అన్వేషించండి

2026లో కార్‌ ధరలు పెరిగితే GST లాభం మొత్తం పోతుందా? లేక, కార్లు ఇంకా చౌకగానే ఉంటాయా?

2026 జనవరి నుంచి కార్ల ధరలు పెరిగినా, GST 2.0 వల్ల వచ్చిన తగ్గింపు మిగిలే ఉంటుందా అన్నది చాలా మంది సందేహం. లగ్జరీ నుంచి మాస్‌ కార్ల వరకు ధరలపై అసలు ప్రభావం ఏంటో తెలుసుకోండి.

Car Price Hike 2026: కొత్త సంవత్సరం మొదలవుతూనే కార్‌ కొనుగోలుదారుల్లో ఒక సందేహం మొదలైంది. “2026 జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి, GST తగ్గింపు వల్ల వచ్చిన లాభం అంతా పోతుందా?” అన్నదే ఆ ప్రశ్న. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే, ధరలు కొంత పెరిగినా, మొత్తం లెక్కలో కార్లు ఇప్పటికీ GST 2.0కు ముందు కంటే చౌకగానే ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

ధరల పెంపునకు కారణం ఇదే
2026 జనవరి నుంచి అనేక కార్‌ తయారీ సంస్థలు ధరల పెంపును ప్రకటించాయి. ముడి సరుకుల ఖర్చు పెరగడం, లాజిస్టిక్స్‌ వ్యయం ఎక్కువ కావడం, రూపాయి బలహీనత - ఇవన్నీ ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెంపు ఎక్కువగా 2 నుంచి 3 శాతం మధ్యే ఉండడం గమనించాల్సిన విషయం.

మెర్సిడెస్‌ బెంజ్‌
మెర్సిడెస్‌ బెంజ్‌ తమ మొత్తం లైనప్‌పై జనవరి 1, 2026 నుంచి గరిష్టంగా 2 శాతం ధరలు పెంచనుంది. GLS వంటి మోడళ్ల ధర సుమారు ₹3 లక్షల నుంచి ₹4 లక్షల వరకు పెరగొచ్చు. C-Class ధర సుమారు ₹1.18 లక్షల నుంచి ₹1.29 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయినా GST తగ్గింపు తర్వాత సెప్టెంబర్‌లో వచ్చిన భారీ తగ్గింపుతో పోలిస్తే, GLS ఇప్పటికీ దాదాపు ₹5 లక్షల నుంచి ₹6 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు చౌకగానే ఉంటుంది.

BMW
2025 సెప్టెంబర్‌లోనే ధరలు సవరించిన BMW, జనవరి 2026లో కూడా 2 నుంచి 3 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా పూర్తిగా దిగుమతి చేసే మోడళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 3 సిరీస్‌ ధర సుమారు ₹1.21 లక్షలు, 5 సిరీస్‌ ధర దాదాపు ₹1.45 లక్షలు పెరగవచ్చు. అయితే GST 2.0 తర్వాత వచ్చిన ₹3.5 లక్షల నుంచి ₹10 లక్షల వరకు తగ్గింపుతో పోలిస్తే, కొత్త ధరలు ఇంకా తక్కువగానే ఉంటాయి.

MG మోటార్‌
MG వాహనాల్లో మోడల్‌ ఆధారంగా ధరల మార్పు కనిపిస్తోంది. విండ్సర్‌ ధరలు ₹30,000 నుంచి ₹37,000 వరకు పెరిగే అవకాశం ఉంది. కామెట్‌ ధరలు ₹10,000 నుంచి ₹20,000 వరకు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పటికీ, ఈ మోడళ్లు కూడా GST 2.0 ముందు కంటే తక్కువకే లభిస్తాయి. ఆసక్తికరంగా, హెక్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ పాత మోడల్‌తో పోలిస్తే దాదాపు ₹2 లక్షలు తక్కువ ప్రారంభ ధరతో వచ్చింది.

నిస్సాన్‌
నిస్సాన్‌ జనవరి 2026 నుంచి గరిష్టంగా 3 శాతం ధరలు పెంచనుంది. మాగ్నైట్‌ వేరియంట్‌ను బట్టి ₹17,000 నుంచి ₹32,000 వరకు పెరగొచ్చు. GST 2.0 తర్వాత మాగ్నైట్‌ ధరలు దాదాపు ₹95,000 వరకు తగ్గింది. కాబట్టి, రేట్లు పెరిగినా కొనుగోలుదారులకు ఇంకా లాభమే ఉంటుంది.

రెనాల్ట్‌
రెనాల్ట్‌ క్విడ్‌, కైగర్‌ మోడళ్ల ధరలు ₹8,000 నుంచి ₹21,000 వరకు పెరగవచ్చు. ట్రైబర్‌ బేస్‌ వేరియంట్‌ ధర సుమారు ₹12,000 పెరిగే అవకాశం ఉంది. అయితే గతంలో GST తగ్గింపుతో ఈ కార్ల ధరలు ₹40,000 నుంచి ₹96,000 వరకు తగ్గాయి. అందువల్ల లాభం ఇప్పటికీ కొనుగోలుదారులకే.

2026 జనవరి ధరల పెంపు GST 2.0 వల్ల వచ్చిన ప్రయోజనాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేదు. 2025 చివర్లో ఉన్నంత భారీ సేవింగ్స్‌ ఉండకపోవచ్చు, కానీ GST ముందు ధరలతో పోలిస్తే కార్లు ఇప్పటికీ చౌకగానే ఉన్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్లు, దిగుమతి వాహనాల్లో ధరలు కొంచెం ఎక్కువగా పెరిగినా, మొత్తం లెక్కలో కొనుగోలుదారుడికి నష్టమైతే లేదు.

మొత్తంగా చెప్పాలంటే, కొత్త ఏడాది ధరల పెంపు భయపడాల్సినంత పెద్ద విషయం కాదు. కారు కొనాలనుకుంటున్నవారికి 2026 కూడా ఇంకా అనుకూలంగానే కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget