అన్వేషించండి

Big Family Cars: పెద్ద ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోయే 7-సీటర్ కార్లు - కేవలం రూ.6 లక్షల నుంచి ప్రారంభం

Best Budget Family Cars: మన రోడ్ల మీద చాలా MPVలు తిరుగుతున్నాయి. మీది పెద్ద ఫ్యామిలీ అయితే, మీకు సరిపోయే MPVలు మార్కెట్లో చాలా ఉన్నాయి.

Best Budget 7-Seater MPVs For Big Family: మన దేశంలో చాలామంది పెద్ద & ఉమ్మడి కుటుంబాల్లో జీవిస్తున్నారు, ఆ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్‌ సంఖ్య ఎక్కువ. అలాంటి పెద్ద కుటుంబాలకు సాధారణ చిన్న కారు సరిపోదు. వాళ్లందరికీ ఒక కారు తక్కువ - రెండు కార్లు ఎక్కువ అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అలాంటి పెద్ద లేదా ఉమ్మడి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని కంపెనీలు పెద్ద కార్లను/ MPVలను (Multi-purpose vehicles) లాంచ్‌ చేశాయి. ఇవి ఎక్కువ స్థలంతో వస్తాయి. పెద్ద కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికి, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్‌ వేయడానికి ఈ మల్టీ పర్పస్‌ వెహికల్స్‌ (Best MPVs 2025) సరిగ్గా సరిపోతాయి. 

మీకు కూడా పెద్ద కుటుంబం ఉండి, మీ కుటుంబ సభ్యులందరికీ సులభంగా సరిపోయే కారు కోసం సెర్చ్‌ చేస్తుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. 7 సీట్ల కార్ల గురించి ఈ వార్తలో చెబుతాం, మీరు సెర్చ్‌ చేసే పనిని తగ్గిస్తాం. ఈ కార్లు మీ బడ్జెట్‌లో ఉండడమే కాదు, ఎక్కువ బూట్‌ స్పేస్‌తో, ముచ్చగొలిపే ఫీచర్లతో మిమ్మల్ని కట్టిపడేస్తాయి.

రెనాల్ట్ ట్రైబర్
ఈ లిస్ట్‌లో ఫస్ట్‌ చెప్పుకోవాల్సిన ఆప్షన్‌ రెనాల్ట్ ట్రైబర్ MPV. ఇది భారత మార్కెట్లో అత్యంత చవకైన MPVగా నిలిచింది. ఈ రెనాల్ట్ కారులో, 1 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. కారులో కూర్చున్నవాళ్లను ఖుషీ చేసే గొప్ప ఫీచర్లతో పాటు కట్టుదిట్టమైన భద్రత లక్షణాలు ఈ కారు సొంతం. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర (Renault Triber Ex-showroom price) రూ. 6.09 లక్షలు. ఇందులో టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది. 

మారుతి సుజుకి ఎర్టిగా
లిస్ట్‌లో రెండో పేరు మారుతి ఎర్టిగా. ఇది MPV సెగ్మెంట్‌లో బాగా అమ్ముడవుతోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ & CNG ఇంజిన్ ఆప్షన్స్‌తో ఈ కార్‌ లాంచ్‌ అయింది. ఈ మారుతి కారు ఈ విభాగంలో చాలా మందికి నచ్చింది, రోడ్డు మీదే కాదు అమ్మకాల్లోనూ దమ్ము చూపుతోంది. మారుతి ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర (Maruti Suzuki Ertiga Ex-showroom price) రూ. 8.96 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది & దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.25 లక్షలు. 

టయోటా రూమియన్
మూడో పేరు టయోటా రూమియన్, MPV సెగ్మెంట్‌లో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌. ఈ టయోటా కారులో 1.5 లీటర్ కెపాసిటి గల నేచురల్లీ ఆస్పిరేటెడ్ CNG ఇంజిన్‌ను అమర్చారు. టయోటా రూమియన్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Rumion Ex-showroom price) రూ. 10.54 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది & టాప్‌ వేరియండ్‌ ప్రైస్‌ రూ. 13.83 లక్షల వరకు ఉంటుంది. 

కియా కారెన్స్ 
పెద్ద ఫ్యామిలీలకు కార్‌ అందించే రేస్‌లో కియా కూడా ఉంది, కియా కారెన్స్‌ను కూడా మీరు ఓసారి ట్రైయల్‌ వేసి చూడవచ్చు. ఈ కియా కారులో 1.5 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ లేదా డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌ను అందించారు. కియా కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర (Kia Carens Ex-showroom price) రూ. 10 లక్షల నుంచి స్టార్‌ అవుతుంది, రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget