CNG cars in India:8 లక్షల లోపు బెస్ట్ CNG కార్లు, అదిరిపోయే మైలేజ్! పెరిగిన పెట్రోల్ ధరలతో నో టెన్షన్!
CNG cars in India: CNG కార్లు పెట్రోల్ డీజిల్ కంటే ఎక్కువ ధర కలిగి ఉండవచ్చు, కానీ మైలేజ్ విషయంలో చాలా మంచివి. అలాంటి అద్భుతమైన కార్ల గురించి ఇక్కడ చూద్దాం.

CNG cars in India: భారతదేశ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్నందున, ప్రజలు CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. CNG కార్ల ధరలు పెట్రోల్-డీజిల్ కార్లతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ ఈ కార్లు మైలేజ్‌పరంగా చాలా మెరుగ్గా ఉంటాయి. భారత్‌లో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మంచి మైలేజ్ ఇచ్చే అద్భుతమైన ఫీచర్స్‌ఉన్న కార్ల గురించి సమాచారం మీకు అందిస్తున్నాం. మీరు కారు కొనే ఆలోచన ఉంటే మాత్రం వీటిపై ఓ లుక్ వేయండి. ఇక్కడ ఇచ్చే కార్లు అన్ని కూడా పది లక్షల రూపాయల లోపు లభించేవే.
మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10)
తక్కువ ధరకు మంచి మైలేజ్‌తో లభించే కార్ల జాబితాలో మొదట ఉండే కారు మారుతి సుజుకి ఆల్టో K10. ఇది భారతదేశంలో ప్రసిద్ధ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. దీని CNG వేరియంట్ ధర రూ. 6.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆల్టో K10 CNG 33.85 km/kg వరకు మైలేజ్ ఇస్తుంది. దీని వేరియంట్ Maruti Alto K10 LXi (O) S-CNG.
మారుతి సుజుకి ఆల్టో K10 కారు హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ 6.49 లక్షల నుంచి 9.64 లక్షల మధ్య లభిస్తుంది. దీన్ని ఈఎంఐ ద్వారా కూడా తీసుకోవచ్చు.
మారుతి వ్యాగన్ ఆర్ సిఎన్‌జి (Maruti Wagon R CNG)
మంచి మైలేజ్‌తో లభించే సీఎన్జీ కార్ల జాబితాలో రెండో స్థానం మారుతి వ్యాగన్ ఆర్ సిఎన్‌జిదే. ఈ కారులో 1-లీటర్ ఇంజిన్ ఉంది, ఇది 57bhp గరిష్ట శక్తిని, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. ఇది కిలోగ్రాముకు 32.52 కిమీ నుంచి 34.05 కిమీ/కిలోగ్రాము వరకు మైలేజ్ ఇస్తుంది. Wagon R CNG రెండు వేరియంట్‌లు LXI (రూ. 6.55 లక్షలు) VXI (రూ. 7 లక్షలు)గా లభిస్తుంది.
మారుతి వ్యాగన్ ఆర్ సిఎన్‌జి కారు హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ 5.79 లక్షల నుంచి 7.62 లక్షల మధ్య ఉంది.
మారుతి సెలెరియో CNG (Maruti Celerio CNG)
మూడవ స్థానంలో మారుతి సెలెరియో(Maruti Suzuki Celerio CNG) ఉంది. ఇది CNG కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు, ఇది 34.43 km/kg మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.89 లక్షలు. నడపడానికి అయ్యే ఖర్చు మోటార్‌సైకిల్ నడపడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ, కాబట్టి ఇంధన ఖర్చులను తగ్గించాలనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.
హైదరాబాద్‌లో మారుతి సెలెరియో సీఎన్‌జీ ఆన్‌రోడ్ ధర 5.64 లక్షల నుంచి 7.37 లక్షల రూపాయలకు వస్తోంది.
ఈ మూడు CNG కార్లు అద్భుతమైన మైలేజ్‌తో పాటు సరసమైన ధరలకు కూడా లభిస్తాయి. మీరు కొత్త CNG కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వీటిలో ఏదైనా మీ బడ్జెట్‌కు సరిపోతుంది. CNG కార్లు మీ ప్రయాణాన్ని చౌకగా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా మంచివి.





















