Ceat Tyres Latest Updates: సియట్ నుంచి ఎన్విరాన్ మెంటల్ ఫ్రెండ్లీ టైర్లు.. రెండు వేరియంట్ల లాంఛ్.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా..?
ప్రముఖ టైర్ల కంపెనీ సియట్ సరికొత్త టైర్ ను పరిచయం చేసింది. పర్యావరణ అనకూలంగా కొత్త టైర్ ను ఆవిష్కరించి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టైరును రూపొందించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి.

Ceat Tyres 2 Latest Variants: నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యానికి కాస్త చెక్ పెట్టే లక్ష్యంతో సియట్ కంపెనీ కొత్త టైర్ల వేరియంట్ ను ఉత్పత్తి చేసింది. టైర్ల వేస్టేజీ ద్వారా కాలుష్యం ప్రబలకుండా పర్యావరణ హిత టైర్లను రూపొందించింది. CEAT భారతదేశంలో మొట్టమొదటి రోడ్డుపై ఉపయోగించదగిన ప్యాసింజర్ కారు టైరు SecuraDrive CIRCLను తాజాగా ఆవిష్కరించింది, ఇది 90 శాతం వరకు బయో పదార్థాలతో తయారైనదిగా కంపెనీ పేర్కొంది. దీన్ని సస్టెయినబుల్ మొబిలిటీలో ఓ పెద్ద మైలురాయిగా అభివర్ణించింది. CEAT గుజరాత్‌లోని హలోల్ లో గల గ్లోబల్ R&D ఆధ్వర్యంలో ఈ టైరు అభివృద్ధి చేయబడింది. ఈ టైరు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది . 50 శాతం బయో ఆధారిత పదార్థాలతో ఒకటి, మరొకటి 90 శాతం తో ఉపలబ్ధం అవుతుంది. వీటి ధరలు వరుసగా రూ.8,999 మరియు రూ.12,999 గా నిర్ణయించబడ్డాయి. ఈ టైర్లు 2025 సెప్టెంబర్ నుండి CEAT ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ , అధికారిక డీలర్‌షిప్‌లలో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి.
🚗🌱 CEAT launches SecuraDrive CIRCL – India’s 1st road-ready passenger car tyre with up to 90% sustainable materials.
— RushLane (@rushlane) August 25, 2025
- Two variants: 50% & 90% bio-based content
- Developed at CEAT’s Halol R&D hub
- Eco-smart mobility with safety & performance intact#CEAT #Tyres pic.twitter.com/i3NWTAQnsj
అన్ని చోట్లా..
సంప్రదాయిక ఆధునిక ఫీచర్లను మిళితం చేసిన ఈ టైర్లు పెద్ద నగరాలతోపాటు చిన్న పట్టణ వినియోగదారుల లక్ష్యంగా రూపొందించబడ్డాయి. సెక్యూరాడ్రైవ్ సర్కిల్ టైరు పర్యావరణ హితంతోపాటు, భద్రత , ప్రీమియం పనితీరు లక్షణాలతో తయారైంది. CEAT ఈ టైర్‌ను రోడ్ టెస్టింగ్ అనంతరం ప్రపంచంలోని అత్యంత సుస్థిర ప్యాసింజర్ కార్ టైర్‌గా పేర్కొంటోంది. లాంచ్ సందర్భంగా CEAT ఎండి మరియు సీఈఓ అర్ణబ్ బెనర్జీ మాట్లాడుతూ, SecuraDrive CIRCL అనేది ఒక మైలురాయి, ఇది పాసింజర్ వెహికిల్ విభాగంలో దేశ కొత్త ప్రమాణాలను నెలకొల్పగలదని పేర్కొన్నారు. 90 శాతం బయో పదార్థాలతో పూర్తి స్థాయిలో ఉపయోగించదగిన టైరు తయారీ ద్వారా CEAT పనితీరు , పర్యావరణ అనుకూలతలను తిరిగి నిర్వచిస్తోంది. ఈ లాంచ్ తో గ్రీనర్ మొబిలిటీ దిశలో CEAT ను టార్చ్ బేరర్ గా నిలుస్తోందని అన్నారు.
మూడు పేటేంట్లు..
ఈ టైరులో మూడు గ్లోబల్-ఫస్ట్ పేటెంటెడ్ ఆవిష్కరణలు ఉన్నాయి. యూనిఫైడ్ బయోపాలిమర్ ఇన్నర్ లైనర్.. ఇది తయారీ సమయంలో కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. గ్లిసరాల్ ఆధారిత యాక్సిలరేటర్, ఇది పెట్రోలియం ఆధారిత రసాయనాలకు బదులుగా ఉపయోగించబడుతుంది. యాంటీ-స్టాటిక్ సిలికా కండక్టివ్ సొల్యూషన్, ఇది సంప్రదాయ కార్బన్ బ్లాక్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఈ ఆవిష్కరణతో రోడ్ సేఫ్టీ , టైర్ల పనితీరు మెరుగైనదిగా ఉంచుతూ, పాసింజర్ వెహికిల్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని కంపెనీ ఆశిస్తోంది. ఈ లాంచ్ CEAT ఇటీవల ప్రవేశపెట్టిన ఇతర ఆవిష్కరణలపై ఆధారపడి ఉంది, వాటిలో CALM టెక్నాలజీ, ZR రేటెడ్ టైర్లు మరియు రన్-ఫ్లాట్ టైర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సియట్ బ్రాండ్ అంబాసిడర్, భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు.





















