ప్రొఫెషనల్ కంఫర్ట్‌తో Alpinestars Supertech Goggles - ఆఫ్‌రోడ్ రైడర్లకు టాప్ క్లాస్ సెలెక్షన్!
Alpinestars Supertech Vision Vista గాగుల్స్ ఆఫ్‌రోడ్ రైడింగ్‌లో ఎలా పని చేస్తాయి?. కంఫర్ట్, ఫాగ్ ఫ్రీ పనితీరు, లెన్స్ టెక్నాలజీ, రోల్ ఆఫ్ సిస్టమ్, ప్రైస్ వంటి వివరాలన్నీ ఈ రివ్యూ లో చదవండి.

Alpinestars Supertech Goggles Review: ఆఫ్‌రోడ్ రైడింగ్‌లో హెల్మెట్ మాత్రమే కాదు, మంచి క్వాలిటీ గాగుల్స్ కూడా ఎంత ముఖ్యమో రైడర్లు బాగా తెలుసు. దుమ్ము, మట్టి, గాలి, చెమట - ఇవన్నీ రైడింగ్‌లో అంతరాయం కలిగించే అంశాలు. అలాంటి పరిస్థితుల్లో కళ్ళను కాపాడటమే కాకుండా స్పష్టమైన విజిబిలిటీ ఇచ్చే టాప్-స్పెక్ గాగుల్స్ అవసరం. అలాంటి వాటి కోసం చూస్తే Alpinestars Supertech Vision Vista మంచి ఆప్షన్‌గా నిలుస్తాయి.
Alpinestars, MX హెల్మెట్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత, తమ సొంత గాగుల్స్ లైనప్‌ను కూడా తీసుకొచ్చింది. అందులోనే హైయ్యెస్ట్ రేంజ్‌లో ఉన్న మోడల్ ఈ Supertech Vision Vista. ప్రముఖ MX రైడర్లతో కలిసి డెవలప్ చేసిన ఈ గాగుల్స్, ప్రొఫెషనల్స్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. కానీ క్యాజువల్ ఆఫ్‌రోడ్ రైడర్లకు కూడా ఇవి ఇచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి.
చక్కగా సరిపోయే డిజైన్
మొదటగా ఆకట్టుకునే విషయం, గాగుల్స్ ఫిట్టింగ్. డబుల్-లేయర్ కాంటూర్డ్ ఫోమ్, రైడర్ ముఖాన్ని చక్కగా హత్తుకుని కంఫర్ట్ ఇస్తుంది. గాగుల్స్ ఫ్రేమ్‌పై ఉన్న ఇంటిగ్రేటెడ్ అవుట్‍రిగర్ డిజైన్, రైడర్ హెల్మెట్‌పై గాగుల్ సరిగ్గా సెట్ అయ్యేలా చేస్తుంది. రైడింగ్‌లో ఇవి బాగా సూట్ అవుతాయి. ముఖ్యంగా, ఫాగ్ ఉండకపోవడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. చెమట కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ అవుతుంది.
చెమట నిలబడదు
అదీగాక, Alpinestars, గాగుల్స్ ఫోమ్ లోపల ప్రత్యేకమైన మాయిశ్చర్ చానల్‌ను డిజైన్ చేసింది. ఇది, ముఖానికి పట్టిన చెమటను మధ్య భాగం నుంచి పైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి పక్కలకు దించేస్తుంది. చెమట లెన్స్‌పై ఆగిపోకుండా చూస్తుంది. ఇది లాంగ్ ఆఫ్‌రోడ్ రన్స్‌లో మంచి ప్రయోజనం ఇస్తుంది.
పాలీకార్బోనేట్ లెన్స్
ఈ గాగుల్‌లో ప్రధానమైన భాగం - పాలీకార్బోనేట్ లెన్స్. ఇది ఇంపాక్ట్ రెసిస్టెంట్‌గా ఉండటంతో పాటు, విజువల్ డిస్టార్షన్ లేకుండా క్లియర్ వ్యూ ఇస్తుంది. లెన్స్‌పై ఉన్న స్మూత్ టింట్.. కళ్లకు అడ్డంకి కాకుండా, గ్లేర్ తగ్గించి మంచి విజువల్ కంఫర్ట్ ఇస్తుంది.
ఈ మోడల్‌లో ఉన్న 'స్నాప్-లాక్ లెన్స్ స్వాప్ సిస్టమ్' ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. రెండు వైపులా ఉన్న లాక్స్‌ను ఒపెన్ చేస్తే లెన్స్‌ను సులభంగా మార్చుకోవచ్చు. మట్టి పడినప్పుడు లేదా రాత్రిపూట రైడింగ్ కోసం క్లియర్ లెన్స్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈ మోడల్‌ను Alpinestars రోల్-ఆఫ్ సిస్టమ్‌తో ఉన్న వెర్షన్‌లో కూడా కొనవచ్చు. టియర్-ఆఫ్‌కి బదులుగా, రోల్ అయ్యే ఫిల్మ్ సిస్టమ్ ద్వారా, మట్టి పడిన లెన్స్ భాగాన్ని ఒక నాబ్ తిప్పడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ MX రైడర్లు ఎక్కువగా ఇష్టపడే ఫీచర్ ఇది.
ధర
ధర విషయానికి వస్తే, Supertech Vision Vista కొంచెం ఖరీదైనదే. దానికి కంటే ఒక స్టెప్ కింద ఉన్న Vision 8 మోడల్, దీనిలో సగం ధరకే దొరుకుతుంది. అయితే మీ వద్ద ఇప్పటికే టాప్-ఎండ్ MX హెల్మెట్ ఉంటే, ఈ Supertech గాగుల్స్ దానితో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి.
మొత్తంగా చూస్తే, ప్రొఫెషనల్ ఆఫ్‌రోడ్ రైడర్లతో పాటు, కాంప్రమైజ్ కాని రైడర్లకు Alpinestars Supertech గాగుల్స్ ఒక బెస్ట్ ఆప్షన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















