా ఉండనుంది. దీని డిజైన్‌ను ఎక్స్‌యూవీ700 ఆధారంగా రూపొందించారు. కొత్త తరహా స్టీరింగ్ వీల్, దాని మీద కొత్త మహీంద్రా లోగోను కూడా చూడవచ్చు.
దీంతోపాటు పెద్ద టచ్‌స్క్రీన్‌ను కూడా అందించనున్నారు. దీని ఇంటీరియర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఎక్స్‌యూవీ700లో ఉపయోగించిన టెక్నాలజీనే ఇందులో కూడా అందించారు. పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం ఫీచర్లు ఈ కొత్త స్కార్పియోలో ఉన్నాయి. స్పేస్‌పై కూడా మహీంద్రా ఈసారి దృష్టి పెట్టింది.
ప్రస్తుత తరం మోడల్ కంటే ఎక్కువ స్పేస్ ఇందులో ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌యూవీ700 కంటే కొంచెం తక్కువ పవర్ అవుట్‌పుట్‌ను ఇవి అందిస్తాయని తెలుస్తోంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండనున్నాయి. 4x4 సామర్థ్యంతో లగ్జరియస్ టెక్నాలజీ కూడా ఉన్న అతి కొద్ది కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఈ కొత్త స్కార్పియో కూడా నిలవనుంది.
ఈ కారును కొత్త ప్లాట్‌ఫాంపై రూపొందించారు. దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ చాలా కొత్తగా ఉన్నాయి. దీని లుక్ కూడా చాలా మోడర్న్‌గా ఉండనుంది. కొత్త హెడ్‌లైన్స్, కొత్త గ్రిల్, క్రోమ్ అవుట్ లైన్ ఇందులో ఉన్నాయి. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న స్కార్పియో తరహాలోనే దీంట్లో కూడా ఆఫ్ రోడ్ టఫ్ నెస్ కనిపించింది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్యూవీ - కీలకమైన మైలురాయి!
Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?
Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!
Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!
Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?