Maruti Alto K10: కొత్త మారుతి ఆల్టో K10లో 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!
మారుతి సరికొత్త ఆల్టో K10ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు పొడవైన వీల్ బేస్ సహా పలు ప్రత్యేకతలను కలిగి ఉంది.
మారుతి చిన్న కార్ల విభాగంలో మంచి ప్రజాదరణ అందుకున్న కారు ఆల్టో. 2012లో దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ మధ్య తరగతి బడ్జెట్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. సుమారు 10 సంవత్సరాల తర్వాత ఈ కారును సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసొచ్చింది మారుతి కంపెనీ. ఈ కారులోని 10 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
*కొత్త హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందిన ఆల్టో K10 కారు.. గత మోడల్ తో పోల్చితే పొడవుగా ఉంది. మారుతి తన చిన్న కార్ల కోసం కలిగి ఉన్న కొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో సింక్‌లో ఎక్కువ ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. యాక్సెసరీస్ మరింత స్పోర్టియర్ గా ఉన్నాయి.
*ఇందులో పొడవైన వీల్ బేస్ ఉంది. అంతేకాదు.. విశాలంగా ఉంది. లెగ్ రూమ్ చాలా బాగుంది. బూట్ స్పేస్ 214 లీటర్లుగా ఉంది.
*ఇంటీరియర్ డిజైన్ మరింత మెరుగ్గా ఉంది. గత క్యాబిన్ కంటే అత్యాధునికంగా ఉంది. డిజిటల్ డాష్, టచ్ స్క్రీన్ ఆకట్టుకుంటుంది.
*సరికొత్త మారుతి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ కంట్రోల్స్, బేసిక్ సేఫ్టీ ఎక్యుప్మెంట్స్ ఉన్నాయి. కానీ, వెనుకవైపు పవర్ విండోలు లేవు. వెనుక వాష్/వైప్ ఫీచర్ కూడా లేదు.
*Dualjet 1.0 పెట్రోల్ S-ప్రెస్సో 66 bhp, 89Nm పీక్ టార్క్‌ను అందించనుంది. కేవలం 740 కేజీల బరువుతో, K10 మాన్యువల్‌లో వేగంగా వెళ్తుంది. రెవ్ హ్యాపీ నేచర్‌తో పాటు పని తీరు చాలా బాగుంటుంది. మాన్యువల్ లైట్ క్లచ్ తో కూడా చాలా బాగా రన్ అవుతుంది.
*గతంతో పోల్చితే ఏఎంటీలను చాలా మోడ్రనైజ్ చేశారు. ఆటోమేటిక్ డ్రైవ్ తక్కువ వేగంతో పాటు చాలా తక్కువ కుదుపులతో ఉంటుంది. ఏఎంటీ వెర్షన్ కోసం హిల్ హోల్డ్ ఫంక్షన్ ను కోల్పోవాల్సి ఉంటుంది.
*NVH స్థాయిలు కారు కంటే మెరుగ్గా ఉంటాయి. కానీ, లైట్ స్టీరింగ్ సిటీల్లో నడపడం చాలా సులభం చేస్తుంది. ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్ద గుంతల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
*గతంలోని ఆల్టో K10 కంటే హై స్పీడ్ ను కలిగి ఉంది. అయినా 100 km/h కంటే తక్కువ వేగంతోనే నడుస్తుంది.
*మాన్యువల్ కంటే AMT మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. మైలేజ్ 20kmpl పైనే ఉండనుంది.
*AMT టాప్-ఎండ్ AMTతో కూడిన మాన్యువల్‌పై రూ. 50,000 ప్రీమియంను కలిగి ఉంది. మాన్యువల్ ధర రూ. 5.3 లక్షల నుంచి 5.8 లక్షల మధ్య ఉంటుంది. సెలెరియో లేదా S-ప్రెస్సో రూ. 5 లక్షల ధర కలిగి ఉన్నాయి. వాటితో పోల్చితే ఈ కారు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
అటు ఇప్పటికే ఈ కారు పట్ల వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్టో మాదిరిగానే ఈ కొత్త కారు సైతం మంచి ఆదరణ దక్కించుకుంటుందని కంపెనీ భావిస్తోంది.