అన్వేషించండి

Bajaj Dominar 400: బుల్లెట్‌కు పోటీగా 'డొమినార్ 400' - యూత్‌కు పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యే పవర్‌!

Bajaj Dominar 400: బజాజ్ ఆటో, తన పాపులర్‌ టూరింగ్ బైక్ డొమినార్ 400 2025 ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. డొమినార్ 400 ఇప్పుడు బుల్లెట్ కంటే పవర్‌ఫుల్‌గా మారింది.

Bajaj Dominar 400 Price And Features In Telugu: బజాజ్ ఆటో... పవర్, స్టైల్ & స్మార్ట్‌ ఫీచర్లను మిక్స్‌ చేసి, తన సుప్రసిద్ధ స్పోర్ట్స్ టూరర్ బైక్ డొమినార్ 400 కొత్త & అప్‌డేటెడ్‌ 2025 మోడల్‌ను భారతదేశంలో లాంచ్‌ చేసింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌ రేటు స్వల్పంగా రూ. 6,026 మాత్రమే పెరిగింది. ఈ స్వల్ప మొత్తానికే అద్భుతమైన సాంకేతిక & డిజైన్ అప్‌డేట్స్‌ను కంపెనీ ఇస్తోంది.

డిజిటల్ డిస్‌ప్లే & స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
కొత్త బజాజ్ డొమినార్ 400లో అతి పెద్ద మార్పు దాని కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్. ఈ డిస్‌ప్లే.. పల్సర్ NS400Z లాగా స్ల్పిట్‌ డిజైన్ & డాట్-మ్యాట్రిక్స్ ఇన్సెట్‌తో వస్తుంది. ఈ ఫీచర్ సాయంతో రైడర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్ & SMS అలర్ట్ వంటివన్నీ పొందవచ్చు. ఈ బైక్‌కు స్మార్ట్‌ ఫోన్‌ను అనుసంధానించి రైడ్‌ను మరింత స్మార్ట్‌గా, ఫన్‌గా & కనెక్టెడ్‌గా మార్చుకోవచ్చు.        

రైడ్-బై-వైర్ థ్రోటిల్ & నాలుగు రైడింగ్ మోడ్స్‌
డొమినార్ 400 కొత్త మోడల్ రైడ్-బై-వైర్ (Ride-by-wire) టెక్నాలజీతో తయారైంది, ఈ ఫీచర్‌ను ఎలక్ట్రానిక్‌ థ్రోటిల్‌ కంట్రోల్‌ (electronic throttle control) అని కూడా పిలుస్తారు. ఈ బైక్‌లో నాలుగు రైడింగ్ మోడ్స్‌ - రెయిన్, రోడ్, స్పోర్ట్ & ఆఫ్ రోడ్ - ఉన్నాయి. ఇవి, వివిధ పరిస్థితులకు అనుగుణంగా పవర్ డెలివరీని & ABS వ్యవస్థను నియంత్రిస్తాయి. మరో స్పెషాలిటీ ఏంటంటే.. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను స్పోర్ట్ & ఆఫ్-రోడ్ మోడ్‌లలో పూర్తిగా ఆపేయవచ్చు, ఇది రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత అద్భుతంగా చేస్తుంది.          

373.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్
డొమినార్ 400లో మునుపటిలాగే 373.5cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. అయితే, ఈ ఇంజిన్‌ను కొత్త OBD-2B ఉద్గార నిబంధనల ప్రకారం అప్‌డేట్‌ చేశారు. ఈ ఇంజిన్ 40 PS పవర్‌ను & 35 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఫన్‌ రైడ్‌ను ఇష్టపడే యువత కోరుకునే పవర్‌ను ఈ బండి ఇస్తుంది.       

యువత ఇష్టపడే కొత్త కలర్‌ 
2025 మోడల్‌లో, బజాజ్ మరోసారి Canyon Red Colourను ప్రవేశపెట్టింది, ఇది యువతకు చాలా ఇష్టమైన రంగు. ఈ అప్‌డేట్స్‌ బైక్ ధర 6,026 పెరిగింది. కానీ, దీనిలో ఉన్న కొత్త ఫీచర్లు & సాంకేతికత దీనిని "పైసా వసూల్‌" బైక్‌గా మార్చాయి.            

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మెటియోర్ 350తో పోటీ
డొమినార్ 400, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌, మెటియోర్ 350కు పోటీ బైక్‌. ఫీచర్లు, పవర్‌ & టెక్నాలజీ పరంగా డొమినార్ 400 మెటియోర్ కంటే ఒక మెట్టు పైనే ఉన్నట్లు కనిపిస్తుంది. క్లాసిక్ స్టైల్‌ను ఇష్టపడే వారి కోసం మెటియోర్ ఉంటే & అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఇష్టపడే వారి కోసం డొమినార్ 400 మార్కెట్‌లోకి వచ్చింది.              

టాప్ హెడ్ లైన్స్

Upcoming SUVs List: మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు
రోడ్డుపై గుంతల గురించి ముందే హెచ్చరించే కొత్త ఫీచర్‌ - అథర్‌ Gen 2 స్కూటర్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌
526km రేంజ్‌, ఆశ్చర్యపరిచే ఫీచర్లు... కానీ ఈ 2 కారణాల వల్ల కియా సైరోస్‌ EV మీకు సరిపోకపోవచ్చు!
కియా సైరోస్‌ EV ని కొనాలా? వద్దా? - ఈ మోడ్రన్‌ కారులో 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు
కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320
టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. మార్వెల్‌ అభిమానుల కోసం స్పెషల్‌ బైక్‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget