2022 MG ZS EV: ఒక్కసారి చార్జ్ పెడితే 461 కిలోమీటర్లు నాన్‌స్టాప్ - ఎంజీ జెడ్ఎస్ కొత్త వేరియంట్ ఎంట్రీ!
ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజీ తన కొత్త జెడ్ఎస్ ఈవీని మనదేశంలో లాంచ్ చేసింది.
ఎంజీ మనదేశంలో తన కొత్త జెడ్ఎస్ ఈవీని లాంచ్ చేసింది. దీని ధర రూ.21.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. జెడ్ఎస్ రెండు సంవత్సరాల క్రితమే అధికారికంగా లాంచ్ అయింది. మనదేశంలో మొట్టమొదట లాంచ్ అయిన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది కూడా ఒకటి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను కూడా ఇది ఎస్టాబ్లిష్ చేసింది.
ఇప్పుడు లాంచ్ అయిన కొత్త వెర్షన్‌లో స్టైలింగ్‌ను అప్‌డేట్ చేశారు. ఈ వెహికిల్ రేంజ్ పెంచడంతో పాటు... ఫీచర్లు కూడా యాడ్ చేశారు. ఇది చూడటానికి ఆస్టర్ తరహాలో ఉండనుంది. కానీ ముందువైపు కవర్ చేసిన గ్రిల్, షార్ప్ బంపర్ దీనికి ఎలక్ట్రిక్ వాహనం లుక్‌ను తీసుకొచ్చాయి.
చార్జింగ్ సాకెట్ ఎంజీ లోగోకు ఎడమవైపు ఉంది. ఈ కొత్త జెడ్ఎస్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను అందించారు. వీటిలో 17 అంగుళాల అలోయ్ వీల్స్ అందించారు. దీంతోపాటు వెనకవైపు కొత్త బంపర్, కొత్త ల్యాంప్స్ కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న జెడ్ఎస్ నుంచి వేరుగా ఉండేలా దీన్ని రూపొందించారు.
అన్నిటికంటే పెద్ద మార్పు ఏంటంటే డాష్ బోర్డుకు కొత్త లుక్ వచ్చింది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండనుంది. దీని టచ్ స్క్రీన్‌లో 10.1 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ ఉండనుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి సాధారణ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా ఇందులో ఉన్నాయి. డిజిటల్ కీ ద్వారా వెనకవైపు ఆర్మ్ రెస్ట్, ఏసీ వెంట్లను కూడా ఆపరేట్ చేయవచ్చు.ఇక రేంజ్ విషయానికి వస్తే... గతంలో లాంచ్ అయిన మోడల్ కంటే ఎక్కువ రేంజ్ ఇందులో అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!
Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!
View this post on Instagram