News
News
X

Maruti Suzuki Brezza-2022: భారత్ లో బెస్ట్ సెల్లింగ్ SUVగా బ్రెజ్జా-2022, ఆగష్టులో భారీగా అమ్మకాలు

దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా-2022 సత్తా చాటుతోంది. విడుదలైన రెండు నెలల్లోనే భారత్ లో బెస్ట్ సెల్లింగ్ SUVగా నిలిచింది.

FOLLOW US: 

భారతీయ మార్కెట్లో SUVలకు మంచి డిమాండ్ ఉంది. కాంపాక్ట్ SUVలు పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుపుకుంటున్నాయి.  దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి తాజాగా విడుదలైన  బ్రెజ్జా-2022..  దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVగా నిలిచింది.  ఈ కారు ఈ ఆగష్టు నెలలో 15,193 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.  అమ్మకాల్లో ఏకంగా 18 శాతం పెరుగుదలను కనబర్చింది.  తాజాగా బ్రెజ్జా, టాటా నెక్సాన్‌ను బీట్ చేసింది.

టాటా నెక్సాన్ కు  వెనక్కి నెట్టిన బ్రెజ్జా

నూతన బ్రెజ్జా ఈ ఏడాది జూన్ 30న దేశీయ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే కాంపాక్ట్ SUV నెక్సాన్ నుంచి కొనుగోళ్లను తన వైపు తిప్పుకున్నది. గత నెలలో ఏకంగా 15 వేలకుపైగా యూనిట్లను విక్రయించింది. టాటా నెక్సాన్ తో పోల్చితే 108 యూనిట్లను ఎక్కువగా అమ్మి.. టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఫీచర్ల విషయానికొస్తే..

సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చిన బ్రెజ్జా బ్రిటిష్ SUVని గుర్తుకు తెచ్చే బాక్సీ సిల్హౌట్‌ తో రివైజ్డ్ స్టైలింగ్‌ను కలిగి ఉంది.మారుతి సుజుకి బ్రెజ్జా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లేతో కూడిన పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను పొందుతుంది. బ్రెజ్జా దాని ప్రత్యర్థి కంపెనీ వాహనాల కంటే అత్యుత్తమ ఫీచర్ జాబితాను కలిగి ఉంది. SUV ఇప్పుడు ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్‌ తో కూడా విక్రయించబడింది.

ఇంజిన్ ప్రత్యేకతలు

హుడ్ కింద, 1.5L, 4-సిలిండర్ ను కలిగి టుంది. ఇది సహజంగా-ఆస్పిరేటెడ్ పవర్ ప్లాంట్ బ్రెజ్జాపై విధులు నిర్వహిస్తుంది. ఇది 103 బిహెచ్‌పి, 137 ఎన్ఎమ్ గరిష్ట అవుట్‌ పుట్‌ని విడుదల చేస్తుంది.  ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AT ఉన్నాయి. అంతేకాకుండా, ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ తో స్థిరంగా ఉంటుంది. మాన్యువల్ ట్రిమ్‌లకు 20.15 kmpl , ఆటోమేటిక్ వేరియంట్‌ లకు 19.80 kmpl మైలేజీని అందిస్తుంది.

ఎన్ని రంగుల్లో వచ్చిందంటే..

మారుతీ సుజుకీ బ్రెజ్జా- 2022 కారు ఆరు సింగిల్ టోన్, మూడు డ్యూయెల్ టోన్ కలర్స్‌ లో అందుబాటలోకి వచ్చింది. డ్యూయెల్ టోన్‌ లో సిజ్లింగ్ రెడ్‌ తో మిడ్‌ నైట్ బ్లాక్ రూఫ్, బ్రేవ్ ఖాకీతో ఆర్కిటిక్ వైట్ రూఫ్, స్ప్లెండిడ్ సిల్వర్‌ తో మిడ్‌ నైట్ బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ టోన్ కలర్స్ చూస్తే ఎక్స్యుబరెంట్ బ్లూ, మాగ్మా గ్రే, పెరల్ ఆర్కిటిక్ వైట్, సిజ్లింగ్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ధర ఎంతంటే?

మారుతీ సుజుకీ బ్రెజ్జా సెకండ్ జనరేషన్ బేసిక్ మోడల్ ఎక్స్‌షో రూమ్ ధర రూ.7,99,000. మారుతీ సుజుకీ బ్రెజా 2022 హైఎండ్ మోడల్ ధర రూ.13,96,000గా కంపెనీ నిర్ణయించింది.  

Published at : 07 Sep 2022 01:32 PM (IST) Tags: Maruti Suzuki TATA Nexon Brezza-2022 best selling SUV

సంబంధిత కథనాలు

Komaki electric scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అస్సలు మండదట, ఫీచర్స్ కూడా అద్భుతం!

Komaki electric scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అస్సలు మండదట, ఫీచర్స్ కూడా అద్భుతం!

Mercedes-Benz EQS 580: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 850 కి.మీ వెళ్లొచ్చు, మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ బెంజ్ కారు!

Mercedes-Benz EQS 580: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 850 కి.మీ వెళ్లొచ్చు, మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ బెంజ్ కారు!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Project Titan Apple: పట్టాలెక్కబోతున్న ఆపిల్ ‘ప్రాజెక్ట్ టైటాన్’, శరవేగంగా ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులు!

Project Titan Apple: పట్టాలెక్కబోతున్న ఆపిల్ ‘ప్రాజెక్ట్ టైటాన్’, శరవేగంగా ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులు!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు