Bajaj Freedom CNG Launched: ఏకంగా 102 కిలోమీటర్ల మైలేజీతో - సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసిన బజాజ్!
Bajaj Freedom CNG Bike: బజాజ్ ఫ్రీడం సీఎన్‌జీ బైక్‌ని కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.95 వేలుగా నిర్ణయించారు. ఇది ఎక్స్ షోరూం ధర. సీఎన్‌జీ మోడ్‌లో ఇది 102 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.
Bajaj Freedom CNG: బజాజ్ ఫ్రీడం సీఎన్‌జీ బైక్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. ప్రపంచంలో మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ ఇదే. ఇందులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. దీని సీటు పొడుగ్గా ఉండటం విశేషం. దీని లుక్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అదే దీన్ని ఇతర కమ్యూటర్ బైక్‌ల నుంచి డిఫరెంట్‌గా ఉండేలా చేస్తుంది. అదే సమయంలో మంచి మైలేజీని కూడా ఇస్తుంది.
దీని ప్రత్యేకత ఏంటి?
బజాజ్ కొత్త సీఎన్‌జీ బైక్‌కు లాంచ్ అవ్వడానికి ముందు 11 విభిన్న భద్రతా పరీక్షలు చేశారు. ఈ బైక్ చాలా గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. దీని స్టైలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండటం విశేషం. ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలిగే పెద్ద, వెడల్పు సీటు, బలమైన ట్రేల్లిస్ ఫ్రేమ్, వినూత్న సాంకేతిక ప్యాకేజింగ్‌తో అనుసంధానించబడిన మోనోషాక్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
ఈ బైక్ కమ్యూటర్ సెగ్మెంట్లో అత్యంత విభిన్నంగా, స్పెషల్‌గా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ కొత్త బైక్‌లో రెండు కిలోల సీఎన్‌జీ సిలిండర్‌తో కూడిన 2 లీటర్ పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా కంపెనీ అందించింది. సౌలభ్యం కోసం కంపెనీ దానిలో లింక్డ్ మోనోషాక్‌ని ఉపయోగించింది. కంపెనీ ఈ బైక్‌లో ఒక బటన్‌ను అందించింది. దాని సహాయంతో కస్టమర్‌లు బైక్‌ను ఆపకుండా పెట్రోల్ నుంచి సీఎన్‌జీ మోడ్‌కు మార్చగలరు. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also: ఇండియన్ సేఫ్టీ టెస్టులో 5 స్టార్లు సాధించిన ఈవీలు ఇవే - దేశంలో సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ మైలేజ్ ఎంత?
ఈ బైక్ సీటు కింద కంపెనీ CNG ట్యాంక్‌ను అందించింది. ఈ బైక్‌లో 125 సీసీ ఇంజన్ ఉంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ మోడ్‌లలో నడుస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ బైక్ సీఎన్‌జీ మోడ్‌లో కేజీకి 102 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఒక్కసారి పెట్రోల్ ట్యాంకు, సీఎన్‌జీ ట్యాంకు మొత్తాన్ని ఫిల్ చేస్తే 330 కిలోమీటర్ల మైలేజీ లభించనుంది. ఈ బైక్‌ను ఏడు రంగుల్లో విడుదల చేశారు. డ్రమ్ వేరియంట్ రెండు రంగుల్లో లాంచ్ అయింది.
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీని ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్ కూడా ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు కంపెనీ డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.
ధర ఎంత?
ఈ బైక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను రూ. 95 వేలుగా నిర్ణయించారు. కంపెనీ ఈ బైక్‌ను మూడు వేరియంట్‌లలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ బైక్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
Experience the #WorldsFirstCNGBike - Bajaj Freedom now!
— Bajaj Auto Ltd (@_bajaj_auto_ltd) July 5, 2024
Link: https://t.co/fxOYRi5PXR#RideTheChange #GameChanger #BajajAuto pic.twitter.com/2X97a8LnLJ
Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా రాబోతున్న బ్రిటిష్ బైక్, ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?