Maruti Brezza Facelift: మతిపోగొట్టే స్టైలిష్ టచ్‌తో మారుతి బ్రెజ్జా - ఇదో గేమ్ ఛేంజర్ - ధర, ఫీచర్ల వివరాలు ఇవే
2025 Maruti Brezza Facelift: మరో నెల రోజుల్లో కొత్త రూపంతో రాబోతున్న మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర, డిజైన్, ఫీచర్లపై ఇప్పటికే ఆసక్తికర లీకులు వస్తున్నాయి.

Maruti Brezza 2025 Facelift Price And Features: దేశంలోని కాంపాక్ట్ SUV మార్కెట్ రోజురోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. Hyundai Venue, Kia Sonet, Tata Nexon వంటి మోడళ్లతో పోటీగా నిలిచిన Maruti Brezza, ఇప్పుడు కొత్త రూపంలో (Facelift) మార్కెట్‌లోకి రానుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారు ఆగస్టు 15, 2025న ఇండియాలో లాంచ్ అవుతుంది. 2025 Facelift మోడల్ ఆవిష్కరణకు ముందు, ఈ కారు టెస్టింగ్ సమయంలో, స్పై షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కొత్త వెర్షన్‌లో డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ టెక్నాలజీ వంటి కీలక మార్పులు రాబోతున్నాయి.
డిజైన్‌లో స్టైలిష్ టచ్
Brezza 2025 Faceliftలో.. ముందు భాగంలో గ్రిల్‌ను కొత్తగా డిజైన్ చేశారు. స్లిమ్ LED హెడ్‌లైట్లు, నయా DRLs, & సరికొత్త బంపర్ డిజైన్ ఈ కారుకు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. రియర్ బాడీ లుక్స్ కూడా దూకుడుగా ఉండేలా మార్చారు. LED టైలైట్లు, బూట్ డిజైన్, వెరైటీ అలాయ్ వీల్స్ ప్రముఖంగా కనిపించేలా ఉంటాయి. మొత్తం మీద ఇది చాలా యూత్ ఫుల్, SUV తరహా ప్రెజెన్స్ కలిగిన డిజైన్.
ఇంటీరియర్‌లో టెక్ అప్‌గ్రేడ్
ఇంటీరియర్ విషయానికి వస్తే, Brezza 2025లో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆంబియంట్ లైటింగ్, అప్‌గ్రేడెడ్ డ్రైవర్ ఇంటర్‌ఫేస్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు లభించనున్నాయి. Android Auto, Apple CarPlay వైర్‌లెస్ కనెక్టివిటీతో ఇవి పని చేస్తాయి. వెంట్ సీట్స్, ఆటో AC, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ఇంజిన్ & హైబ్రిడ్ టెక్నాలజీ
ఇంజిన్: 1.5 లీటర్ K15C డ్యుయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్
పవర్ అవుట్‌పుట్: సుమారు 103 bhp & 137 Nm టార్క్
హైబ్రిడ్ రకం: మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్ + 48V లిథియమ్ అయాన్ బ్యాటరీ)
గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్
మైలేజ్
మాన్యువల్ – 20.15 kmpl (ARAI సర్టిఫైడ్)
ఆటోమేటిక్ – 19.80 kmpl
CNG వెర్షన్ – 25.51 km/kg (ప్రస్తుత బ్రెజ్జా ఆధారంగా)
ఇది పెట్రోల్ + ఎలక్ట్రిక్ మైల్డ్ హైబ్రిడ్ కారు, CNG వేరియంట్ కూడా ఉండొచ్చు. పూర్తిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ మాత్రం కాదు.
సేఫ్టీ ఫీచర్లు & బిల్డ్ క్వాలిటీ
Brezza 2025లో 6 ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ కంట్రోల్, ESC, ISOFIX మౌంటింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న మోడల్‌కు 4-స్టార్ GNCAP సేఫ్టీ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో, తాజా మోడల్ మరింత బలమైన బాడీ స్ట్రక్చర్‌తో రానుందని అంచనా.
ధర & పోటీ
ఈ facelift మోడల్ ధర ₹8.5 లక్షల నుంచి ₹13 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఇది Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Mahindra XUV300 వంటి కాంపాక్ట్ SUVలతో పోటీపడుతుంది. కానీ మారుతికి ఉన్న విశ్వసనీయత, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్, మైలేజ్ ప్రధాన ఆకర్షణలు.
2025 Maruti Brezza Facelift, మారుతున్న కస్టమర్ అంచనాలకు తగినట్లుగా రూపుదిద్దుకుంటోంది. డిజైన్, మైలేజ్, సేఫ్టీ, ఫీచర్ల పరంగా ఇది మధ్యతరగతి ప్రజలను బాగా ఆకర్షించవచ్చు. సిటీ డ్రైవింగ్‌లో ఇంధన సమర్థత గల నమ్మకమైన SUV కోసం చూస్తున్నవాళ్లకు ఈ కొత్త బ్రెజ్జా బెస్ట్ చాయిస్ అవుతుంది.





















