అన్వేషించండి

Maruti Baleno కొనే ప్లాన్‌లో ఉన్నారా? రూ.లక్ష డౌన్ పేమెంట్‌తో EMI ఎంతవుతుందో లెక్క కట్టారా?

Maruti Baleno EMI 2025: మీరు సరిగ్గా ప్లాన్‌ చేస్తే, మీకు పెద్దగా ఆర్థిక భారం లేకుండా, ఈ దసరా పండుగకు మారుతి సుజుకి బాలెనో కారు తీసుకువచ్చి మీ ఇంటి ముందు పార్క్‌ చేయవచ్చు.

Maruti Baleno Price, Down Payment, Car Loan EMI Details: మారుతి సుజుకి బ్రాండ్‌లో తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న కార్లలో ఒకటి మారుతి బాలెనో. ముఖ్యంగా, ఈ కారులో సంతృప్తికరమైన స్పేస్‌ & మంచి ఫీచర్ల కారణంగా కామన్‌ మ్యాన్‌కు ఇష్టమైన కారుగా మారింది. ఫ్రంట్ డిజైన్‌లో కొత్త గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, బోల్డ్‌ బంపర్‌ వలన మారుతి బాలెనో ఇంకా స్టైలిష్‌గా మారింది. వెనుక వైపు స్ప్లిట్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, కొత్త బంపర్‌ వలన కారుకు ఫ్యూచరిస్టిక్‌ టచ్‌ వచ్చింది. అల్లాయ్ వీల్స్‌ స్పోర్టీ లుక్‌ ఇస్తుండా, డిజైన్‌ యూత్‌ఫుల్‌ ఫీలింగ్‌ ఇస్తుంది. ఇంటీరియర్‌లో మోడ్రన్‌ డాష్‌బోర్డ్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌, స్మార్ట్‌ లేఅవుట్‌ వల్ల ఇది ఒక ప్రీమియం కారు అనిపిస్తోంది.

మారుతి బాలెనో, మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - సిగ్మా, డెల్టా, డెల్టా CNG, డెల్టా AMT, జీటా, జీటా CNG, జీటా AMT & ఆల్ఫా.

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్ర, తెలంగాణలో మారుతి సుజుకి బాలెనో రేటు రూ. 6.74 లక్షల నుంచి రూ. 9.97 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. హైదరాబాద్‌లో, దాని బేస్ మోడల్ Sigma MT ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.13 లక్షలు. దీనిలో, దాదాపు రూ. లక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజ్‌, దాదాపు రూ. 39,000 వేలు ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలో ఈ కారు బేస్‌ మోడల్‌ ధర దాదాపు రూ. 8.12 లక్షలు.

తెలుగు రాష్ట్రాల్లో మీరు మారుతి సుజుకి బాలెనో ను కార్‌ లోన్‌ పై తీసుకోవచ్చు. అయితే, రూ. లక్ష డౌన్ పేమెంట్ దిల్లీలో సరిపోతుంది గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో వర్కవుట్‌ కాదు, కనీసం రూ. లక్ష 40 వేలు కట్టాలి. మిగిలిన మొత్తానికి కార్‌ లోన్ తీసుకోవాలి. 

EMI లెక్కింపు
ఉదాహరణకు, విజయవాడలో మారుతి బాలెనోను కొనాలంటే, రూ. 1.40 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత, రూ. 6.72 లక్షల కార్‌ లోన్‌ తీసుకోవాలి. బ్యాంక్‌, ఈ మొత్తంపై 9% వార్షిక వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుందాం. EMI ఆప్షన్స్‌ చూద్దాం. 

7 సంవత్సరాల లోన్ వ్యవధి పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 10,811 EMI చెల్లించాలి.

6 సంవత్సరాల్లో లోన్ క్లియర్‌ చేయాలంటే, మీరు ప్రతి నెలా రూ. 12,113 EMI చెల్లించాలి.

5 సంవత్సరాల్లో అప్పు నుంచి బయటపడాలంటే, మీరు ప్రతి నెలా రూ. 13,949 EMI చెల్లించాలి.

4 సంవత్సరాల రుణ వ్యవధి ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 16,722 EMI చెల్లించాలి.

బ్యాంక్‌ మీకు కార్‌ లోన్‌ ఇవ్వడం, వడ్డీ రేటును నిర్ణయించడం వంటివి మీ క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి.

ప్రీమియం ఫీచర్లు
మారుతి బాలెనో, లోన్‌ EMI లో మాత్రమే కాదు, మైలేజ్‌లోనూ పొదుపుగా ఉంటుంది. దీని డెల్టా (పెట్రోల్ + CNG) మోడల్‌లో, మీరు రెండు ట్యాంక్‌లను పూర్తిగా నింపితే సులభంగా 1000 కి.మీ. కంటే ఎక్కువ దూరం (కంపెనీ లెక్క ప్రకారం) ప్రయాణించవచ్చు. కారు క్యాబిన్‌లో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. ఆర్కామిస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & రియర్‌ AC వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా బడ్జెట్‌లో అందించారు.

ప్రయాణీకుల భద్రత కోసం, బాలెనోలో 6 ఎయిర్‌బ్యాగులు అమర్చారు. డ్రైవర్ సీటు ఎత్తును తగినట్లుగా సర్దుబాటు కూడా చేసుకోవచ్చు, ఇది కూడా ఒక ప్రీమియం ఫీచర్‌. అయితే, ఈ అధునాతన లక్షణాలన్నీ ఎక్కువగా టాప్ లేదా హై వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 

మీ బడ్జెట్‌లో మైలేజ్-ఫ్రెండ్లీ & ఫీచర్-లోడెడ్ కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సుజుకి బాలెనో మీకు సరైన ఎంపిక. తక్కువ డౌన్‌ పేమెంట్‌ చేసి, సరైన రుణ వ్యవధిని ఎంచుకోండి, కొత్త బాలెనోలో ఫ్యామిలీతో కలిసి షికారు చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget