Best Automatic Cars: మైలేజ్, స్పేస్, కంఫర్ట్, లో మెయింటెనెన్స్ - ఫస్ట్ టైమ్ కార్ బయ్యర్‌కు ₹15 లక్షల్లో బెస్ట్ ఆటోమేటిక్ SUV
Best Automatic Cars For First-time Buyer: ₹15 లక్షల లోపు ఆటోమేటిక్ కారు కావాలా? మైలేజ్, కంఫర్ట్, తక్కువ మెయింటెనెన్స్ చూస్తున్న ఫస్ట్‌టైమ్ బయ్యర్లకు ఈ SUVలు బెస్ట్.

Best Automatic Cars Under 15 Lakh Budget: ఫస్ట్‌టైమ్ కారు కొనాలనుకునే వాళ్లకి ఎప్పుడూ రెండు టెన్షన్‌లు ఉంటాయి - మైలేజ్ ఎలా ఉంటుందో? మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుందేమో?. ముఖ్యంగా, సేల్స్ ప్రొఫెషనల్స్ తరహాలో రోజూ ఎక్కువ దూరం (ప్రతి నెలా 800 కి.మీ. వరకు) డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా బెస్ట్ కారు ఎంచుకోవాలి. ఈ ఎంపికలో చిన్న తప్పు జరిగినా ఖర్చులు పెరిగిపోతాయి. అందుకే ₹15 లక్షల బడ్జెట్‌లో, ఆటోమేటిక్ కారు కొనాలనుకునే వారి కోసం సరైన సజెషన్ ఇదే.
Maruti Brezza - నమ్మదగిన ఎంపిక
మారుతి బ్రెజ్జా చాలా కాలంగా ఫ్యామిలీ SUVలలో టాప్ లిస్టులో ఉంది. 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది మైలేజ్ పరంగా కూడా సూపర్. ఆటోమేటిక్ వెర్షన్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఉండటంతో డ్రైవింగ్ స్మూత్‌గా ఉంటుంది.
బ్రెజ్జా సస్పెన్షన్ సెటప్ కూడా బాగుంది. చిన్న చిన్న గుంతలున్న రోడ్లపైనా కంఫర్ట్‌గా డ్రైవ్ చేయొచ్చు. సీటింగ్ స్పేస్ కూడా బాగుండడంతో 'ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్' సౌకర్యంగా ట్రావెల్ చేయవచ్చు. బూట్ స్పేస్ కూడా వీకెండ్ ట్రిప్స్‌కి సరిపోతుంది.
మారుతి సర్వీస్ నెట్‌వర్క్ దేశమంతా ఉండటం వలన, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అందుకే, ఫస్ట్‌టైమ్ బయ్యర్లకు ఇది ఇబ్బంది పెట్టని ఆప్షన్.
Mahindra XUV3XO - టర్బో పవర్‌తో స్మార్ట్ SUV
మార్కెట్లో హల్‌చల్ క్రియేట్ చేసిన SUVల్లో మహీంద్రా XUV 3XO ఒకటి. 1.2 లీటర్ టర్బో MPFI పెట్రోల్ ఇంజిన్‌తో ఇది వస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత కూడి ఉంటుంది. డ్రైవింగ్ ఎంగేజ్‌మెంట్ పరంగా ఇది చాలా రిఫైన్డ్.
ఇది టర్బో ఇంజిన్ అయినా, డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి చక్కటి మైలేజ్ ఇస్తుంది. సేల్స్ ప్రొఫెషనల్స్ లాంటి రెగ్యులర్ డ్రైవర్స్‌కి ఇది పెర్ఫెక్ట్.
ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, XUV 3XOలో ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు యంగ్ డ్రైవర్స్‌కి బాగా నచ్చేలా ఉంటాయి.
గ్రౌండ్ క్లియరెన్స్ & కంఫర్ట్ మేటర్
రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఉన్నప్పటికీ.. కారుకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం సేల్స్ ఫీల్డ్ డ్రైవర్స్‌కి బిగ్ ప్లస్. బ్రెజ్జా, XUV 3XO రెండింటికీ ఇది అందుబాటులో ఉంది. బ్యాడ్ రోడ్స్‌లో లేదా పాత్‌హోల్స్ ఉన్న ఏరియాల్లోనూ కారు బాడీ రోడ్డుకు తగలకుండా ఈ SUVలను సేఫ్‌గా డ్రైవ్ చేయవచ్చు.
బడ్జెట్‌లో ఏది బెస్ట్?
₹15 లక్షల బడ్జెట్‌లో బ్రెజ్జా ఆటోమేటిక్ వేరియంట్ & XUV 3XO ఆటోమేటిక్ వేరియంట్ రెండూ సరిపోతాయి.
మారుతి బ్రెజ్జా - మైలేజ్ + తక్కువ మెయింటెనెన్స్
మహీంద్రా XUV 3XO - పెర్ఫార్మెన్స్ + మోడర్న్ ఫీచర్లు
మీరు ఫ్యామిలీ ట్రిప్స్‌కి ఎక్కువగా వెళ్తే & లాంగ్ లైఫ్ వాహనం కావాలనుకుంటే బ్రెజ్జా బెస్ట్. స్పోర్టీ డ్రైవింగ్ ఫీలింగ్ కూడా కోరుకుంటే, XUV 3XO అద్భుతమైన ఆప్షన్. ఇదే మీ అవసరాలకు సరిపోయే సజెషన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















