అన్వేషించండి

Car Buying Guide: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. ఇవి పాటించపోతే నష్టమే

Buying second hand car | సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? డాక్యుమెంట్స్ చేసుకోవడంతో పాటు, బెస్ట్ డీల్ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంది.

ఈ రోజుల్లో కొత్త కారు కొనడం అందరికీ వీలుకాదు. ఖర్చుల భారంతో ఇబ్బందిపడుతున్న వారికి కొత్త కారు డ్రీమ్ సులభం కాదు. ముఖ్యంగా కార్ల ధరలు పెరుగుతున్నప్పుడు, బడ్జెట్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవడం మంచిది. ఎక్కువ ఖర్చులు చేసి ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడకుండా ఒక మంచి ప్రత్యామ్నాయం ఇది. 2025లో GST 2.0 తర్వాత కొత్త కార్ల ధరలలో కొంత ఉపశమనం లభించింది. కానీ చాలా మంది తక్కువ ఖర్చుతో మంచి పాత కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారు. సరైన సమాచారం, కొంచెం అవగాహనతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు చాలా నగదు ఆదా చేయవచ్చు.

సెకండ్ హ్యాండ్ కారు ఎక్కడ కొనాలి?

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మంచి కండిషన్‌లో ఉన్న పాత కార్లు లభిస్తాయి. Cars24 వంటి వెబ్‌సైట్‌లో అనేక కార్లపై రూ. 1.8 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ ఫైనాన్స్, వారంటీ వంటి ప్రయోజనాలు కస్టమర్లకు లభిస్తాయి. మరోవైపు Spinny తక్కువ వడ్డీ రేటు, తక్కువ EMI లతో సెకండ్ హ్యాండ్ కారు లోన్ సౌకర్యాన్ని అందిస్తుంది. వీటితో పాటు మారుతి సుజుకీ ట్రూ వాల్యూ (Maruti Suzuki True Value), మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ (Mahindra First Choice) వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా నమ్మకమైనవిగా భావిస్తారు. అయితే ఇక్కడ తనిఖీ చేసిన కార్లు లభిస్తాయి.

కారు కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడానికి ముందు మీ బడ్జెట్‌ ఎంత అని ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత కారు రిలీజ్ ఏడాది, సర్వీస్ హిస్టరీని తప్పకుండా తెలుసుకోవాలి. తరా వాహనం సరిగ్గా మెయింటైన్ చేశారా లేదా అని తెలుసుకోవచ్చు. ఓడోమీటర్ రీడింగ్, ఓనర్‌షిప్ వివరాలను కూడా చెక్ చేయడం మంచిది. కారు ఎక్కువ పాతది కాకుండా, ఎక్కువగా నడిపిన కారు అవకుండా చూసుకోండి. టెస్ట్ డ్రైవ్ తప్పకుండా చేయాలి. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ శబ్దం, బ్రేకులు, క్లచ్ తీరు, సస్పెన్షన్‌పై ఫోకస్ చేయాలి. 

పేపర్‌ వర్క్‌లో నిర్లక్ష్యం చేయవద్దు

పాత కారు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. RC ట్రాన్స్‌ఫర్, ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్, నో డ్యూస్ సర్టిఫికేట్‌ను సరిగ్గా చూసుకుని పూర్తి చేయాలి. కారు గతంలో ఫైనాన్స్‌పై ఉంటే, బ్యాంక్ నుండి NOC తీసుకోవడం మర్చిపోకూడదు. సరైన పేపర్‌వర్క్ చేసుకుంటే భవిష్యత్తులో ఏదైనా చట్టపరమైన సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకుంటే, పూర్తి తనిఖీ చేస్తే, పేపర్‌వర్క్‌లో జాగ్రత్త వహిస్తే, సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. దీని ద్వారా మీరు కొత్త కారుతో పోలిస్తే చాలా డబ్బు ఆదా చేయడంతో పాటు అధిక ఈఎంఐ టెన్షన్లు ఉండవు. 

Also Read: Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget