Best Mileage Scooters in India: బెస్ట్ మైలేజ్ అందించే స్కూటర్లు ఇవే - ఫాసినో నుంచి బర్గ్‌మాన్ వరకు!
India Best Mileage Scooters: మనదేశంలో మంచి మైలేజీ అందించే స్కూటర్లు చాలా ఉన్నాయి. వీటిలో యమహా ఫాసినో 125 హైబ్రిడ్ నుంచి సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 వరకు స్కూటర్లు ఉన్నాయి.
Best Mileage Scooters: భారతదేశంలో మంచి మైలేజ్ అందించే స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. తక్కువ ధరకు అధిక మైలేజీ, గొప్ప ఫీచర్లు అందించే స్కూటీలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. మీకు అద్భుతమైన మైలేజీని అందించగల అనేక స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్లు నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు బాగా ప్రాచుర్యం పొందాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
యమహా ఫాసినో 125 హైబ్రిడ్ (Yamaha Fascino 125 Hybrid)
యమహా లాంచ్ చేసిన ఈ హైబ్రిడ్ స్కూటర్ మార్కెట్లో బాగా పేరు తెచ్చుకుంది. ఈ స్కూటర్‌లో 125 సీసీ ఇంజన్ అందించారు. దీనికి ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయబడింది. అలాగే ఇది ఒక హైబ్రిడ్ కారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు పెట్రోల్‌తో కూడా నడుస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ వినియోగదారులకు 68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ బరువు 99 కిలోలుగా ఉంది. ఈ హైబ్రిడ్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.79,990గా ఉంది.
హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)
హోండా లాంచ్ చేసిన ఈ స్కూటర్ మార్కెట్లో ప్రజలకు మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. హోండా అత్యధికంగా విక్రయించిన స్కూటీల్లో యాక్టివా 6జీ నంబర్ వన్‌గా ఉంది. ఈ స్కూటర్‌లో 109.51 సీసీ ఇంజన్ ఉంది. అలాగే ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. దీని ఇంజన్ 7.73 బీహెచ్‌పీ పవర్‌ని డెలివర్ చేస్తుంది. అలాగే దీని గరిష్ట వేగం 85 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ బరువు 106 కిలోలుగా ఉంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. హోండా యాక్టివా 6జీ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.78 వేల నుంచి రూ.84 వేల మధ్య ఉంది.
Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూపర్ - భారత్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?
టీవీఎస్ జూపిటర్ 125 (TVS Jupiter 125)
టీవీఎస్ జూపిటర్‌ను భారతీయ మార్కెట్లో గొప్ప మైలేజ్ స్కూటర్‌గా కూడా పరిగణిస్తారు. ఈ స్కూటర్‌లో 124.8 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 10.5 ఎన్ఎం టార్క్‌తో 8.15 పీఎస్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీని బరువు 108 కిలోలు. టీవీఎస్ జూపిటర్ 125 మీకు 60 కిలోమీటర్ల మైలేజీని కూడా ఇస్తుంది. ఈ స్కూటర్‌లో లగేజీని ఉంచడానికి మీకు ఎక్కువ స్థలం కూడా లభిస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.86 వేల నుంచి రూ.96 వేల మధ్య ఉంది.
సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)
సుజుకికి చెందిన ఈ స్కూటర్‌ని దేశంలోని ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో కంపెనీ 124 సీసీ ఇంజన్‌ని అందించింది. ఇందులో 5.5 లీటర్ ఇంధన ట్యాంక్ కూడా ఉంది. ఈ స్కూటర్‌లో అల్లాయ్ వీల్స్‌తో పాటు సెల్ఫ్, కిక్ స్టార్ట్ సిస్టమ్ కూడా ఉంది. దీని బరువు దాదాపు 110 కిలోలు. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. అదే సమయంలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 84 వేల నుండి రూ. 87 వేల మధ్య ఉంటుంది.