అన్వేషించండి

ట్రూలీ కీలెస్‌ టెక్నాలజీ, ఫాంటసీ సినిమా ఫీచర్లతో అదరగొట్టిన Ather Redux కాన్సెప్ట్‌ - ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌!

Ather Energy కొత్త కాన్సెప్ట్ వాహనం Project Redux. రైడర్‌ కాస్త బెండ్‌ కాగానే (లీన్) వేగం పెరగడం, కీలెస్‌ ఎంట్రీ, ఫ్యూచరిస్టిక్‌ డిస్‌ప్లే, 3D ప్రింటెడ్ సీట్లు దీని ఫీచర్లు.

Ather Project Redux: ఇండియాలో, ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో చురుగ్గా ఉన్న Ather Energy, మరోసారి తన ఇన్నోవేషన్‌తో హైలైట్‌ అయ్యింది. కంపెనీ CEO తారుణ్‌ మెహతా తాజాగా ప్రకటించిన Project Redux అనే కాన్సెప్ట్ వాహనం, నిజంగానే భవిష్యత్తు రవాణా ఎలా ఉండబోతుందో చూపిస్తోంది.

లీన్ అవ్వగానే స్పీడ్ పెరుగుతుంది
Redux కాన్సెప్ట్‌ వాహనం ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఈ బండి మీద ప్రయాణిస్తున్నప్పుడు, కాస్త ముందుకు వంగితే అయితే అది వెంటనే స్పందిస్తుంది. వాహనం తన జ్యామెట్రీని ఆటోమేటిక్‌గా రీ-అడ్జస్ట్ చేసుకుని, సస్పెన్షన్‌ను మార్చుకుని, మరింత వేగంగా, స్థిరంగా ప్రయాణిస్తుంది. అంటే, ఫాంటసీ సినిమా తరహాలో ఇది సూచనలకు స్పందించడమే కాదు, డ్రైవర్‌ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుంది.

నిజమైన కీలెస్ ఎంట్రీ - వింతైన అనుభవం
తారుణ్‌ మెహతా చెప్పిన ప్రకారం, “ఈ వాహనం దగ్గరకి మీరు నడుస్తూ వెళ్ళగానే అది మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎటువంటి తాళం చెవి, ఎటువంటి హడావిడి అవసరం లేదు. ఇది నిజమైన కీలెస్ ఎక్స్‌పీరియన్స్‌.” అంటే, వాహనం మీ ఉనికిని గుర్తించి ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ టెక్నాలజీ మేజిక్‌ను ఏథర్‌ కొత్త కాన్సెప్ట్‌ వెహికల్‌లో ఉపయోగిస్తారు.

ఫ్యూచరిస్టిక్ డిస్‌ప్లే డిజైన్
Redux డాష్‌బోర్డ్ సంప్రదాయంగా ఉండదు. ఈ బండిలో పెద్ద వెర్టికల్ స్క్రీన్ ఉంటుంది. అది కిందికి వంగి మీకు అవసరమైన సమాచారం మాత్రమే చూపిస్తుంది. ఫ్యూచర్‌ డిజైన్‌లో ఇది యూజర్‌ ఫ్రెండ్లీ, డిస్ట్రాక్షన్‌-ఫ్రీ (ఏకాగ్రతను చెడగొట్టని) అనుభవాన్ని ఇస్తుంది.

పర్ఫార్మెన్స్‌తోపాటు ఇన్నోవేషన్
Redux ప్రత్యేకతలు కేవలం సాఫ్ట్‌వేర్‌లోనే కాక, హార్డ్‌వేర్‌లోనూ ఉన్నాయి.

సీట్లు 3D ప్రింటెడ్ లాటిస్ మెష్ టెక్నాలజీతో తయారవుతాయి. ఇవి తేలికగా ఉండి, అవసరమైన చోట మాత్రమే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి, కంఫర్ట్‌కు గ్యారంటీ ఉంటుంది.

బాడీ యాంప్లిటెక్స్‌ (Amplitex) అనే కొత్త హై-పర్ఫార్మెన్స్ మెటీరియల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఇది బరువు తగ్గిస్తుంది కానీ బలం మాత్రం తగ్గదు.

Redux ఎందుకు స్పెషల్?
తరుణ్‌ మెహతా మాటల్లో చెప్పాలంటే “Redux ఒక సాధారణ ప్రోటోటైప్ కాదు. దీని ప్రతి భాగం, ఇంటర్‌ఫేస్ నుంచి బాడీ మెటీరియల్ వరకు, అన్నీ రైడర్‌ అనుభవాన్ని కొత్తగా మార్చడానికి రూపుదిద్దుకున్నాయి.”

భవిష్యత్‌ మొబిలిటీకి కొత్త దారి
Redux కాన్సెప్ట్‌ వాహనం అనేది కేవలం టెక్నాలజీ ప్రదర్శన కాదు. రాబోయే దశాబ్దంలో వాహనాలు ఎలా ఉండబోతాయో వివరించే ఒక ముందస్తు చూపు. కీలెస్‌ ఎంట్రీ, లీన్‌-టు-స్పీడ్ టెక్నాలజీ, 3D ప్రింటెడ్ సీట్లు, తేలికైన యాంప్లిటెక్స్‌ బాడీ - ఇవన్నీ కలిసి, భవిష్యత్‌ తరం Ather వాహనాలు ఎంత ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

Ather Energy ఇప్పటికే ఇండియన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు Reduxతో, ఈ కంపెనీ భవిష్యత్‌ వాహనాలకు కొత్త నిర్వచనం చెబుతోంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget