అన్వేషించండి

యూజ్డ్ Maruti Baleno కొనే ముందే ఇంజిన్ నుంచి టచ్‌స్క్రీన్ వరకు ఇలా చెక్‌ చేయండి!

యూజ్డ్ Maruti Baleno కొనాలనుకుంటున్నారా? ఇంజిన్, మైలేజ్, ఫీచర్లు, AMT సమస్యలు, ధరలు ఇలా అన్ని కీలక విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Second Hand Maruti Baleno Buying Guide: భారత మార్కెట్‌లో Maruti Suzuki Balenoకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ లుక్, విశాలమైన కేబిన్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ – ఈ కారణాల వల్ల బాలెనో కొత్త యూనిట్‌కు మాత్రమే కాకుండా యూజ్డ్ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, కుటుంబ అవసరాలకు సరిపడే కారు కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

ప్రస్తుతం సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో ₹7.30 లక్షల దాకా వెచ్చిస్తే, 20,000 కిలోమీటర్ల లోపే నడిచిన టాప్ వేరియంట్ Baleno మాన్యువల్ దొరికే అవకాశముంది. కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక విషయాలు తప్పకుండా గమనించాలి.

Maruti Suzuki Baleno ఇంజిన్‌

Balenoలో 1.2 లీటర్, 4 సిలిండర్, నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90hp శక్తి, 113Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. 

Maruti CNG వేరియంట్ కూడా వచ్చింది. ఇందులో అదే ఇంజిన్ ఉన్నా, శక్తి 77hp, 98.5Nmకి తగ్గుతుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

Baleno మైలేజ్

పెట్రోల్ మాన్యువల్ – 22.35 కిలోమీటర్లు లీటర్‌కు (ARAI)

పెట్రోల్ AMT – 22.94 కిలోమీటర్లు లీటర్‌కు

CNG – 30.61 కిలోమీటర్లు కిలోకు

ఎక్కువ డ్రైవింగ్ చేసే వారు, రన్నింగ్ ఖర్చులు తగ్గించాలని అనుకునేవారికి CNG సరిపోతుంది. అయితే బూట్ స్పేస్ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. సాధారణ వాడకానికి పెట్రోల్ వేరియంట్‌ మరింత ప్రాక్టికల్‌గా ఉంటుంది. నగరంలో డ్రైవింగ్ ఎక్కువైతే AMT ఆటోమేటిక్ మంచి కంఫర్ట్ ఇస్తుంది.

Baleno వేరియంట్లు, ఫీచర్లు

Baleno Sigma, Delta, Zeta, Alpha అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ స్పెక్ Alpha వేరియంట్‌లో...

  • 9 ఇంచ్ టచ్‌స్క్రీన్
  • Android Auto, Apple CarPlay
  • హెడ్-అప్ డిస్‌ప్లే
  • 360 డిగ్రీ కెమెరా
  • ఆటో క్లైమేట్ కంట్రోల్
  • Arkamys సౌండ్ సిస్టమ్
  • ఆటో LED హెడ్‌ల్యాంప్స్‌
  • 16 ఇంచ్ అలాయ్ వీల్స్
  • 6 ఎయిర్‌బ్యాగ్స్

వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ పరిమితంగా ఉంటే Zeta వేరియంట్ కూడా అవసరమైన ఫీచర్లతో సరిపోతుంది.

ఉపయోగించిన బాలెనో కొనుగోలు చేయాలంటే, ముందుగా ఇవి తప్పక చెక్ చేయండి

AMT గేర్‌బాక్స్ హెల్త్‌
AMT సాధారణంగా నమ్మకంగానే ఉంటుంది. అయితే, టెస్ట్ డ్రైవ్ సమయంలో గేర్ మార్పులు స్మూత్‌గా ఉన్నాయా, కారు సరిగా కదులుతోందా అనే విషయాలు గమనించాలి.

టచ్‌స్క్రీన్ సమస్యలు
కొంతమంది యూజర్లకు టచ్‌స్క్రీన్ ల్యాగ్, ఫ్రీజ్ అవడం, కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయి. కాబట్టి స్క్రీన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి.

ఎయిర్‌బ్యాగ్ రీకాల్
2022 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య తయారైన కొన్ని Baleno కార్లను ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ సమస్య కారణంగా రీకాల్ చేశారు. ఆ రిపేర్ పూర్తయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ Baleno ధరలు

ప్రస్తుతం యూజ్డ్ మార్కెట్‌లో హయ్యర్‌ వేరియంట్ల ధరలు ₹5.5 లక్షల నుంచి ₹7.5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. ₹7.5 లక్షలకు మించి ఖర్చు చేయకపోవడమే మంచిది. అంతకంటే ఎక్కువ అయితే కొత్త కారు తీసుకోవడం బెటర్.

ముగింపు

తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, విశాలమైన కేబిన్ కావాలంటే యూజ్డ్ Maruti Baleno ఒక సేఫ్ ఛాయిస్. సరైన కారు ఎంపిక చేసుకుంటే, ఇది సంవత్సరాల పాటు నమ్మకంగా సేవ చేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget